DISHA Meeting Focuses on Effective Implementation of Government Schemes
ఓటమి వచ్చిన ప్రజల వైపే అడుగులు
భాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం,సరుకుల వితరణ కార్యక్రమాలు
ప్రజల కష్టాలలో ముందుంటున్న మాజీ కౌన్సిలర్ రజిని నవీన్
పరకాల,నేటిధాత్రి
గెలిచినా ఓడినా ప్రజా సేవే తమ లక్ష్యమని,ప్రజలే తమకు దైవమని పరకాల మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ అన్నారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పరకాల పట్టణంలోని 17వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శనిగరం రజినీ నవీన్ పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క బ్యాలెట్ ఓటుతో ఓడిపోయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా ప్రజల మధ్యనే ఉండి సేవ కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా రజినీ నవీన్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజమని తెలిపారు.ప్రజల కోసం పని చేయడమే తమ అసలు లక్ష్యమని చెప్పారు. ప్రజలు చూపిన ఆదరణ,విశ్వాసం తనకు మరింత బాధ్యతను కలిగించిందని అన్నారు.గతంలో తాము పరకాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని ఆయన తెలిపారు.తమ సేవలను గుర్తించిన ప్రజలు రిజర్వేషన్లో భాగంగా 17వ వార్డులో పోటీ చేయాలని కోరడంతో పాటు పార్టీ ఆదేశానుసారం ఎన్నికల బరిలోకి దిగినట్లు పేర్కొన్నారు.అయితే ఎన్నికల్లో కేవలం ఒకే ఓటు తేడాతో ఓటమి చెందినప్పటికీ ప్రజలపై ఉన్న నమ్మకం ఏమాత్రం తగ్గలేదని ఆయన అన్నారు.తమకు ఓటు వేసిన వారే కాకుండా ఓటు వేయని ప్రజల కోసం కూడా సమానంగా సేవ చేస్తానని తెలిపారు.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండటం తన బాధ్యతగా భావిస్తున్నానని వార్డు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఇటీవల 17వ వార్డులో మరణించిన కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా అవసరమైన సహాయం కూడా అందిస్తున్నారు.ఓడిపోయిన అభ్యర్థి అయినప్పటికీ ప్రజల పట్ల చూపుతున్న ఈ స్పందన చర్చనియమైంది.ప్రజా సమస్యల విషయంలో వెంటనే స్పందిస్తూ ప్రజల మధ్య ఉండడం ఆయన నాయకత్వ లక్షణాన్ని చూపిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల్లో ఓటమి వచ్చినప్పటికీ ప్రజా సేవలో వెనుకడుగు వేయకపోవడం అభినందనీయమని వార్డు ప్రజలు చెబుతున్నారు.ప్రజల పట్ల ఆయన చూపుతున్న అంకితభావం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మధ్యనే ఉంటానని మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
