*ఈ నెల 26 లోపు 2002 సంవత్సరపు ఎన్నికల జాబితా అనుసంధానం పూర్తి చేయండి..
*నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్.మౌర్య..
తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర23
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు 2002 సంవత్సరపు ఓటర్ జాబితాతో 2025 జాబితాను ఈ నెల 26 లోపు అనుసంధానం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య బి.ఎల్. ఓ లను ఆదేశించారు. 2002 సంవత్సరపు ఓటర్ జాబితా తో 2025 జాబితా అనుసంధానం చేసే విధానంపై స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు మంగళవారం బి.ఎల్. ఓ.లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారుఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు అందరూ 2002 ఓటర్ల జాబితాతో 2025 జాబితాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మీ అందరికీ 2025 జాబితాలో 35 సంవత్సరాలు నిండిన వారి జాబితాను ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈ రెండు సరిపోల్చుకుంటూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది గుర్తించాలని తెలిపారు.
ఈ ప్రక్రియను సెప్టెంబర్ 26 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పి4 సర్వే పై సచివాలయ కార్యదర్శులకు డిజిటల్ శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ రవి, తహసీల్దార్ సురేష్ బాబు, సిబ్బంది, బి.ఎల్. ఓ లు ఉన్నారు.