మెజార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ ఇచ్చిన ఎలక్షన్ ఫండ్‌ను ఖర్చు చేయట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పార్టీ పెద్దలకు లోకల్ లీడర్లు, కేడర్ ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి పెద్ద మొత్తంలో ఇచ్చిన పార్టీ ఫండ్‌ను ఎందుకు ఖర్చు చేయట్లేదని ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే గెలిచే అవకాశాలు లేకపోవడంతోనే పార్టీ ఫండ్‌ను బయటికి తీయడం లేదని అభ్యర్థుల సన్నిహితుల్లో చర్చ జరుగుతున్నది.
భారీ స్థాయిలో పార్టీ ఫండ్స్
లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్ టార్గెట్‌గా పెట్టుకున్నది. అందులో భాగంగా ఎంపీ అభ్యర్థులకు ఊహించని స్థాయిలో పార్టీ ఫండ్ పంపించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇచ్చిన నిధులను అభ్యర్థులు ఖర్చు చేయట్లేదని క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నట్టు తెలిసింది. కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లకు సైతం నిధులు ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలకు ఏర్పాట్లు, జన సమీకరణపై మాత్రమే ఫోకస్ పెట్టి, మిగతా రోజుల్లో కనీసం ప్రచారానికి కూడా ఖర్చు చేయట్లేదని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై కొందరు అభ్యర్థులను లోకల్ లీడర్లు, కేడర్ ప్రశ్నిస్తూ ‘ప్రచారం చేయకుండా ఎందుకు కామ్ ఉంటున్నారు? అని నిలదీసిన సంఘటనలు ఎదురైనట్టు పార్టీలో టాక్ ఉంది.
గెలిచే చాన్స్ లేకనే..?
పార్టీ ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయట్లేదని పార్టీ నేతలు ఆరా తీసినప్పుడు అభ్యర్థులు ఒకే ఒక కారణం ప్రధానంగా చెబుతున్నట్టు తెలిసింది. ‘ఈ ఎన్నికల్లో గెలిచే చాన్స్ లేదు. ఎందుకు వృథాగా ఖర్చు చేయడం’ అని ఎదురు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కొందరు అభ్యర్థులైతే తాము ఇచ్చిన ఫండ్స్ మొత్తం ఖర్చు చేశామని వివరణ ఇస్తున్నట్టు తెలిసింది. ఒక్కోఅసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక్కో లీడర్‌ను ఎన్నికల ఇన్ చార్జిగా పార్టీ నియమించింది. ఈ ఇన్ చార్జుల్లో కొందరు తమకు ఇచ్చిన ఫండ్స్‌ను మిస్ యూజ్ చేస్తూ, స్థానిక లీడర్ల అవసరాలకు కూడా నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కొందరు అభ్యర్థులు, ఇన్ చార్జిలు పార్టీ ఫండ్స్ ను మొత్తం ఖర్చు చేయకుండా, వెనకేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన విజయం చేకూర్చేందుకు విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు
ప్రచారంలో భాగంగా ఎంపీ రవిచంద్ర ఖమ్మం బురహాన్ పురం బుధవారం ఉదయం కాలినడకన గడపగడపకు వెళ్లి మహానేత కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన,నాగేశ్వరరావును గెలిపించాల్సిన అవసరం గురించి వివరించారు
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు వేం వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,కార్పోరేటర్లు శీలంశెట్టి రమాదేవి,బుర్రి వెంకట్ కుమార్, పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు ఉన్నారు
మొదట బురహాన్ పురంలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 51,52 డివిజన్లలో పాదయాత్రగా ఇంటింటి ప్రచారానికి బయలుదేరారు
ఎంపీ రవిచంద్ర,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, పొన్నం వెంకటేశ్వర్లు, కార్పోరేటర్లు శీలంశెట్టి రమాదేవి, బుర్రి వెంకట్ కుమార్ తదితరులు గులాబీ కండువాలు మెడలో వేసుకుని, కరపత్రాలు, నమూనా ఈవీఏం చేతబట్టుకుని డప్పుల దరువు మధ్య కాలినడకన వీధివీధి,ఇల్లిల్లు తిరిగారు
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,” జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,” కారు గుర్తుకే మన ఓటు”,” గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం”అనే నినాదాలు బురహాన్ పురంలో హోరెత్తాయి
కేసీఆర్ పాలనయే బాగుంది,మంచినీళ్లు రావట్లే: గృహిణి విజయ “కేసీఆర్ గారి పాలనయే బాగుంది, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు ఏ మాత్రం పోలికనే లేదు.కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలైనయ్, కరెంట్ పోతున్నది, మంచినీళ్లు కూడా రావట్లే,బోర్లు కూడా ఎండిపోయినయ్” అని ఎంపీ రవిచంద్ర ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు స్పందిస్తూ ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయిస్తానని హామీనిచ్చారు
