Corruption Row in Paddy Procurement Centers
అక్రమార్కుల చేతికే మళ్ళీ కొనుగోలు కేంద్రాలు
** నిద్రమత్తులో సంబంధిత అధికారులు
**మండలమంతా కోడై కూసినా మళ్లీ వారికి కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటో?
**జ్వలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడేల నరేష్
మంగపేట నేటిధాత్రి
మండలంలో గత వర్షాకాలం సీజన్ లో నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మ్యాక్స్ సెంటర్ నిర్వాహకులు అవక తవకలకు పాల్పడి వారి సంబంధికుల ఖాతాలోకి ప్రభుత్వం నుంచి డబ్బులు కొట్టించుకున్న పరిస్థితి మండలమంతా నెలరోజులపాటు కోడై కూసింది.కొన్ని రకాల నిగా వర్గాలు గుట్టుచప్పుడు కాకుండా ఎంక్వయిరీలు జరిపినట్లు తెలిసిందే ఇంత జరిగినా మరలా ఈ సీజన్ ధాన్యం కొనుగోలు అధికారపార్టీ అండదండలతో ఎన్ని కుంభకోణాలు చేసిన ఎన్ని తప్పులు చేసిన మళ్ళీ వారికే మాక్స్ సెంటర్ లు గవర్నమెంట్ కట్టబెట్టడం చూస్తుంటే సంబంధిత అధికారులు నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తుందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారని జ్వలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడల నరేష్ ఆరోపిస్తున్నారు. వెంటనే కొనుగులు నిలిపివేసి నిరుద్యోగులె వరికైనా అప్పగించి కొనుగోలు నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు. తధ్వారా అక్రమాలను అరికట్టినవారవుతారని అభిప్రాయపడ్డారు
