2వ, రోజుకు చేరిన రంగంపేట భద్రకాళి దేవస్థాన నిరసన కార్యక్రమం
హన్మకొండ, నేటిధాత్రి:
11వ, డివిజన్ పరిధిలోని భద్రకాళి దేవస్థానాన్ని అనుకోని ఉన్న చెరబండరాజు నగర్ గుడిసెల్లో గత 23 సంవత్సరాల క్రితం నుండి నివసిస్తున్న దళితులను నేడు భద్రకాళీ మాడ వీధుల నిర్మాణాల పేరట అన్యాయంగా ఎలాంటి ఆశ్రయం మరియు జీవన ఉపాధి కల్పించకుండా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి వేసే కుట్రలను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ
ఈరోజు బిఆర్ఎస్ పార్టీ 5వ,డివిజన్ అధ్యక్షులు బొల్లేపెల్లి పున్నం చందర్ ఆధ్వర్యంలో,
కాలని వాసులను కలుపుకొని, చెరబండరాజు నగర్ గుడిసెల్లో ఉన్న దళితుల ఆరాధ్య దైవమైన డా,,బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, గుడిసె వాసులకు న్యాయం జరగాలని మాల మహానాడు కుల సంఘ నాయకుల మద్దతు కూడా ప్రకటించి అలాగే అన్ని దళిత వర్గాల ప్రజలు కదలి వచ్చి గుడిసె వాసులకు న్యాయం జరిగేంత వరకు అండగా నిలవాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు
పండుగ సాగర్, మూల ప్రభాకర్, దాసరి సమ్మన్న, విశాల్, ప్రభాకర్ మరియు చెరబండరాజు నగర్ వాసులు మొదలైన పాల్గొన్నారు.
