`గులాబీ వనం నుంచి కాషాయ దళానికి!?
`తెలంగాణ బీజేపీలో ప్రీతి రెడ్డికి పెద్ద పీట!

`మాదవి లతను పక్కన పెట్టి ప్రీతి రెడ్డికి ప్రాధాన్యత!
`ఉన్నత విద్యా వంతురాలు.. బాహుబషా కోవిదురాలు.

`మృదుబాశి.. విశ్లేషనా శక్తి.
`యువతలో కోట్లాది మంది ఫాలోవర్స్.

`లక్షలాది మంది విద్యార్థుల సైన్యం.
`ప్రీతి రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు విద్యార్థుల సహకారం.
`విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు.
`విద్యా సంస్థల నిర్వహణలో గొప్ప విజయురాలు!
`వ్యాపార రంగంలో విజయాలను చూసిన వారు.
`ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను తీర్చి దిద్దుతున్నారు.
`దేశ భవిష్యత్తును నిర్మించే నిపుణులలను తయారు చేస్తున్నారు.
`భవిష్యత్తు భారతవానికి అన్ని రంగాలలో సైనికులను తయారు చేస్తున్నారు.
`మల్లారెడ్డి విద్యా సంస్థ లలో చదువుకున్న వాళ్ళు గొప్ప స్థాయిలో
వుంటున్నారు.
`వాళ్లంతా ప్రీతి రెడ్డి వెనుక సైనికులుగా వున్నారు.
`మల్కాజిగిరి నుంచి ప్రీతి పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు యువతే
తీసుకుంటారు.
`బీజేపీని తెలంగాణ లో కంచు కోటను చేస్తారు.
`తెలంగాణలో తిరుగు లేని మహిళా బీజేపీ శక్తిని తయారు చేస్తారు.
`మాదవి లత వల్ల బీజేపీ కి ఒరిగింది లేదు?
`బీజేపీ మూలంగానే మాదవి లతకు గుర్తింపు!
`మాదవి లత అతి వల్ల బీజేపీకి ఎదురుతున్న ఇబ్బందులు!
`వెటకారపు మాట తీరుతో పార్టీకి తలనొప్పులు!
`మీడియాతో కూడా పుల్ల విరుపు మాటలు?
`తెలంగాణ యాసను ఇదే అన్నట్లు విచిత్రమైన పదాలు!
`మసీదు ముందు బాణాలు ఎక్కుపెట్టడాలు?
`ముస్లింలతో కలిసి దర్గా సందర్శనలు!
`మాటకు ముందు ప్రవచనల సూక్తులు!
`ముస్లింలను రెచ్చగొట్టేలా చర్యలు!
`వివాదాల చుట్టూ మాధవి లేని పోని ముచ్చట్లు!
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణలో పూలమ్మిన, పాలమ్మిన అనే మాట ట్రెండ్ సెట్టింగ్. ఆ మాట వినని వారు వుండదు. ఆ మాట చెప్పే చామ కూర మల్లారెడ్డి తెలియని వారుండరు. ఒక్క మాటతో తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి. అలాంటి మల్లారెడ్డి చెప్పే ఏకైక మాట కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టపడందే ఏదీ రాదు. కష్టం చేయకుండా ఏ ఫలితం దరి చేరదు. ఎంత కష్టపడితే అంత విజయం వరిస్తుందని రుజువు చేసిన నాయకుడు. విద్యా వేత్తకాకుండా విద్యా సంస్ధలు ఏర్పాటు చేశారు. రాజకీయాలు తెలియకన్నా రాజకీయ నాయకుడయ్యారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. ఓ వైపు విద్యా సంస్దల అదినేతగా, మరో వైపు రాజకీయ నాయకుడిగా సేవలందిస్తున్నారు. అటు యువత జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. ఇటు రాష్ట్ర గతిని మార్చే రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్నారు. అలాంటి శ్రమైక వాది, ఆచరణ వాది మల్లారెడ్డి కుటుంబం నుంచి మలి తరం కూడా రాజకీయాల్లోకి వచ్చింది. ఆయన అల్లుడు మర్రి రాజశేఖరెడ్డి రెడ్డి కూడా ఇప్ప్పుడు మల్కాజిగిరి ఎమ్మెల్యేలగా గత ఎన్నికల్లో గెలిచారు. అయితే మంత్రి మల్లారెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విద్యా సంస్ధలను చూసుకుంటూ, మల్లారెడ్డి రాజకీయాలను క్షేత్ర స్దాయిలో సమన్వయం చేస్తున్న మహిళా శక్తి ప్రీతిరెడ్డి. మామయ్య మల్లారెడ్డి రాజకీయాలను కూడా భుజాన వేసుకొని, ఆయన గెలుపు రాజకీయాలలో కీలకభూమిక పోషిస్తున్న నాయకురాలు ప్రీతిరెడ్డి. ఇప్ప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆమె కూడా ఒక హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పటి వరకు కారు పార్టీలో వున్న ప్రీతిరెడ్డి కమలం గూటికి చేరనున్నట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏకంగా మల్లారెడ్డి కుటుంబమే బీజేపి వైపు వెళ్తున్నట్లు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాని కేవలం ప్రీతిరెడ్డి మాత్రమే కమలం గూటికి చేరనున్నట్లు కూడా తెలుస్తోంది. సహజంగా ప్రీతిరెడ్డి ఎంతో మృధుస్వభావురాలు. ఆమె మాట తీరు అందర్ని ఆకట్టుకునేలా వుంటుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఆమె సామార్ధ్యం ఏమిటో నిరూపించుకున్నది. మల్లారెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ ఆమె ప్రచారం ముందుండి చేస్తున్నారు. మల్లారెడ్డిని ఘన విజయంలో భాగస్వాములౌతున్నారు. అంతే కాకుండా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో జరిగే ప్రతి స్దానిక సంస్ధల ఎన్నికల్లోనూ బిఆరఎస్ అభ్యర్ధుల గెలుపు బాద్యతలు ఆమె తీసుకుంటున్నారు. బిఆరఎస్‌కు అనేక విజయాలు అందిస్తున్నారు. ముఖ్యంగా పిర్జాదీగూడ మున్సిపల్ కార్పోరేషన్, జవహర్ నగర్ కార్పోరేషన్‌ను గెలుపు బాద్యతలు ఆమె ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ రెండు కార్పోరేషన్లు బిఆరఎస్ కైవలం చేసుకునేలా రాజకీయం చేశారు. రెండు గెలిచి బిఆరఎస్ పార్టీ జెండా రెండు మున్సిపల్ కార్పోరేషన్ýలో ఎగురవేశారు. అలా ఆమె ఎన్నికల ప్రచార రాజకీయంలో కూడా గెలుపు బాటలు వేశారు. అలాంటి ప్రీతి రెడ్డిని బిజేపి పార్టీలోకి పార్టీ పెద్దలు ఆహ్వానించినట్లు విశ్వసనీయమైన సమాచారం. నిజానికి గత ఎన్నికల్లోనే ఆమె మల్కాజిగిరి పార్లమెంటునుంచి కారు పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కాని సాధ్యపడేలేదు. బిఆరఎస్‌లో వుంటే ఆమెకు టికెట్ దక్కే అవకాశం లేదు. అందుకే ఆమెను బిజేపి పార్టీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ బిజేపిలో హైదరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసిన మాధవీ లత పేరు మాత్రమే వినిపిస్తూ వచ్చింది. ఆమెకు బిజేపి అనేక రకాలుగా అవకాశాలు కల్పించింది. కాని ఆమె వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. ఆమె స్ధానం భర్తీ చేయడానికి, ప్రీతి రెడ్డిని బిజేపి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పైగా మహిళా బిల్లు అమలు చేసే క్రమంలో ప్రతి రాష్ట్రంలో విభిన్నమైన రంగాలలో అత్యంత ప్రభావ వంతమైన మహిళా మణులను గుర్తించి ప్రోత్సంచాలని బిజేపి అనుకుంటోంది. దేశంలో 50 సంవత్సరాల పాటు పాలన సాగించిన కాంగ్రెస్ మహిళ బిల్లు తేలేదు. కాంగ్రెస్ హాయాంలో ఎన్ని పార్టీలు పట్టుపట్టినా మహిళా బిల్లు సాకారం కాకుండా కాంగ్రెస్ అడ్డుకున్నదనే అపవాదువుంది. కాని తొలిసారి బిజేపి మహిళాబిల్లును తెచ్చింది బిజేపి. పార్లమెంటులో బిల్లు పాస్ చేయించింది. మహిళా బిల్లు చట్టమైంది. మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును తెచ్చిన బిజేపికి మహిళా శక్తి అవసరం. మహిళలను రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి బిజేపి గత కొంత కాలంగా కృషి చేస్తోంది. అన్ని రాష్ట్రాలలో వివిధ రంగాలలో మేటి మహాళలను బిజేపిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ప్రీతి రెడ్డి రాజకీయం గురించి తెలుసుకున్నారు. ఆమె ఉన్నత విద్యా సంస్ధల నిర్వహణ బాధ్యతలే కాదు, మల్లారెడ్డి రాజకీయ విజయాలకు కూడా బాటలు వేస్తున్నది. మల్లారెడ్డి వ విద్యా సంస్ధలు అనేవి తెలంగాణలోనే అతిపెద్ద విద్యా సంస్ధలు. ఏటా సుమారు 4లక్షల మంది విద్యార్దులు ఆయా సంస్ధలలో చదువుకుంటుంటారు. అందరూ మల్లారెడ్డికి సుమారు 27 కాలేజీలున్నాయి. అందులో నాలుగు అటానమస్ యÖనివర్సిటీలున్నాయి. అంత పెద్ద బాద్యతను కేవలం ప్రీతిరెడ్డి మాత్రమే నిర్వహిస్తున్నారు. వారి రాజకీయ జీవితాలకు విద్యార్దుల ఎంతో తోడ్పాటునందిస్తున్నారు. అందరూ యÖనివర్సిటీ స్దాయి విద్యార్ధులు కావడం కూడా మల్లారెడ్డి రాజకీయానికి అదనపు బలంగా మారింది. కొన్ని వేల మందికి ఉపాది అవకాశాలు కల్పిస్తున్నారు. మల్లారెడ్డి మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన సమయంలో కూడా విద్యార్ధులే ఆయన గెలుపులో కీలకభూమిక పోషించారు. ఇప్ప్పుడు కూడా ఆయా సంస్ధల నుంచి చదువుకొని బైటకు వచ్చిన వారు, ఇప్ప్పుడు చదువుకుంటున్న వాళ్లు కొన్ని లక్షల్లో వున్నారు. వాళ్లంతా మల్లారెడ్డి ఏది చెబితే అది వింటారు. మల్లారెడ్డి రాజకీయాలకు ఇప్పటికీ తోడ్పాటునందిస్తుంటారు. వాళ్లందరినీ సమన్వయం చేస్తూ ప్రీతిరెడ్డి ముందుకు వెళ్తుంటారు. అలాంటి ప్రీతిరెడ్డి వచ్చే నెల 10న తెలంగాణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో ప్రీతిరెడ్డి కమలం కండువా కప్ప్పుకుంటారని పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో బిజేపికి బలమైన మహిళా శక్తిని అందించడంలో ప్రీతిరెడ్డిని మించిన వాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ఇప్పటి వరకు మాదవీ లతకు బిజేపి ఎంతో ప్రాదాన్యతనిచ్చింది. కాని మాధవి లత చేసిన రాజకీయం వల్ల బిజేపికి మైలేజీ కన్నా, మైనసే ఎక్కువైంది? బిజేపి వల్ల ఆమె ప్రచారం పొందిందే తప్ప ఆమె వల్ల బిజేపి ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. పుల్ల విరిచినట్లు ఆమె వుండే మాట తీరు వల్ల పార్టీకి మేలు జరగకపోవగా నష్టమే జరిగిందనే వాళ్లే ఎక్కువగా వున్నారు. ఆమె మాట్లాడే మాటలకు, చేసే చేతలకు పొంతన వుండేవి కాదని అంటారు. ప్రశాంతంగా వున్న చోట సమస్యలు సృష్టించి వివాదలు మÖట గట్టుకోవడం ఆమెకు అýవాటుగా మారింది. ఆఖరుకు మీడియాతో కూడా మాట్లాడే సమయంలో ఆమె మాట తీరు ఎవరూ నచ్చకుండాపోతోంది. తెచ్చిపెట్టుకున్న తెలంగాణ యాసను ఆమె నుంచి వెటకారంగా తోస్తుందన్న వాదనలున్నాయి. పైగా తరుచూ లేని పోని వివాదాలను ఆమె సృష్టిస్తూ బిజేపి మీద ప్రజలకు వున్న మంచి భావనను కూడా ఆమె దూరం చేసేలా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ గుడి దగ్గర పెద్ద వివాదం సృష్టించారు. ఓ గుడి విషయంలో ఆమె నానా యాగి చేసి సాధించిందేమీ లేదు. ఏపిలో తిరుమల లడ్డూ విషయంలో ఆ రాష్ట్ర బిజేపి నేతలకన్నా ఎక్కువ స్పందించి రాజకీయ ం చేయాలనుకున్నారు. ఏపి బిజేపి నాయకులు సైలెంట్‌గా తిరుమల లడ్డూ విషయంలో ఆచి తూచి అడుగులేయాలని చూస్తున్న సమయంలో ఆమె చేసిన రాజకీయం బిజేపికి మైనస్ అయ్యింది. హైదరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశమిస్తే ఆమె మసీదుల ముందు రామ బాణం వదిలినట్లు చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగింది. రావాల్సిన ఓట్లు కూడా పోయాయి. ఓ వైపు హిందుత్వ భావజాýం ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తూనే, మరో వైపు ముస్లిం మహిళలతో కనిపించడం పెద్దఎత్తున వైరల్ అయ్యింది. ఆ మధ్య విమానాశ్రయంలో ఆమె దండకాలు చదవడం చేసింది. షిర్డీ సాయి మీద కొన్ని వ్యాఖ్యలు చేసి పార్టీ చేత చీవాట్లు తిన్నంత పని చేసుకున్నది. అలాంటి మాధవి లత వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని గ్రహించిన పార్టీ చాలా కాలంగా ఆమెను పక్కన పెట్టారు. ఇప్ప్పుడు ఉన్నత విద్యావంతురాలు ప్రీతిరెడ్డిని తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
