
వరి మరియు మొక్కజొన్న పొలాలలో శాస్త్రవేత్తల బృందం క్షేత్ర సందర్శన
రామడుగు, నేటిధాత్రి: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్తలు రామడుగు మండలంలోని కొక్కెరకుంట మరియు దేశరాజుపల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ప్రధాన సమస్య అయిన మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించడం జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం రైతులకు తగు నివారణ చర్యలు సూచించారు. మొగి పురుగు నారుమడి…