వాగ్దానం పట్ల అడుగుతే అక్రమ అరెస్టులా…

వాగ్దానం పట్ల అడుగుతే అక్రమ అరెస్టులా

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని అడుగుతే అరెస్టు చేస్తారా అని బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు ఆరోపించారు.
మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఆదుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్ కి నెలకు జీవన భృతి కింద ఇస్తామన్న ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శాంతియుతంగా వెళ్తున్న కార్మికులను నవతెలంగాణ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్, జిల్లా నాయకులు పెండం వెంకటేశ్వర్లు, గణేష్, నరసయ్యలను అరెస్టు చేయడం సరికాదన్నారు.ఆర్థిక ఇబ్బందులకు గురై రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేసియ చెల్లించాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లకి జీవన భృతి కింద నెలకు 20 వేల రూపాయలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆటో డ్రైవర్లకి రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి తద్వారా అర్హులైన కార్మికులకి సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని కోరారు.

 తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం…

 తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు అధినేత పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయమని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దామని మార్గనిర్దేశం చేశారు. కనీసం ఏపీ వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.

కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా, వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలో మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు. టూ వీలర్, ఏసీలు, కార్లు, వంటింటి వస్తువుల ధరలు తగ్గుతాయని వివరించారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులకు కూడా జీఎస్టీ తగ్గిందని… రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని గుర్తుచేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర లబ్ధి జరగుతోందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version