యాదాద్రి లో భక్తుల రద్ది…

యాదాద్రి లో భక్తుల రద్ది
స్వామి వారి ఖజానాకు 42 లక్షలకు పైగా ఆదాయం
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

 

 

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిలాడింది. ఆదివారం సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్‌క్స్‌ సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, వీవీ ఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హోమం నిర్వహించారు.స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా సాగింది.

 

ఉత్సవ మూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణ తంతును జరిపారు. స్వామివారి కల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారు జామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. ఖజానాకు రూ. 42,25,140 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో భవానీ శంకర్‌, అదనపు ఈవో నవీన్,తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ద్వారం మ్యూజిక్ అకాడమీ(కుమారి కావ్య అలేఖ్య) హైదరాబాద్ వారి బృందముచే భక్తి సంగీత కార్యక్రమము నిర్వహించారు. ఆలయ ఎస్ వి ఎఫ్ ఆర్ ఐ శేషగిరిరావు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ ప్రభు, కనకయ్య తిరుపతి సిద్దు ఆలయ సిబ్బంది ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంట కలుస్తున్న మానవత్వం…

మంట కలుస్తున్న మానవత్వం

డబ్బు,మత్తు మధ్య మాయమవుతున్న మనసులు

పరకాల,నేటిధాత్రి

 

ఈ కాలంలో మానవత్వం మంటలలో కరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.మనుషుల మధ్య ప్రేమ,పరస్పర గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయి.
డబ్బు కోసం బంధాలు కూడా దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పుడు మనిషి విలువ కంటే డబ్బు విలువ ఎక్కువైంది.సంబంధాలు కూడా లాభనష్టాల ఆధారంగా మారుతున్నాయి.తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమకన్నా ఆశలుపెరిగాయి.అన్నదమ్ములు మధ్య ఆస్తి గొడవలు సాధారణమయ్యాయి.స్నేహితులు కూడా అవసరాల మేరకే దగ్గరవుతున్నారు.
మానవ సంబంధాలు క్రమంగా వ్యాపార సంబంధాలుగా మారుతున్నాయి.మత్తు పదార్థాల ప్రభావం యువతపై తీవ్రంగా పడి స్నేహాలు కూడా మత్తు కోసం చిత్తవుతున్నాయి.చెడు అలవాట్ల వల్ల మంచి బంధాలు విరిగిపోయి వినోదం పేరుతో వ్యసనాలకు బానిసలవుతున్నారు.మత్తు వల్ల ఆలోచనా శక్తి తగ్గిపోయి
చెడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి.

పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళి డబ్బు కోసం మనుషులు విలువలను మరిచిపోయి నిజాయితీతో జీవించడం కష్టం అవుతోంది.స్వార్థం సమాజాన్ని క్రమంగా కరిగిస్తోంది.మనిషి మనిషిని నమ్మలేని స్థితి ఏర్పడి
స్నేహం కూడా నకిలీగా మారుతోంది.సామాజిక విలువలు క్షీణించడంతో పాటు మానవత్వం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో మార్పు చాలా అవసరం కాబట్టి మొదట మనం మనలో మారాలి,డబ్బు కంటే బంధాలకు విలువ ఇవ్వాలి.స్నేహాలను కాపాడుకోవాలి.మానవత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి.
ప్రేమ,సహనం,పరస్పర గౌరవం పెంపొందించాలి.
మనుషుల మధ్య అనుబంధాలను బలపరచాలి.అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుందని ఉండాలని కోరుకుందాం..

డాక్టర్.సంజీవ బొల్లారం
సైకాలజి కౌన్సిలర్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version