ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
* మహదేవపూర్ సెప్టెంబర్10నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో చెన్నూరి వెంకటయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
వీర నారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించిన చాకలి ఐలమ్మ గారి గురించి మాట్లాడుతూ మన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని మరియు చాకలి ఐలమ్మ సామాజిక మానవత్వం కోసం అణిచివేతకు వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు ఐలమ్మ పోరాటం కేవలం ఒక వర్గానికి కాకుండా మొత్తం సమాజానికి స్ఫూర్తిదాయమని నేటి యువత ఐలమ్మ ధైర్యసహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో న్యాయం మానవత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో చెన్నూరి
వెంకటయ్య బోనగిరి చంద్రయ్య చెన్నూరు శివ, నస్పూరిసాయి, నరేష్, రాంబాబు, మరియు రజక సంఘం సభ్యులు యువకులు పాల్గొన్నారు