ఇండియన్ బ్యాంకులో ‘గోల్డ్ భాస్కర్’.. నిట్టనిలువునా ఖాతాదార్లు దగా..

ఇండియన్ బ్యాంకులో ‘గోల్డ్ భాస్కర్’.. నిట్టనిలువునా ఖాతాదార్లు దగా..

 

బ్రతుకుల్ని భయభ్రాంతులకు గురిచేసే ఘటన ఇది. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ జాతీయ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్.. జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంతానికి వేరే బ్యాంకులో తాకట్టు పెట్టాడు.

బెంగళూరు, ఫిబ్రవరి 16: బ్యాంకుల్లో నగదు, నగలు భద్రంగా ఉంటాయని నమ్మే సామాన్యులకు ఈ వార్త మింగుడుపడటం లేదు. బెంగళూరులోని గిరినగర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ బ్యాంక్ అధికారి, కస్టమర్లు లోన్ కోసం పెట్టిన బంగారాన్ని దొంగతనంగా వాడుకొని ఏకంగా రూ. 3.5 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు. న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..

బెంగళూరు గిరినగర్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా కిరణ్ కుమార్ (34) అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్, ఇంకా జూదానికి (Gambling) బానిసయ్యాడు. తన వ్యసనాల కోసం డబ్బు అవసరమవ్వడంతో బ్యాంకు లాకర్లపై తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. కస్టమర్లు గోల్డ్ లోన్ కోసం బ్యాంకులో ఉంచిన బంగారు ఆభరణాలను మెల్లమెల్లగా బయటకు తీసి, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు.

ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి వాటిని కోట్టేయ్యాలని అన్నను చంపిన తమ్ముడు..

ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి వాటిని కోట్టేయ్యాలని అన్నను చంపిన తమ్ముడు

కరీంనగర్, నేటిధాత్రి:

 

మతి స్థిమితం సరిగ్గా లేని అన్న పేరిట కోట్లాది రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలు, లక్షలాది రూపాయల గోల్డ్ లోన్ తీసుకున్నా తమ్ముడు, తర్వాత ప్లాన్ ప్రకారం అన్న మీదుగా టిప్పర్ పోనిచ్చి హత్య చేసి, తన అన్న ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి చనిపోయాడని అందరినీ నమ్మించి, ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్రయత్నించిన సంఘటన రామడుగు మండలంలో చోటుచేసుకుంది. కానీ, ఈహత్యను కళ్లారా చూసిన అల్లుడు జరిగిన విషయం చెప్పడంతో నేరం బయటపడింది. నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో నవంబర్ 29న జరిగిన ఈహత్యకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మామిడి వెంకటేశ్ వయస్సు ముప్పై ఏడు సం.లు, మామిడి నరేష్ ఉన్నారు. వెంకటేశ్ కు పెళ్లి కాలేదు. అతని మానసిక స్థితి కూడా సరిగా లేదు, నరేశ్ టిప్పర్లను నడపడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తూ, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, టిప్పర్ల ఈఎంఐల కోసం కోటి యాభై లక్షల వరకు అప్పులు చేశాడు. ఈక్రమంలో వెంకటేశ్ పేరు మీద వివిధ బ్యాంకుల్లో ఇటీవల నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడంతో పాటు, యాక్సిస్ బ్యాంకులో ఇరవై లక్షల గోల్డ్ లోని కూడా తీశాడు. వెంకటేశ్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు రావడంతో పాటు గోల్డ్ లోన్ కూడా మాఫీ అవుతుందన్న ఆలోచనతో తనని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. వెంకటేశ్ హత్యకు సహకరించాలని నరేశ్ ను కోరగా అందుకు నముండ్ల రాకేశ్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్ ఒప్పుకున్నారు. నవంబర్ 29న రాత్రి మట్టి లోడ్ నింపుకుని గ్రామ శివారుకు రావాలని డ్రైవర్ మునిగాల ప్రదీప్, నముండ్ల రాకేశ్ కు నరేశ్ సూచించాడని, ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం టిప్పర్ బ్రేక్ డౌన్ అయిందని సురేష్ కు ప్రదీప్ ఫోన్ చేశాడు. తన అల్లుడు సాయి, అన్న వెంకటేష్ కు జాకీ ఇచ్చి పంపిన సరేశ్ వారి వెనకే మరో ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఘటనా స్థలంలో డ్రైవర్ ప్రదీప్ టిప్పర్ను స్టార్ట్ చేసి ఉంచి, టైర్ కింద జాకీ పెట్టాలని వెంకటేశ్ కు సూచించడంతో, అతడు చెప్పినట్టుగా వెంకటేశ్ జాకీ పెట్టి తిప్పుతుండగా అక్కడికి చేరుకున్న నరేష్ టిప్పర్ను ముందుకు నడిపించాడు. దాంతో టిప్పర్ టైర్ వెంకటేశ్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్ కావాలనే టిప్పర్ ను ముందుకు నడపడం చూసిన సాయి ఆవిషయాన్ని తాత మామిడి నర్సయ్యకు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మామిడి నరేశ్, నముండ్ల రాకేశ్, మునిగాల ప్రదీప్ లను అరెస్టు చేశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే వెంకటేశ్ ను హత్య చేసినట్లు వారు విచారణలో ఒప్పుకున్నారు. రాకేశ్ ఫోన్ లో మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్న వీడియోను కూడా పోలీసులు గుర్తించారు. ఆఫోన్ తో పాటు ఇన్పూరెన్స్ పాలసీల డాక్యుమెంట్లు, బ్యాంకు పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version