ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు….

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సేవలన స్మరించుకుంటూ తొలి తరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు
కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, మేనేజర్ సురేష్ రెడ్డి,రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి. శ్రావణ్ కుమార్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రదీప్, ఎ. బాబు,వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్‌లు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వీరనారి ఐలమ్మకు జిల్లా ఎస్పీ ఘనమైన నివాళులు…

వీరనారి ఐలమ్మకు జిల్లా ఎస్పీ ఘనమైన నివాళులు

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకులు

మహబూబాబాద్/ నేటి దాత్రి

చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్,

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ,
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని, బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీ విజయప్రతాప్, ఎస్.బి, డి.సి.ఆర్. బి సీఐ సత్యనారాయణ, ఎస్.ఐ వెంకన్న జితేందర్, ఆర్.ఎస్.ఐ శేఖర్,డిపివో అధికారులు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు…

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

* మహదేవపూర్ సెప్టెంబర్10నేటి ధాత్రి *

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో చెన్నూరి వెంకటయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
వీర నారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించిన చాకలి ఐలమ్మ గారి గురించి మాట్లాడుతూ మన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని మరియు చాకలి ఐలమ్మ సామాజిక మానవత్వం కోసం అణిచివేతకు వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు ఐలమ్మ పోరాటం కేవలం ఒక వర్గానికి కాకుండా మొత్తం సమాజానికి స్ఫూర్తిదాయమని నేటి యువత ఐలమ్మ ధైర్యసహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో న్యాయం మానవత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో చెన్నూరి
వెంకటయ్య బోనగిరి చంద్రయ్య చెన్నూరు శివ, నస్పూరిసాయి, నరేష్, రాంబాబు, మరియు రజక సంఘం సభ్యులు యువకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version