వేములవాడలో జరిగే డిహెచ్ పిఎస్ రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయాలి
మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మార్చి 11, 12 ,13, తేదీల్లో వేములవాడలో నిర్వహించే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమావేశాలను
విజయవంతం చేయాలని డిహెచ్ పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి భద్రయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం గణపురం మండల కేంద్రంలో వేములవాడ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ హక్కుల సాధన కోసం డిహెచ్ పిఎస్ నిర్వహిస్తున్న రాష్ట్ర సమావేశాలకు కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశాల్లో అన్ని విషయాలపై సమగ్ర చర్చ జరగనుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కట్ల శంకరయ్య, చిలివేరు ఉదయాకర్, ఎల్కేటి సాంబయ్య, అమృత రాజేశ్వరి పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.