ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
పూలే ఆశయాలను కొనసాగించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలను బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిరా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య హాజరైనారు అనంతరం జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మహాత్మా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర పూణేలో మాలి కులంలో జన్మించాడు ఆయన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో సామాజిక సంస్కరణలకు పునాది వేశాడు 1890 నవంబర్ 28న 63 ఏళ్ల వయస్సులో మరణించాడు
జయంతి
జ్యోతిరావు పూలే జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుగుతుంది. ఈ రోజు ఆయన సామాజిక సేవలను గుర్తు చేసుకుని జరుపుకుంటారు.
ఆయన సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంది.
జీవిత చరిత్ర
జ్యోతిరావు తండ్రి గోవిందరావు కూరగాయలు అమ్మేవాడు ముస్లిం టీచర్, క్రైస్తవుల సహాయంతో ఆంగ్ల విద్యాభ్యాసం పూర్తి చేశాడు 1841లో స్కాటిష్ మిషన్ పాఠశాలలో చదువుకున్నాడు
ప్రధాన ఉద్యమాలు
1848లో పూణేలో అంటరాని బాలికలకు మొదటి పాఠశాల స్థాపించాడు
1851లో రెండు పాఠశాలలు, 1855లో రాత్రి బడులు ప్రారంభించాడు
1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రం, వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించాడు
1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజం స్థాపించి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు
1888లో ముంబై సమావేశంలో ‘మహాత్మా’ బిరుదు పొందాడు కుల వ్యవస్థ, మహిళా విద్య, శూద్రుల హక్కుల కోసం పోరాడి ఆధునిక భారత సామాజిక సంస్కరణలకు మార్గదర్శకుడు నిలిచాడు అని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి మధుసూదన్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు కౌన్సిలర్లు అప్పం కిషన్ శోభ రాజేష్ నాయకులు పుల్ల మహేష్ భద్రయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
