* రైతులకు ఆదాయం పెంచే దిశగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం*
నేటిధాత్రి: మొగుళ్ళపల్లి
మొగుళ్లపల్లి మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు. ఈకార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి సురేందర్ గౌడ్ మాజీ సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు సర్పంచ్ చాట్లవిజయ రవీందర్ పలు గ్రామాల సర్పంచులు పాలక మండలి సభ్యులు సొసైటీ మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
