పేదింటి కలను నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యం..

పేదింటి కలను నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యం

* ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

నేటిధాత్రి,చేవెళ్ల:

 

ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. బుధవారం
చేవెళ్ల మండల పరిధిలోని దుద్దాగు గ్రామంలో నూతనంగా నిర్మించిన గూడెం చంద్రకళ, ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రామ సర్పంచ్ కావలి లక్ష్మి ప్రసన్న శేఖర్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలంటే సొంత ఇల్లు అవసరమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు లబ్ది పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా సర్పంచ్ కావలి లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెంటయ్య గౌడ్,చేవెళ్ల మండల నాయకులు, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పడాల ప్రభాకర్,మాజీ ఎంపీటీసీ న్యాలట బుచ్చయ్య,సింగప్పగూడెం,సర్పంచ్ రవి,తల్లారం దుద్దాగు ఉప సర్పంచ్ మొహమ్మద్ నవాజ్ వార్డు నెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version