ఉపాధి హామీ పనులను ప్రారంభించిన నూతన సర్పంచ్…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామంలో సోమవారము ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పనులను గ్రామ కూలీలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ ఈజీఎస్ పనులకు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించి పేరు నమోదు చేసుకొని పనులకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో
పార్టీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ నవాజ్ రెడ్డి సుభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి వార్డ్ మెంబర్ ఆశప్ప ఒలి పాషా ఖాజా మియా నూతన జిపి పాలకవర్గం ప్రతినిధులతో పాటు గ్రామ కూలీలు పాల్గొన్నారు.
