Financial Aid for Bereaved Family
దశ దిన ఖర్మలకు శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ ఆర్ధిక సహాయం
బాధిత కుటుంబాన్ని పరామర్శించి,ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఛైర్మెన్ బాడిశ నాగరమేష్
మంగపేట నేటిధాత్రి
ములుగు జిల్లా మంగపేట మండలం పాలయి గూడెం గ్రామం లో జక్కా నర్సింహా రావు తల్లి జక్కా కాంతమ్మ ఇటీవల అనారోగ్యం కారణాల వల్ల మరణించగా గ్రామస్తుల నుండి విషయం తెలుసు కున్న శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ కాంతమ్మ దశ దిన ఖర్మలకు విచ్చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ మనోధైర్యం చెప్పి 5000రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
పిలవగానే వెంటనే వచ్చి సహాయం చేసిన నాగరమేష్ కి అక్కడి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియ జేశారు .
