పౌర్ణమి వెన్నెల్లో దీపోత్సవం.. వేలాదిగా పాల్గొన్న భక్తులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మార్గశిర పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా గురువారం ఆధ్మాత్మికతను సంతరించుకుంది రాత్ర పౌర్ణమి వెలుగుల్లో నింగిలోని తారలన్నీ నేలపై వెలిగినట్లుగా… ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవ శోభతో బర్దిపూర్ ను పసిడి కాంతులతో నింపింది. తొలి దీపాన్ని స్వామీజీలు, భాజపా జాతీయ నాయకులు, మురళీధర్ రావు, హాజరై మఠాధిపతులు దీపాలను వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకునేందుకు, లక్ష దీపోత్సవాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శివలింగాకారంలో ఏర్పాటుచేసిన దీపోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. రాత్రికి సంస్కృతిక కార్యక్రమాలతో పాటు విశ్వ మానవ ధర్మ ప్రచార సభనిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల పీఠాధిపతులు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చంద్రశేఖర్, వివిధ ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
