Haniya Hoorin Felicitated for Scoring 550 Marks in SSC
హనియ ను సన్మానించిన పాషా
మెట్ పల్లి ఏప్రిల్ 30 నేటి దాత్రి
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన మెట్ పల్లి పట్టణానికి చెందిన వివేకానంద హైస్కూల్ విద్యార్థిని, మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ కూతురు హనియ హోరిన్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముజీబ్, రహిమోద్దీన్, షారు, మజార్, అనష్, అబూజర్ తదితరులు పాల్గొన్నారు.
