సజ్జనపు సరస్వతి ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకురాలు
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:
కేసముద్రం. మండల కేంద్రంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం. జరిగింది.
6 గ్యారంటీల అమలకై ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే ధర్నా కు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని సజ్జనపు సరస్వతి మాట్లాడుతూ
సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 20వ తారీఖున హైదరాబాదులో జరుగు ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ మాట్లాడారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీఅమలుపరచటంలో పూర్తిగా విఫలమైందని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలో వేస్తామన్న రైతుబంధు ఎకరంకు 15000 ఇస్తామన్నారు ప్రతి మహిళా ఖాతాలో 2500 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు. భూమిలేని నిరుపేదలకు 12000 ఇస్తామన్నారు రేషన్ కార్డులు ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్లు వివిధ రకాల పెన్షన్లుఆరు గ్యారంటీలు 420 వాగ్దానాలు చేసి అందరికీ అందిస్తామని మాయ మాటలుచెప్పి అరచేతిలో స్వర్గం చూపించి అన్ని వర్గాల ప్రజలందరినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి కపట నీతిని ప్రజలందరూ అర్థం చేసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతూ వీటి అమలుకై ఈనెల 20 తారీఖున హైదరాబాదులో జరుగు భారీ ప్రదర్శన బహిరంగ సభ ఇందిరా పార్క్ లో ధర్నాకు ప్రజలు పెద్దవేత్తుగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు అనుబంధ కూలీ యూనియన్ నాయకులు ఏమి, జాటోత్ మంజుల, వినోద్ విజయ, రజిత, రంగమ్మ ,లలిత, రుక్కమ్మ , ప్రమీల, రాధిక, లలిత, పార్వతి, శోభ, కమిలి, చిట్టి,తదితరులు పాల్గొన్నారు.