మోకిల పరిధిలో డ్రగ్స్ కలకలం
ముగ్గురు వ్యక్తుల అరెస్టు
శంకర్పల్లి, నేటిధాత్రి :
శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మాదకద్రవ్యాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మార్చ్ 29 ఆదివారము నాడు అందిన సమాచారం ఆధారంగా మోకిల పోలీసులు, ఎస్ఓటీ బృందం కలిసి నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జన్వాడ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, TS-10/EY-9191 నంబరు గల కారును తనిఖీ చేయగా, అందులో ప్రయాణిస్తున్న వారి వద్ద నుంచి సుమారు 39.72 గ్రాముల కోకైన్, కొద్దిపాటి గంజా, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు గోవా నుంచి కోకైన్ తెచ్చి హైదరాబాద్లో సరఫరా చేస్తూ, పార్టీలలో వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
