పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్
జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం గ్రామపంచాయతీ కార్మికులు పరిష్కరించాలని చండూరుఎంపీడీవో ఆఫీస్ ముందు దార్న నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మద్దతు తెలిపి మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల పంచాయతీల పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ఒక్కొక్క గ్రామపంచాయతీలో మూడు నెలల నుంచి పది నెలల వరకు పెండింగ్లో వేతనాలు ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా సిబ్బందికి ప్రమాద బీమా సౌకర్యం పిఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా పోరాటం నిర్వహిస్తామని అక్టోబర్ 2 నుంచి సమ్మెలకు వెళ్తామని కార్మికులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండలనాయకులు,వెంకటాచారి, పుష్పలత,ముంత వెంకటేశ్వర్లు,కృష్ణయ్య,లక్ష్మణ్,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు