ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి
నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సేవలన స్మరించుకుంటూ తొలి తరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు
కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, మేనేజర్ సురేష్ రెడ్డి,రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి. శ్రావణ్ కుమార్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రదీప్, ఎ. బాబు,వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్‌లు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.