Historic Win for Sunil in Parkal
ప్రజల మనసు గెలిచిన పావుశెట్టి సునీల్
ప్రజల నమ్మకమే నా గెలుపు పునాది
పరకాల,నేటిధాత్రి
పరకాల మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పావుశెట్టి సునీల్ కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. 173 ఓట్ల మెజారిటీతో ఆయన సాధించిన ఈ విజయం పట్టణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడిగా సునీల్ తన ప్రజాదరణను నిరూపించుకున్నారు.ప్రజల మనసును గెలుచుకుంటూ 173 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిపై ఆధిక్యం సాధించి విజేతగా నిలవడంతో సునీల్ గెలుపుతో వార్డులో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.తాను ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని అభివృద్ధి హామీలు ఇచ్చిన సునీల్‌కు ఓటర్లు విశ్వాసం వ్యక్తం చేశారు.తాగునీరు,డ్రైనేజీ,రోడ్లు,వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.మొత్తంగా సునీల్ విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.ఎన్నికల ప్రచారంలో మొదటి నుంచే ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న సునీల్ కు అదే ఆయనకు ఈ ఘన విజయానికి బలమైన పునాది అయింది.స్పష్టమైన మెజారిటీ సునీల్ పై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

ఈ విజయం కేవలం వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు,ప్రజల అభిమానం,విశ్వాసం,ఆశల ప్రతిఫలంగా భావిస్తున్నారు.ఈ సందర్బంగా ఇది నా విజయం కాదు,నావార్డు కుటుంబం విజయం” అని తెలిపారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని, పారదర్శక పాలన అందిస్తానని ప్రతి సమస్యకు సమయపాలనతో పరిష్కారం చూపిస్తానని చెప్పారు.చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే దిశగా సునీల్ సిద్ధమవుతున్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయడం తన ధ్యేయమని సునీల్ స్పష్టం చేశారు.పరకాల రాజకీయాల్లో సునీల్ విజయం కొత్త అధ్యాయానికి నాంది పలికింది.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 7వ వార్డు ప్రజల తీర్పు సునీల్ నాయకత్వానికి బలమైన మద్దతుగా నిలిచిందని చెప్పవచ్చు.