ప్రచారం సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎదురుపడగా ధనమ్మ అనే వృద్ధురాలు మాట్లాడుతూ “కేసీఆర్ దయతోనే నాకు 2వేల పింఛన్ వస్తున్నదని, అప్పుడు నెలానెల తప్పకుండా వచ్చేవి.ఇప్పుడు ఎప్పుడొస్తయో,అసలు వస్తయో రావో తెల్వకుండా ఉన్నది.రెండు నెలల పింఛన్ రాలే, రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు” అని వాపోయింది.”నా ఓటు,నా కుటుంబ సభ్యుల ఓట్లు కేసీఆర్ గారికే వేస్తామని స్పష్టం చేశారు” ఎంపీ వద్దిరాజు కాలినడకన ప్రచారం Date 08/05/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు కోసం బురహాన్ పురంలో కాలినడకన విస్తృత ప్రచారం నిర్వహించారు
ఎంపీ రవిచంద్ర వాడవాడలా కలియతిరిగి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు, కార్పోరేటర్లు శీలంశెట్టి రమాదేవి, బుర్రి వెంకట్ తదితరులతో కలిసి గడపగడపకు వెళ్లి కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన విజయం చేకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు చాలా కోపంగా ఉన్నారు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది, తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు,432హామీలిచ్చి అధికారంలోకి రాగానే పాలకులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నరు పంట పెట్టుబడి కింద రైతుభరోసా పేరిట 10వేల నుంచి 15వేలకు పెంచి ఇస్తామన్న హామీ ఉత్తిదే అయ్యింది సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయినయ్,పండిన కొద్ది పంటలను కూడా కొనుగోలు చేయడం లేదు వరి క్వింటాలుకు 500బోనస్ మాటే మర్చిపోయారు కళ్యాణలక్ష్మీ లేదు,తులం బంగారం హామీని నెరవేర్చే పరిస్థితి లేదు సీఎంఆర్ఎఫ్,ఎల్వోసీల మాటే లేదు,ఇచ్చిన చెక్కులు కూడా పాస్ కావడం లేదు అలవికాని హామీలిచ్చి తమను మోసం చేశారని ప్రజలు గుర్తించారు కాంగ్రెస్ పాలకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు నా పాదయాత్రకు, ఇంటింటా ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది కరెంట్ కోతలు,నీళ్ల కటకట గురించి మహిళలు తాము పడుతున్న బాధల గురించి వివరించారు తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల సాధనకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చక్కగా వివరించడం జరిగింది ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులు,ఇక్కడ నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ నియోజకవర్గంలో మాలోతు కవిత ఘన విజయం సాధించడం ఖాయం
– బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు – డిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 7(నేటి ధాత్రి): తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు నిధులను తమ ఖాతాలో వేయడాన్ని బిజెపి ఓర్చుకోవడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు… రైతు భరోసా ను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సమయం కంటే ముందుగానే ఒకేసారి రైతు ఖాతాలో డబ్బులు జమ చేసారు. ఈసీ అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు చేసిందనీ తెలిపారు. రైతుల నోటికాడి బుక్కును లాక్కుందనీ తెలిపారు. బీజేపీకి మొదటి నుంచి అన్నదాతలు అంటే అక్కసు, ఆగ్రహం. కేంద్రం నల్ల చట్టాలు రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసింది తెలిపారు. నల్ల చటాలను వ్యతిరేకించి పోరాటం చేసిన వందలాది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుందనీ తెలిపారు.ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత గడ్డు పరిస్థితిలో కూడా నిధులు లేకున్నా అన్నదాతలను ఆదుకోవ డం కోసం బ్యాంకులలో రైతు భరోసా నిధులు జమ చేసామనీ తెలిపారు. ఇప్పుడు బీజేపీ తన గుప్పిట్లో ఉన్న ఈసీ ని అడ్డం పెట్టుకొని బ్యాంక్ ఖాతాలో పడ్డ సొమ్ములను కూడా నిలిపి వేసిందనీ తెలిపారు. ఇంత దారుణం ఎక్కడ ఉండదనీ, బీజేపీ చేస్తున్న కుట్రలను అన్నదాతలు చూస్తున్నారనీ తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల రోజునే కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేశారు.. అప్పుడు నోరుమెదపని బీజేపీ, ఆపని ఈసీ ఇప్పుడు ఎందుకు ఆపింది ? అని ప్రశ్నించారు.రైతు భరోసా కొత్త పథకం కాదు.. గత కొన్ని రోజులుగా క్రమంగా డబ్బులు వేస్తున్నాం. పెండింగ్ ఉన్న డబ్బులు ఇపుడు వేశామని తెలిపారు.గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే నిధులు జమ చెయ్యమని అడిగింది.. రైతుల ప్రయోజనాల కోసం కృషి చేసామనీ తెలిపారు.. వచ్చే ఎన్నికల్లో రైతు వ్యతిరేఖ బీజేపీకి తగిన గుణపాఠం చెపుతారనీ తెలిపారు.రైతు భరోసా నిధులు ఆపిన తోడు దొంగలు బీజేపీ,బిఆర్ఎస్ లను రైతులు రాష్ట్రం నుంచి తరిమి కొడతారనీ తెలిపారు.
– రూ. 9 వేల తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత నర్సయ్యది..
– ‘చామల’కు ఓటేస్తే.. రాజగోపాల్ మంత్రి అవుతుడట!
– పేరు చెప్పుకొని ఓట్లడుగలేని దుస్థితి కాంగ్రెస్అభ్యర్థిది
– ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రెడ్లు తప్ప లీడర్లు లేరట!
– తండ్రులు రిటైర్మెంట్తో కొడుకులను దింపుతున్నరు
– విద్యార్థి ఉద్యమ నాయకుడు , బీసీ బిడ్డ కైలాశ్అర్హత లేదా?
– క్లీన్స్వీప్భయంతోనే బీసీ రిజర్వేషన్ల రద్దు ప్రచారం..
– త్వరలో కాంగ్రెస్‌పార్టీకి జాతీయ హోదా రద్దు ఖాయం
– ‘నేటి ధాత్రి’తో బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్
నేటి ధాత్రి, స్టేట్బ్యూరో:
‘పార్టీ కంటే పర్సన్ ను చూడండి.. జెండా కంటే ఎజెండా చూడండి.. బూర నర్సయ్య గౌడ్ఆర్భాటం కంటే అభివృద్ధి చూడండి.. ప్రధాని మోడీ దేశాన్ని పాలిస్తున్న తీరును చూడండి.. బూర నర్సయ్య గౌడ్‌ను బీజేపీ నిబద్ధతను చూడండి. ప్రతిపక్షంలో ఎంపీగా ఉన్నప్పుడే .. రూ. 9 వేల కోట్లు తీసుకొచ్చిన ఘనత నాది’ అని అంటున్నారు బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. రాష్ట్ర అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమని ఆయన అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకొచ్చానని చెప్పారు. ఎంపీగా గెలుపొందితే భువనగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. తన ప్రత్యర్థులు ఇద్దరూ తనకు పోటీయే కారని, ఉమ్మడి జిల్లాలోనే రికార్డు మెజారిటీతో గెలిచి చూపుతానని సవాల్విసురుతున్నారు. భువనగిరి కోటాపై కమలం జెండా ఎగరేస్తానని అంటున్న బూర నర్సయ్య గౌడ్‌తో ‘నేటి ధాత్రి’ ముఖా ముఖి..
ప్రచారం ఎట్లా కొనసాగుతుంది?
‘గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలనే నినాదం దేశవ్యాప్తంగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ‘ఢిల్లీలో మోడీ భువనగిరిలో ‘బూర’ ఉండాలని పార్లమెంట్నియోజకవర్గంలో రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారు. ఈ రెండు నినాదాలు చాలు.. భువనగిరిలో నేను గెలవడానికి’ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం.
అధికార కాంగ్రెస్‌నుంచి సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు బరిలో ఉన్నారుగా?
‘భువనగిరిలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగి బూర నర్సయ్యను ఓడించాలని ప్రచారం చేస్తున్నారంటేనే.. అది వారి ఓటమికి సంకేతం. రాజకీయాల్లో ఎవరూ హీరోలు ఉండరు. ప్రజలు ఓటేస్తేనే.. ఎవరైన హీరో.. లేకపోతే అంతా జీరోలే.. ఉమ్మడి నల్గొండ జిల్లాను కాంగ్రెస్కంచుకోట అంటున్నారు.. కానీ గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క కాంగ్రెస్ఎమ్మెల్యే కూడా లేరు కదా? 12 స్థానాల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు కదా? అంటే ప్రజల ఆకాంక్షకు తగినట్లుగా మారుతాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటేశారు.. తప్పా.. కాంగ్రెస్‌పార్టీని గెలిపించాలని కాదు. దీంతో వారు వాపును చూసి బలుపనుకుంటూ భ్రమ పడుతున్నారు. భువనగిరి ని బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పూలేభవన్ పై కాషాయంజెండా ఎగరేస్తాం.
2018లో ఇదే కాంగ్రెస్‌చేతిలో ఓడిపోయారు కదా?
