ORS Packets Distributed To Workers
ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందించిన సర్పంచ్
అప్పయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో కోడిశలకుంట లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ ఎలకపల్లి రమేష్ సందర్శించి వారికి పని ప్రదేశంలో ఉండవలసిన వసతులు తాగునీటి సౌకర్యం నీడ సౌకర్యం ప్రధమ చికిత్స పెట్టే సౌకర్యం హాజరు పట్టిక ప్రతిరోజు సంతకాలు పెట్టాలి కనీస వేతన డబ్బులు సరిగ్గా వేస్తున్నారా కూలీలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఎండ తీవ్రంగా ఉండటంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రాజశ్రీ కాంగ్రెస్ పార్టీ శాఖా అధ్యక్షులు కొడారి రవీందర్ ఆశా వర్కర్ సంధ్య ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు
