si thudi rathapariksha nirvahanaku erpatulu purthi, ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ వరంగల్‌ నగరంలో నిర్వహించే ఎస్సై తుది రాతపరీక్షను సజావు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. రాష్ట్ర పోలీస్‌ నియామక బోర్డ్‌ ద్వారా సబ్‌-ఇన్స్‌స్పెక్టర్‌ (సివిల్‌) ఉద్యోగాల నియామాకాలలో భాగంగా శని, ఆదివారాలలో నిర్వహించే తుది రాతపరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై వరంగల్‌ రీజీనల్‌ కో-ఆర్డినేటర్‌ (కేయూ ఇంజనీరింగ్‌ విభాగం ప్రిన్స్‌పల్‌) ఫ్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి, పోలీస్‌…

Read More

telangana pcc organision secretaryga gujjula srinivas, తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గుజ్జూల శ్రీనివాస్‌

తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గుజ్జూల శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్‌ సెక్రటీరగా నియమితులైన శ్రీనివాస్‌రెడ్డి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని, తన నియమాకానికి సహకరించిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More

anndanam mahadanam, అన్నదానం మహాదానం

అన్నదానం మహాదానం అన్నదానం మహాదానమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవేందర్‌ అన్నారు. శుక్రవారం జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం జాతీయ కన్వీనర్‌ నాగవేళ్ళి నరేంద్ర కుమారుడు నాగవేళ్ళి సాయి శ్రీశాంత్‌ వర్థంతిని ఎన్‌ఎస్‌ఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయి ప్రశాంత్‌ వర్థంతి సందర్భంగా వరంగల్‌లోని లూయిస్‌ అంధవిధ్యార్థుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాడ దేవేందర్‌…

Read More

karyakarthalaku andaga vunta, కార్యకర్తలకు అండగా ఉంటా

కార్యకర్తలకు అండగా ఉంటా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శుక్రవారం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు మాడిశెట్టి కవితకు ఆర్థిక సహాయం అందజేశారు. 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి ద్వారా కవితకు 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే ఆర్థికంగా ఆదుకోవడానికి ఇదే నిదర్శనమని…

Read More

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మోడెం భానుకిరణ్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వెలువడగా పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మనస్థాపం చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More

chali pidugu miglichina vishadam, చలి పిడుగు మిగిల్చిన విషాదం

చలి పిడుగు మిగిల్చిన విషాదం ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామశివారులో గొర్రెల మందపై పిడుగుపడడంతో పెద్దఎత్తున 35గొర్రెలు మతువాత పడ్డాయి. చీర రాజారామ్‌కు చెందిన భూమిలో మందను నిర్వహించారు. గురువారం రాత్రి అకాలవర్షంలో చలి పిడుగు గొర్రెల మండపై పడింది. పెద్దసంఖ్యలో చిన్న, పెద్ద గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇందులో మజ్జిగ రాజుకు చెందిన 8గొర్రెలు, దయ్యాల రాజుకు చెందిన 20గొర్రెలు, బండారి చంద్రుకు చెందిన 5గొర్రెలు మృతిచెందాయి. అందులో భాగంగా…

Read More

ashakaryakarthalaku okaroju shikshana karyakramam, ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, బోద వ్యాధి, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు వ్యాధులు వస్తాయని, వీటి నివారణలో ఆశాకార్యకర్తల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. 2030 సంవత్సరానికి మలేరియాను…

Read More

gudumbha stavaralapia dadulu, గుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై దాడులు గుడుంబా స్థావరాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్సై అశోక్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని బేస్తగూడెం గ్రామంలో, గ్రామం చుట్టుపక్కల గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 500లీటర్ల పానకం, 10గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దుర్గం లక్ష్మిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సైతోపాటు సిబ్బంది శ్రీనివాస్‌, నవీన్‌, తిరుపతి, వీరన్న పాల్గొన్నారు.

Read More

flatphom bayata kuragayalanu vikrainchakudadu, ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించకూడదు

ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించకూడదు కూరగాయల విక్రయదారులు వారికి కేటాయించిన ప్లాట్‌పామ్స్‌లలోనే కూరగాయలను విక్రయించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమీషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 13వ వార్డులో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఇతర మౌళిక వసతులు తదితరులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇంజనీర్‌ విభాగం సిబ్బందికి సూచించారు. అనంతరం మార్కెట్‌ ఏరియాను సందర్శించారు. ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించడం మూలంగా రవాణా,…

Read More

vathavarana shaka hesharika, వాతావరణ శాఖ హెచ్చరిక

వాతావరణ శాఖ హెచ్చరిక తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండగా..గురువారం వాటి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎండలో బయటకు రావద్దని వాతావరణశాఖ సహాయ అధికారి వెంకట్రావు సూచించారు. గురువారం ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని, దీని వల్ల ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు పగలూ ఇంటి నుంచి…

Read More

అమ్మమ్మ భూమిని రక్షించేందుకు సైకిల్‌ యాత్ర

అమ్మమ్మ భూమిని రక్షించేందుకు సైకిల్‌ యాత్ర. తన అమ్మమ్మకు ఏకైక ఆధారం ఆ భూమి. ఇప్పుడు ఆ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. కొంతమంది కలిసి ఆ భూమిని కబ్జా చేశారు. ఎవరికి విన్నవించిన లాభం లేకుండా పోయింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఆ యువకుడికి కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ సమస్య పరిష్కారం తన వల్లనో, తన అమ్మమ్మ వల్లనో కాదని గుర్తించాడు. తన బాధను హైదరాబాద్‌లో ఉన్న మాజీ మంత్రి హరీష్‌రావును కలిసి చెప్పేందుకు సైకిల్‌యాత్ర…

Read More

ellu kabza chesharani atmahatyayatnam, ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం

ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం వరంగల్‌ సిటి : ఇల్లు కబ్జా చేశారని కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్‌ కాశిబుగ్గ గ్లోబల్‌ స్కూల్‌ వద్ద తౌటం చక్రపాణి అనే వ్యక్తి అద్దెకు వచ్చి ఇంటిని కబ్జా చేసారంటూ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఈగ బిక్షపతి, భార్య, కూతురును చుట్టుపక్కల కాలనీవాసులు అడ్డుకున్నారు. కేసును ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాదితుడు బిక్షపతి మాట్లాడుతూ అమ్మ, నాన్న సంపాందించిన…

Read More

atm chorulunnaru, ఏటీఎమ్‌ చోరులున్నారు..

ఏటీఎమ్‌ చోరులున్నారు.. సైబరాబాద్‌ డీసీపీ క్రైమ్స్‌ రోహిణీ ప్రియదర్శిని బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టడానికి సైబర్‌ నేరగాళ్లు నయా దారులు వెతుకుతున్నారని సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని పంజా విసురుతున్నారని, ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఖాతాల్లోంచి వేలాది రూపాయలు ఎగిరిపోతున్నాయని తెలిపారు. ఈ ఘరానా మోసం పేరే ‘స్కిమ్మింగ్‌’ అంటారని చెప్పారు. గతంలో కస్టమర్లకు ఫోన్‌ చేసి బ్యాంక్‌ అధికారులమని నమ్మబలుకుతూ వారి నుంచి ఏటీఎం కార్డు నంబర్‌, పిన్‌…

Read More

raithu samagra serveylo vivaralu namodu chesukovali, రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి

రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర రైతు సర్వేలో నూతన పట్టాదారు పాస్‌ పుస్తకం పొందిన ప్రతి రైతు వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో కావ్య తెలిపారు. రైతు సమగ్ర సర్వేలో భాగంగా బుధవారం మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో స్థానిక గ్రామ పంచాయితిలో రైతులకు సమగ్ర సర్వే నమూనాలు అందించి వివరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 30 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ…

Read More

21na sravs advaryamlo 10k run, 21న ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఆధ్వర్యంలో 10కె రన్‌

21న ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఆధ్వర్యంలో 10కె రన్‌ ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఫిట్‌నెస్‌ జోన్‌ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన 10కె మారధన్‌ రన్‌ నిర్వహిస్తున్నామని నిర్వాహాకురాలు స్రవంతిరెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఫిట్‌నెస్‌ జోన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ ఐఎంఎ, బంధన్‌ సెరిమిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సౌజన్యంతో ఈ 10కె రన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రన్‌ ఈనెల 21వ తేదీ ఉదయం 5.30గంటలకు సుబేదారి ఆర్ట్స్‌…

Read More

మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి.

మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో హమాలి, కూలి గంప, చీపురు కార్మికులకు కనీస వసతులు కల్పించాలని టీఆర్‌ఎస్‌ కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. బుదవారం తెలంగాణ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ టీఆర్‌ఎస్‌ కేవీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున కార్మికులు భోజనం చేయడానికి తీసుకువచ్చిన భోజనాలు ఎత్తుకు…

Read More

batasarulaku basataga chalivendram, బాటసారులకు బాసటగా చలివేంద్రం

బాటసారులకు బాసటగా చలివేంద్రం చలివేంద్రం బాటసారుల దాహార్తిని తీర్చుతూ బాసటగా నిలుస్తుందని ఆడెపు రవీందర్‌ అన్నారు. బుధవారం వరంగల్‌ మట్టెవాడలోని బాలాజీ స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపకులు తోట హైమావతి, భూమయ్య గత 8సంవత్సరాలుగా చలివేంద్రం వేసవికాలంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆడెపు రవీందర్‌ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాటసారులకు చవివేంద్రం బాసటగా ఉంటుందని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చాలామంది బాటసారుల దాహార్తిని తీర్చడానికి ఇది ఎంతో…

Read More

vidinirvahanalo alsathvam vahiste cheryalu thappavu, విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల రాజన్న జిల్లా పురపాలక సంఘం కమీషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 1,2వ వార్డులలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, ఇతర మౌళిక వసతులను ఆయన పర్యవేక్షించారు. వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేకపోవడంతో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సానిటరీ జవాన్లను 500రూపాయల జరిమానా విధించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, తిరిగి పునరావృతమైతే విధుల నుంచి తొలగిస్తానని హెచ్చరించారు. పట్టణంలోని…

Read More

eddaru vrudulapia gurthuteliyani dundagula dadi, ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి

ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి – ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. ఇద్దరు వద్ధులపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా దాడి చేశారు. దీంతో ఒక వద్ధుడు మతి, మరో వద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను తొందరలోనే పట్టుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Read More

rashtra prabuthvam vadda raithu samacharam purthisthailo ledu, రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు

రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతుల పూర్తి సమాచారం అందుబాటులో లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమగ్ర సమాచార సర్వేలో పాల్గొని పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని నర్సంపేట వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలకేంద్రంతోపాటు రేకంపల్లి, లక్ష్మీపురం, తిమ్మంపేట గ్రామాలలో రైతు సమగ్ర సమాచార సర్వేను మండల వ్యవసాయ శాఖ అధికారి చిలువేరు దయాకర్‌ ఆధ్వర్యంలో…

Read More