
వీరభద్రస్వామి జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
గంగాధర/ రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామంలోని వీరభద్రస్వామి జాతర ఉత్సవాలకు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు హాజరయ్యారు. ఈసందర్భంగా వేదపండితులు అక్షింతలు వేసి ఆశీర్వదించి, శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి, తిర్మలాపూర్ గ్రామ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నాగి…