వీరనారి ఐలమ్మకు జిల్లా ఎస్పీ ఘనమైన నివాళులు…

వీరనారి ఐలమ్మకు జిల్లా ఎస్పీ ఘనమైన నివాళులు

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకులు

మహబూబాబాద్/ నేటి దాత్రి

చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్,

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ,
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని, బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీ విజయప్రతాప్, ఎస్.బి, డి.సి.ఆర్. బి సీఐ సత్యనారాయణ, ఎస్.ఐ వెంకన్న జితేందర్, ఆర్.ఎస్.ఐ శేఖర్,డిపివో అధికారులు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version