‘నేను ఓడిపోలేదు. కోమటిరెడ్డి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. నైతికంగా గెలుపు నాదే.. రోడ్డు రోలర్గుర్తు ద్వారా ప్రజలు కన్ఫ్యూజ్అయ్యారు. గెలుపు ఓటములు సహజం. రేవంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తర్వాతనే కదా ఎంపీలుగా గెలిచింది. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి ముఖ్యమంత్రి, మంత్రి అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి రావడం.. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి జీర్ణించుకోలేక పోవడం.. అన్న పదవిని ఎప్పుడు ఊడగొట్టాలనుకోవడం.. ఇవన్నీ మళ్లీ జరుగుతున్నాయి కదా.. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమనడానికి.. నిదర్శనం ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులదే ఆధిపత్యం ఉంటే ప్రజలు జీర్ణించుకోలేరు. ఈ అభ్యర్థి గురించి స్థానిక కాంగ్రెస్నేతలకే పెదవి విరుపు ఉంది. ఆయన ప్రజాసేవకుడు కాదు, సామాజిక సేవకుడు కాదు. అనేది ప్రజలే చెప్తున్నరు. కాంగ్రెస్ఎంపీ అభ్యర్థికి ఓటేస్తే రాజగోపాల్‌రెడ్డి రాష్ట్రంలో హోం మంత్రి అవుతడంటా.. ఇంత విచిత్రమైన వాదన ఎక్కడైనా ఉంటదా? ‘‘నాకు ఓటేస్తే.. నేను నియోజకవర్గానికి ఇది చేస్తా అని చెప్తారు. నీకు దమ్మూ ధైర్యం నువ్వేం చేస్తావో చెప్పాలి. ఇప్పటికే జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి ఉన్నారు. మళ్లీ రాజగోపాల్‌రెడ్డికి ఎలా ఇస్తారు? రాజగోపాల్‌రెడ్డి ఈ లాజిక్ ఎట్లా మిస్అవుతుండో అర్థం కావడం లేదు. కాంగ్రెస్‌నాయకులకు తెలివి ఉంటే.. వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, మందుల సామేల్వీరిలో ఎవరినో ఒకరిని చేస్తామంటే ప్రజలు నమ్మేవారు. గాడిద గుడ్డు అని ఒక ప్రస్తావన తెచ్చారు. అసలు వీళ్ల తెలివి ఎక్కడుందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. గాడిద గుడ్డు పెట్టదనే మినిమం నాలెడ్జ్కూడా వీరికి లేదు. నాకు ముఖ్యమంత్రి సన్నిహితుడు. అందుకే మీరే ఖర్చు పెట్టుకుని ఓట్లు వేయించాలి. లేకుంటే మీకు పదవులు రాకుండా చేస్తా అని బెదిరిస్తున్నారు. అసలే జిల్లాలోని నా బహుజన ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడి ఎదిగి ఎమ్మెల్యేలైన వారు.. వాళ్లకు తెలియదా? రేవంత్‌రెడ్డికి సానుభూతి కలిసొచ్చి మల్కాజ్గిరి ఎంపీగా గెలవలేదా? అదే సానుభూతి, తెలివిగా వ్యవహరించి కాంగ్రెస్‌పార్టీలో సీఎం కాలేదా? ఇటీవల వరకు మకుటం మారాజుగా వెలుగొందిన కేసీఆర్ఈ రోజుకు ప్రతిపక్షంలో కూర్చొని ఇంటికి పరిమితం కాలేదా? బూర నర్సయ్య గౌడ్ భారీ మెజారిటీతో గెలువ బోతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చరిత్ర సృష్టించబోతున్నారు.
– మీరు గతంలో చేసిన అభివృద్ధిని నమ్ముకుంటున్నరా? మోడీ చరిష్మానా?
‘ కామన్‌గా ఏదైనా కంపెనీతో పాటు ప్రొడక్ట్ బాగుంటేనే దానికి గుర్తింపు దక్కుతుంది. వినియోగదారులు గుర్తిస్తారు. కంపెనీ బీజేపీ బాగుంది. మోడీ బాగున్నారు.. ప్రొడక్ట్బూర నర్సయ్య గౌడ్బాగాలేకపోతే ప్రజలు ఆదరిస్తారా? 9 వేల కోట్లు నవరత్నాలు తీసుకొచ్చిన ఘనత బూర నర్సయ్య గౌడ్‌ది. ఎయిమ్స్, పాస్పోర్ట్కేంద్రం, కేంద్రీయ విద్యాలయాలు, ఎంఎంటీఎస్, జాతీయ రహదారులకు నిధులు, మాతా శిశు హాస్పిటల్స్, నర్సన బీమా కుటుంబానికి దీమా, దండు మల్కాపురం ఇండస్ట్రియల్పార్క్, ఫాక్స్‌కాన్ కంపెనీ, హ్యాండ్లూమ్, పెంబర్తి, తాటి పరిశ్రమ, విశ్వకర్మ యోజన ఇలా ఎన్నో పథకాల అమలుకు కృషి చేసిన.
కాంగ్రెస్‌లో బీసీ అభ్యర్థులు లేరంటారా?
‘నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ సీట్లున్నాయి. జానారెడ్డి కొడుకులకే ఎమ్మెల్యే.. ఎంపీ సీట్లు ఇవ్వాలా? నల్గొండ జిల్లాలో రెడ్లు లేరా? బీసీలు లేరా? ఇదే భువనగిరి సీటుకోసం విద్యార్థి ఉద్యమ నాయకుడు, బీసీ బిడ్డ పున్న కైలాశ్‌నేత అర్హుడు కారా? ఆయన తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేస్తున్నారు. ఎందుకు కేటాయించలేదు.ఆయనకంటే చామలకు ఏం టాలెంట్ఉంది. ఓయూ ఉద్యమ నాయకురాలు తెలంగాణ ప్రాణాలకు తెగించి కొట్లాడ లేదా? ఆమెకు ఎందుకు ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో అలాంటి ఆలోచనే లేదు. అందుకే అట్టడుగు వర్గాల నుంచి అగ్రకుల పేదల వరకు మోడీ అంటే దేవుడిలా చూస్తున్నారు.’
ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం.. ఉంది?
‘రాష్ట్రంలో 3 నుంచి 5 సీట్లు కాంగ్రెస్‌పార్టీ గెలిపించే అవకాశం ఉంది. 10 సీట్లు బీజేపీకి వస్తాయి.. ప్రధాని మోడీ ప్రచారం తర్వాత ఇంకా రెండు సీట్లు కూడా పెరుగొచ్చు. నాతో పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్న భాష. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. బేసికల్‌గా నేను సౌమ్యుడిని. కానీ నాలోని ఒక్క కోణం మాత్రమే తెలుసు బూర నర్సయ్య గౌడ్ప్రతికూల పరిస్థితులు ఉగ్రనరసింహుడిలా ఎలా ఉంటానో కొందిరికే తెలుసు. అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖం చూసి ఎవరైన గుర్తిస్తున్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారంలో మా ముఖాలు చూసి ఓటెయ్యమని అడుగుతున్నప్పుడే అర్థం అవుతంది. అందుకే అదంతా ప్రజలు చూసుకుంటారు. నా లక్ష్యం అట్టడుగు వర్గాల అభివృద్ధి. ఏదైనా రిజల్ట్ఉండనియ్. మీదేందిరా బై కుటుంబ రాజకీయం. వేరే రెడ్లు లేరా.. బీసీలు లేరా? ఒకడికి బీసీ బిడ్డ, ఆలేరు ఎమ్మెల్యే సామంత రాజు, మరొకాయనకు వీరేశం.. వీళ్లు ఏ చిన్న పనిచేయాలన్నా.. నోటెడ్అని రాయించుకొని రావాలి. సామేల్‌కు స్వతంత్రం లేదు. నాకు ఎమ్మెల్యే ఎందుకు అర్థం కావడంలేదు. నేను కాంగ్రెస్గాలిలో గెలిచిన. రాజగోపాల్‌రెడ్డి 30 వేల మెజారిటీతో గెలిచారు. మరి 50 వేల మెజారిటీ వచ్చినోళ్లు పెద్దోళ్లా.. 30 వేలు వచ్చినోళ్లు గొప్పోళ్లా? వీళ్లు చెప్పినట్లు వాళ్లు వినాలి కదా? వీళ్లు తురుం కాళ్లుగా ఫీలవుతున్నారు.
రాముడితో పేరుతో రాజకీయం చేస్తున్నారన్న కామెంట్లు వస్తున్నాయి.. దీనిపై మీ స్పందన ఏంటీ?
‘మోడీ అంటే త్రీడీ.. త్రీడీ అంటే.. దేశం, ధర్మం, డెవలప్మెంట్గతంలో కాంగ్రెస్హయాంలో ఉగ్రవాదులు తలలు నరికి పార్సల్పంపేటోళ్లు. ఇప్పుడు దేశంలో మోడీ ప్రధాని అయ్యాక.. ఉగ్రదాడుల్లో జరగలేదు. నోట్ల రద్దు ద్వారా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. మోడీ ప్రధాని అయ్యాక వేరే దేశాల వాళ్లు మన దేశం వైపు చూడాలంటే భయపడుతున్నారు. గతంలో భయంకరమైన హిందువునని చెప్పారు.. మాజీ సీఎం కేసీఆర్..అప్పుడు మీకు మత రాజకీయాలు గుర్తుకు రాలేదా..? అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ఘనత మోడీది. మోడీ పైసలు, మోడీ గ్యాస్, మోడీ ఉచిత వ్యాక్సిన్ , మోడీ బీమా ఆర్థిక వ్యవస్థను దేశంలో 3వ ర్యాంకు తెచ్చిన ఘనత మోడీది.. 5700 కిలోమీటర్ల రహదారిని నిర్మించిన ఘనత మోడీది. కోమటిరెడ్డి ఆస్తి 2009 లో రూ. 19 కోట్లు మాత్రమే 2023లో రూ. 500 కోట్లు ఎలా వచ్చాయి.. రాజకీయ వ్యాపారంతోనే ఇంత సంపద ఎలా వచ్చింది.. పోలింగ్ లో నాలుగో నెంబర్ లో గుర్తు మనది ధర్మం నాలుగో పాదం మీద నడుస్తుంది ఇదే బూర నర్సయ్య గౌడ్ గుర్తు’ గెలిపించాలని కోరుకుంటున్నా..
· Revanth Reddy also attracting large folk of masses
· Can Reventh gain upper hand against KCR?
· Can KCR protect his existence by defeating Revanth?
· What the people are saying?
· What is the response of people against parties?
· What is the opinion of voter?
HYDERBAD,NETIDHATHRI:
Now there is only seven days left for poling in Telangana. Congress, BRS and BJP leaders are in full busy with their campaign in the state. BRS boss KCR, party working committee president KTR and Harish Rao making extensive campaign in the state. Especially after five months of Assembly Elections held again polling means it has become very difficult to assess the pulse of voter. Every party has its own assessment but nobody is in a position to assess the pulse of the voters. Congress alleged that KCR family during its ten years tenure plundered the state. While BRS is saying that people deceived by Congress party. In previous elections Congress has put its six guarantees in front of people and assured them about successful implementation of them. Unfortunately till now five months after coming into power Congress unable to fulfil its promises. This became negative for it. Not only that in previous Assembly elections Congress extensively campaigned and made corruption allegations on Kaleswaram Project. Its six assurances and allegations made on Kaleswaram created a remarkable impact on people that caused them to vote in favour of it. Especially the videos repeatedly exhibited on Kaleswaram created negative opinion among people on BRS. At the same time the silence of BRS also turned advantage for Congress. But in these elections Congress is not in a position to make serious allegations on Kaleswaram. The reason is, crops faced severe water problem and turned into dry that caused farmers left in miserable conditions. There is no answer from Congress for this plight of farmers. In these circumstances Congress unable to make again allegations on Kaleswaram. Dried crops, lack of water and power cuts pushing the Congress in self defence. This turned into advantage for BRS and it started attacks on Congress. Congress now repeatedly telling, the prevailing draught condition in the state is due to climate change but not for the cause of its failure. If people again believe what Congress is saying, then votes will come in favour of it otherwise people will give their votes to BRS. Then what happens? If BRS win more seats, then party leadership won’t sit in ideal. They will try to constantly remain with the people in the form of agitations against the government. KCR knows well how to keep the movement alive. Whatever party gain the power. It must be very careful about water, power which is most essential for farming. On these two issues Telangana sustenance is depended. If the government failed in providing these two, then its existence will fell in troubles. One should remember that Telangana formed only depending on these two issues.
Six months before of Assembly elections BJP lost its grip
Once BJP that remain in second position in the state leaving behind Congress, left to third position after facing defeat in Karnataka. After present elections it reaches to which position is not known to anybody. If there prevail any negativity on Congress five months after coming to the power is also can’t say at this situation. Every party has its own assessment but people will have their own opinion. If Congress party gain more number of seats, than we can say that there is no negativity against the party among the people. Two months back those who felt that BRS lost its total grip, now remain in their astonishment after looking at the large folk of masses attending KCR road shows and meetings. If they vote in favour of BRS or not the question, but the people attending in large number for KCR meetings shows that they have not lost their confidence on BRS boss is the notable point. Even if the party cadre tries to bring the people, this much of numbers is not at all possible. Even in night time also people are waiting for KCR arrival to their region. Especially KCR road shows success in Khamman district is the indication for major political change in the state. In previous elections people moved in favour of Congress. The rural folk totally turned towards the grand old party. But five months after Congress came to power, scene totally reversed and the down trodden sections those supported Congress now it seems gradually moving towards BRS. Within five months of period what it has done is the main question arising. For some reasons there appears no mistakes of Congress, in this present situation party is subjected to bear this consequence. Parliament elections within four months of period turned great disadvantage for Congress. At the same time three months after it coming to power, election code came into force. This also turned into a misfortune for Congress. Congress is saying that because of Kaleswaram we are unable give water. Then without Kaleswaram why Congress did not give water to farmers is the question raised by BRS. Like this ball of ‘Kaleswaram’ has been swinging in between the courts of these two parties.
Farmers showing their fingers against Congress
Now farmers wanting KCR back to power. In reality before the construction of Kaleswaram, KCR had taken up the works of revamp the tanks in the state. After completing these works he filled them with water. The water available in the Devadula project facilitated him to fill the entire tanks with water. Actually the Devadula Project had been taken up by Congress. If Revanth Reddy successfully utilised the Devadula water then it might have fetched to him. Unfortunately he failed in this aspect that made the farmers who are facing water problem learnt the importance of KCR, which causing to turn them in favour of KCR. Revanth Reddy also able to attract the people but when compare to previous Assembly elections, their number is less! At the same time in those days, people attended the Revanth Reddy meetings in voluntary manner, but now congress leaders and cadre moving them to participate in his road shows. We can see the scene in reverse in the case of KCR. In previous elections people were made to move by the cadre for KCR shows but now they have been attending voluntarily. Really speaking within four months of period the situation of these both parties turned into topsy-turvy manner.
Prime Minister Modi also concentrated on Telangana
It is said that Prime Minister Modi is also planning his road shows in the state. Unfortunately there is no considerable response for these road shows. Now people are more attractive towards KCR road shows. Now the road shows trend of KCR totally drove the Modi road shows into back bench. There is tough contest between BRS and Congress is clearly visible in Telangana. Between these two parties, BJP faded away in campaign. If Congress fails to win considerable seats, then it can be treated as it lost confidence among people within five months of period. KCR value raises and ‘Car’ will regain its strength. It may cause for rising of differences among the leaders of Congress. So it is life or death question for Revanth Reddy. He has to win majority seats. Even BJP wines majority seats, it will become problem for Congress and BRS existence will fell in danger. That is why when comparing to BJP, both BRS and Congress are continuing their rigorous campaign. Instead BJP moving its steps in planned manner. Let us see what will happen in these elections.
