prajalu jagrathaga vyavaharinthali, ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలి

ప్రజలు జాగ్రత్తగా వ్యవహారించాలి

ఇటీవల కాలంలో కొంతమంది నేరచరిత్ర గల అంతర్‌రాష్ట్ర ముఠాలు తప్పుడు ధృవపత్రాలు సమర్పించి బ్యాంక్‌ మేనేజర్‌ అంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం వారు బ్యాంకు కస్టమర్లకు పలు సూచనలు చేశారు. బ్యాంకు మేనేజర్‌ను అంటూ మొబైల్‌ సిమ్‌కార్డు పొంది అమాయకులైన బ్యాంక్‌ కస్టమర్‌లకు ఫోన్‌ చేస్తూ హిందీలో మాట్లాడతారని తెలిపారు. బ్యాంక్‌ మేనేజర్‌ను మాట్లాడుతున్న అని పరిచయం చేసుకుని, అకౌంట్‌ పూర్తిగా అప్‌డేట్‌ చేస్తున్నామని, అకౌంట్‌ నెంబర్‌ చెప్పమని కొరగానే చాలా మంది నిజంగానే మాట్లాడుతున్న వ్యక్తి బ్యాంక్‌ అధికారి అని నమ్మి తమ అకౌంట్‌ నెంబర్‌ చెబుతున్నారని అన్నారు. వెంటనే ఆ వ్యక్తి ఆ అకౌంట్‌ నుండి డబ్బులు డ్రా చేయడం మొదలుపెడతాడని, అతను డబ్బులు డ్రా చేయడం మొదలు పెట్టగానే కస్టమర్‌ ఫోన్‌కి మెసేజ్‌ వస్తుందని చెప్పారు. బ్యాంక్‌ మేనేజర్‌గా మాట్లాడుతున్న వ్యక్తి నెంబర్‌ చెప్పవలసిందిగా కోరతాడని, ఆ తర్వాత అమాయకంగా చాలామంది తమ సెల్‌ఫోన్‌కి వచ్చిన ఓటిపి నెంబర్‌ వారికి చెప్పగానే వారి అకౌంట్‌లో డబ్బులు మాయం అయిపోతాయని తెలిపారు.

కింది సూచనలు పాటించండి

1) బ్యాంక్‌ అధికారులమని ఏ అపరిచితవ్యక్తి ఫోన్‌ చేసిన నమ్మకండి. కావాలంటే బ్యాంకుకి స్వయంగా వెళ్లి మేనేజర్‌తో మాట్లాడాలని తెలిపారు.

2) అపరిచిత వ్యక్తితో అకౌంట్‌ నెంబర్‌ షేర్‌ చేసుకోవద్దని, చెప్పవద్దని అన్నారు.

3) బ్యాంక్‌ మేనేజర్‌ ఫోన్‌ చేసి అకౌంట్‌ నెంబర్‌ గురించి వివరాలు అడగరని, ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే అనుమనించాలని తెలిపారు.

4) బ్యాంక్‌ అకౌంట్‌, పిన్‌ నెంబర్‌, ఆస్తి, ఆస్తిని కొల్లగొట్టడానికి కొన్ని ముఠాలు వల వేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, అమాయకంగా నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరుల పాలు చేసుకోవద్దని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *