గ్రామాల్లో ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి…

గ్రామాల్లో ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం జరపాలి

గణపురం తాసిల్దార్ కార్యాలయంలోమధురకవి సత్యనారాయణ స్వామి కి వినతిపత్రం అందించడం జరిగింది

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో గణపురం తాసిల్దార్ కార్యాలయంలో మధురకవి సత్యనారాయణ స్వామికి కుల నిర్మూలన వినతి పత్రం అందించడం జరిగింది భారత రాజ్యాంగ ప్రకారం దేశ రాష్ట్రవ్యాప్తంగా అంటరానితనం అస్పృశ్యత కుల వ్యవస్థ మూఢనమ్మకాలను అంశాలపై ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కరిస్తూ వాటిపై అవగాహన కల్పించడానికి ప్రతినెల 30న గ్రామాల్లో పౌర హక్కుల (సివిల్ రైస్ డే) దినోత్సవం జరపాలని అలాగే దళితవాడల్లో సహం పంక్తి భక్తి భోజనాలు ఏర్పాటు చేయాలి ఈ పౌర హక్కుల దినోత్సవం లో గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే విధంగా చూడాలని గ్రామంలోని సర్పంచ్ వార్డు నెంబర్లు కులాల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఈ పౌర హక్కుల దినోత్సవం పాల్గొనే విధంగా చూస్తూ సంబంధిత అధికారులతో అంటరానితనం కుల వ్యవస్థ అస్పృశ్యత మూఢనమ్మకాలపై దళితులకు అవగాహన కల్పించాలని ముఖ్యంగా ఇందులో సహా పత్తి భోజనాలు ఏర్పాటు చేయాలని తాసిల్దార్ కి వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జాతీయ కార్యదర్శి ఎండి సైదులు భాష మండల నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version