తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ తల్లి
గతంలో ఉన్న విగ్రహాన్ని కొనసాగించాలి

భద్రాచలం నేటి దాత్రి

బిఆర్ఎస్ పార్టీ.
భద్రాచలం పట్టణంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు..

ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ విగ్రహం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతికగా ఉందని అట్టి విగ్రహాన్ని కొనసాగింపు చేయాలని అన్నారు..

ఉద్యమ సమయంలో మేధావులు ఉద్యమకారులు ఎందరో నివాళులర్పించిన విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం అని అన్నారు..
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విగ్రహాలు మార్చడం పేర్లు మార్చడం వల్ల ఉపయోగం లేదని అన్నారు

నేడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా గతంలో ఈ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయని అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందని అన్నారు..

ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు మానుకొని పాత విగ్రహాన్ని కొనసాగించి చేయాలని డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమంలో డిఆర్ఎస్ మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్. మండల పార్టీ నాయకులు బత్తుల నరసింహులు .గుంజ ఏడుకొండలు. రామకృష్ణ చిట్టిమల్ల అనిల్ .అంబటి కర కృష్ణ. యువజన నాయకులు బద్ది బాబి ప్రదీప్. రాసాల శివకుమార్ అంబటి కర్ర రవి వర్మ. సోషల్ మీడియా అధ్యక్షులు ఇమంది నాగేశ్వరరావు .మహిళా నాయకులు కావూరి సీతామహాలక్ష్మి. పూజల లక్ష్మి .సలోమి .ప్రియాంక. కల్లూరి శ్రీరాములు సోంపాక మధు.
రోహిత్ పాషా. తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!