Gambhir Dedicates T20 World Cup Trophy
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్
భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నానని తెలిపాడు. తన కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) విశ్వవిజేతగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే. నిన్న(ఆదివారం) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడుసార్లు టైటిల్ అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎమోషనలయ్యాడు. ఈ ట్రోఫీని ఇద్దరు వ్యక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
