ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు గడువు పెంచాలి
ప్రజావాణిలో తహసీల్దార్ కి వినతిపత్రం అందజేత
ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తు గడువు పెంచాలని ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ ఆధ్వర్యంలో ప్రజావాణిలో తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, సోలార్ పంపు సెట్లు కోసం దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం అనేక కొర్రిలు పెడుతుందని, కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక కొంతమంది దరఖాస్తు చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ మరియు బ్యాంకు కాన్సంట్ లేకుండా రుణాలు ఇవ్వాలని, దరఖాస్తుదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గడువు పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీడీ సదానందం మాదిగ, బోయిని మధుకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు..
