ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్
వరంగల్ నగరంలో నిర్వహించే ఎస్సై తుది రాతపరీక్షను సజావు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. రాష్ట్ర పోలీస్ నియామక బోర్డ్ ద్వారా సబ్-ఇన్స్‌స్పెక్టర్ (సివిల్) ఉద్యోగాల నియామాకాలలో భాగంగా శని, ఆదివారాలలో నిర్వహించే తుది రాతపరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై వరంగల్ రీజీనల్ కో-ఆర్డినేటర్ (కేయూ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్స్‌పల్) ఫ్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పోలీస్ నోడల్ అధికారి వెస్ట్‌జోన్ డిసిపి బి.శ్రీనివాస్‌రెడ్డి, బయోమెట్రిక్ విభాగం అధికారి షీం టీం ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావుతో పోలీస్ కమీషనర్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షా కేంద్రాల నిర్వహణ, పోలీస్ బందోస్తుతోపాటు ప్రశ్న, జవాబుల పత్రాలకు సంబంధించి తీసుకుంటున్న భద్రతపై పోలీసు కమిషనర్ అధికారలతో సమీక్షా జరిపారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ రాత పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, 11,874మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ రాతపరీక్షలను 19 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం 2.30గంటల నుండి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహింబడుతుందని తెలిపారు. ఈ పరీక్షకు19మంది చీఫ్ సూపరింటెండెట్లు, 26మంది పరిశీలకులు, 56మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లతోపాటు బందోబస్తు నిమిత్తం ఇన్స్‌స్పెక్టర్లు7, ఎస్సైలు14, 90మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్లతోపాటు, పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులను తనీఖీ చేసేందుకు 72మంది పోలీస్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుండగా, ఇందులో 30మంది మహిళా పోలీసులు ఉన్నారని తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు తెలుసుకునేందుకు పోలీసుల అధ్వర్యంలో బస్టాండ్స్, రైల్వేస్టేషన్లు, ముఖ్యకూడళ్లల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, ప్రధాన మార్గాలతోపాటు ముఖ్య మార్గాల్లో అభ్యర్థులకు కనిపించే విధంగా పరీక్షా కేంద్రాల సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేందుకు పరీక్ష నిర్వహించే ప్రాంతాలకు వేళ్ళేందుకు రైల్వే, బస్టాండ్స్ నుండి అదనంగా ఆర్టీసీ బస్‌లను ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
అభ్యర్థులు చేయకూడనవి:
ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమించరని, బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు పరీక్ష గదిలో తీసుకుంటారని, ఎవరైనా ఒకరికి బదులు మరోకరూ పరీక్ష రాయాటానికి ప్రయత్నిస్తే సులువుగా పట్టుబడుతారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు, ట్యాబులు, పెన్‌డ్రైవ్, బ్లూటూత్, వాచ్‌లు, క్యాలిక్యులేటుర్లు, పర్సులను పరీక్ష కేంద్రానికి అనుమతించరని, చేతులకు మెహింది వేసుకోని వచ్చే అభ్యర్థులను అనుమతించరని తెలిపారు.
అభ్యర్థులు చేయాల్సినవి:
అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని, కావున అభ్యర్థులు నిర్థేశించిన సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు హల్ టికెట్, బాక్ల్ లేదా బ్లూ పెన్ తప్పనిసరి తెచ్చుకోవాలని, అభ్యర్థులు ఈ మధ్యకాలంలో దిగినటువంటి పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఒకటి ఖచ్చితంగా తీసుకరావాలని తెలిపారు.