48 Years of Struggle for Assigned Land
శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన పవన్ కల్యాణ్
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారాయన.
గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్..
అసెంబ్లీలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర బడ్జెట్‌పై చర్చలు కొనసాగాయి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకెళ్లే బడ్జెట్ ఇదని చెప్పుకొచ్చారు. అపార అనుభవంతో గత ప్రభుత్వ వారసత్వ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ‘నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా…’ అని కవి శేషేంద్ర చెప్పిన కవితను.. మోదీని ఉద్దేశించి కొనియాడారు పవన్ కల్యాణ్.