నాయకుడంటే ఒక విజన్ వుండాలి. నాయకుడంటే విజనరీగా వుండాలి. నాయకుడంటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుండాలి. నాయకుడంటే విజయాలను అందించాలి. నాయకుడంటే సంక్షేమం చూపాలి. ప్రజలకు ప్రేమ చూపాలి. ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని వుండాలి. అధికారంలో వున్నా, లేకున్నా ప్రజల నిత్యం స్మరిస్తూ వుండాలి. నాయకుడి కోసం తపించేలా వుండాలి. ఆ నాయకుడికి ప్రజలంటే పరితపన వుండాలి. వారి కోసం అహర్నిషలు పనిచేసేలా వుండాలి. తనను నమ్ముకున్న వారిని అండగా వుండాలి. అలాంటి అన్ని సుగుణాలున్న , మనసున్న నాయకుడు హరీష్‌రావు. కంటెంటున్న వాడికి కటౌట్ చాలు అన్న పదం అటు నవతరం రాజకీయాల్లో కేసిఆర్‌కు, యువతరం రాజకీయాల్లో హరీష్‌రావుకు మాత్రమే సూటౌతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే హరీష్‌రావు అంటేనే ఒక ఉద్యమం. ఆయన ప్రజల కోసం ఆరాటమైనా, ప్రజల కోసం సంక్షేమైనా ఒక ఉద్యమంలా చేస్తాడు. ప్రజల ప్రేమను కూడా ఒక ఉద్యమం దోచుకుంటాడు. హరీష్ అంటే ఒక పోరాటం. నాడు తెలంగాణ కోసం పోరాటం చేశాడు. సమస్యల మీద సమర శంఖారావం పూరించాడు. అధికారంలో వున్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడ్డాడు. మొత్తం తెలంగాణ కోసం అహర్నిషలు కృషిచేశాడు. ఆయన పని రాక్షసుడు. అందుకే ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని వున్నారు. పదవిలో వున్నా, లేకున్నా ఆయన ముందు నాయకులంతా దిగదుడుపే. సింహం ఎక్కడున్నా సింహమే..ఏనుగుకు ఎక్కడైనా కొండంత విలువే అన్నట్లు హరీష్‌రావంటే ఏ ప్రాంత ప్రజలకైనా ప్రేమే. అందుకే ఆయన సమస్యల సాధకుడు. ప్రగతి స్వాప్నికుడు. కార్యసిద్ది గల శ్రామికుడు. ఆయనకు అప్పగించిన ప్రతి పనిలో గెలుపును సొంతం చేసుకునే విజయుడు. రాజకీయాలలో అజేయుడు. ఎన్నికల విజేత. ప్రచారాలలో ఎదురులేని నేత. అందుకే ఆయను ట్రబుల్ షూటర్ అంటారు. ప్రత్యర్ధుల మీద హరీష్‌రావు ఎక్కుపెట్టే గాండీవాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అంతటి సమర్ధుడు హరీష్‌రావు. అందుకే ఎవరు ఔనన్నా,ఎవరు కాదన్నా బిఆర్‌ఎస్‌లో మలితరం, యువతరం నాయకుల్లో హరీషే నెంబర్ వన్…పార్టీలో ఆయనే సూపర్ మ్యాన్.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ స్టార్ కాంపైనర్‌గా హరీష్‌రావు పోషిస్తున్న పాత్ర అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
గత ఎన్నికలు వేరు.గతంలో ఆయన చూపిన చొరవ వేరు. పార్టీ అధికారంలో వున్నప్పుడు వుండే పాత్రకు, ప్రతిపక్షంలో వున్నప్పుడు నిర్వర్తించే పాత్రకు చాలా తేడా వుంటుంది. పార్టీ అధికార పక్షంలో వున్నప్పుడు పార్టీ శ్రేణులు కూడా ఎంతో సహకరిస్తాయి. అప్పుడు నాయకుల వెంట శ్రేణులు ఎప్పుడూ వుంటారు. అధికారంలో లేనప్పుడు శ్రేణులను ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ వుండడం, వారిని ఎన్నికలకు సన్నద్దం చేయడం వంటి కార్యక్రమాలు అంత సులువైనవి కాదు. అధికారంలో వున్నప్పుడు నాయకుల కోసం శ్రేణులు ఎదురుచూస్తుండడం పరిపాటి. కాని అధికారంలో లేనప్పుపడు శ్రేణుల కోసం ఎంత సమయమైనా వేచిచూడాల్సిన సందర్భాలు కూడా నాయకులకు ఎదురుకావొచ్చు. అయితే హరీష్‌రావు నాయకత్వంలో వుండే విశిష్టమైన లక్షణం చాలా అరుదుగా వుంటుంది. ఆయన అధికారంలో వున్నప్పుడైనా, అధికారంలో లేనప్పుడైనా ఒకేలాగా వుండడం మాత్రమే తెలుసు. అందుకే ఆయన అందరికీ నచ్చుతాడు. అంతే కాదు పార్టీలో ఏ నాయకుడైనా, ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా చెప్పగిలేంత చనువు ఒక్క హరీష్‌రావు వద్దమాత్రమే వుంటుంది. ఎవరు ఏది చెప్పినా వింటాడు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఎంత సేపైనా వారి సమయం కేటాయిస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమింటే ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి తన వద్దకు రావొద్దని సూచిస్తాడు. నేనే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పండి. ఏదైనా అత్యవసరం అయితే తప్ప తన వద్దకు రండి అని చెప్పగలిగేంత గొప్ప గుణం ఆయనది. ఎందుకంటే చాలా మంది నాయకులు ఎన్నికల సమయంలో తప్ప, ఇతర సమయాల్లో ప్రజలకు అందుబాటులో వుండరు. నాయకుల దగ్గరకు ప్రజలు ఒకటికి పదిసార్లు తిరిగే సందర్భాలు కూడా వుంటుంటాయి. కాని హరీష్‌రావు వద్దకు ఎవరొచ్చినా, అదే రోజు ఆ వ్యక్తి పని పూర్తికావాలి. మళ్లీ మళ్లీ ప్రజలు తన వద్దకు రప్పించుకోవడం అన్నది ఏనాడు జరగదు. అందుకే ప్రజలు ఆయనను అంతగా అభిమానిస్తారు. సిద్దిపేట మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు తప్పితే, తర్వాత కాలంలో ఏనాడు హరీష్‌రావు వాడవాడలా తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఇప్పటికీ రాలేదు. కారణం ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే వుంటారు. ఎన్నికల సమయంలో మీరు ప్రత్యేకించి రావొద్దని ప్రజలే హరీష్‌రావు ప్రేమతో చెబుతుంటారు. అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న నాయకులు చాలా అరుదు. అందులో హరీష్‌రావు అగ్రగణ్యుడు.
ఎన్నికలు ఏవైనా, ఎక్కడైనా, ఎంత కష్టతరమైనా సరే పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో హరీష్‌రావు పాత్ర అమోఘం. అనన్య సామాన్యం.
ఎందుకంటే ఎన్నికల పోరు ఆయనకు తెలంగాణ బాటలో అలవాటైన మార్గం. ఉద్యమ కాలంలో హరీష్‌రావు పాత్ర లేని ఎన్నిక లేదు. అది స్ధానిక సంస్ధల ఎన్నికలైనా, శాసన సభ ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా…ఏ ఎన్నికలైనా హరీష్ ముందుండాల్సిందే…గెలిపించేందుకు హరీష్ తోడు వుండాల్సిందే..అందుకే ఉద్యమ కాలంలో ఏ ఉప ఎన్నిక వచ్చినా హరీష్‌రావు అక్కడ ప్రచారం చేయాల్సిందే..అన్నంతగా జనాన్ని ఆకర్షించగలిగారు. జనం మొప్పును పొందగలిగారు. ఆయన సాదించిన ఎన్నికల విజయాలు నభూతో నభిష్యతి. తన ఎన్నికలే కాదు, తన తోటి వారందరి ఎన్నికలను గట్టెక్కిస్కాడు. హరీష్ ఎన్నికల ప్రచారం చేశాడంటే అక్కడ విజయమే..అంతెందుకు బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఎన్నికల ప్రచారం కూడా ఎప్పుడూ భుజాలపై మోసే నాయకుడు హరీష్‌రావే. ప్రతి ఎన్నికల్లోనూ సిద్దిపేటతోపాటు, గజ్వెల్ ఎన్నికల బాధ్యత కూడా హరీష్‌రావే తీసుకుంటాడు. కేసిఆర్ అప్పగించిన ఇతర నియోజవర్గాలలో ప్రచారం సాగిస్తుంటాడు. ఇలా బిఆర్‌ఎస్‌ను కంటిపాపలా కాపాడుకునే నాయకుడు హరీష్‌రావు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోనూ మెదక్ నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం సాగిస్తున్నాడు. ఒక రకంగా ఆయన పోటీ చేస్తున్నంత సీరియస్‌గానే ప్రచారంలో విసృతంగా పాలు పంచుకుంటున్నాడు. అటు మెదక్ ప్రచారంతోపాటు, తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటూ అహర్నిషలు కృషి చేస్తున్నాడు. గత శాసన సభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు స్ధానాలు తప్ప, మిగతా అన్ని స్ధానాలను గెలిపించిన ఘనత హరీష్‌రావుదే. తెలంగాణలో ఉప ఎన్నికలు అంటే చాలు హరీష్ పరిగెత్తాల్సిందే?: ఇప్పుడున్నంత నిమ్మలం ఒకనాడు లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్విరామంగా దశాబ్ధంన్నర కాలం. కడుపు నిండా తిన్నది లేదు. కంటినిండా నిదురపోయిన సమయం లేదు. ప్రయాణాలలో పెద్ద పైళ్లు ముందు పెట్టుకొని, సంతాకాలు చేసిన రోజులున్నాయి. తన కారే కార్యాలయంగా మల్చుకొని హరీష్‌రావు పనులు పూర్తి చేసిన రోజులున్నాయి. ఇలాంటి అనుభవం ఎవరికీ ఎదరు కాలేదు కావొచ్చు. ఎందుకంటే నాడు హరీష్‌రావుదే తెరాసబాధ్యత.
ఉప ఎన్నికల వచ్చిన ప్రతీసారి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు.
ప్రజలకు ఏం కావాలో హరీష్‌రావుకు తెలుసు. ప్రజల ఏ కోరుకుంటున్నారో తెలుసు. తన నియోజకవర్గంలో ప్రజలకు ఏలాంటి అవసరాలు వున్నాయో తెలుసు. ఏఏ ఊరిలో ఎలాంటి సమస్యలున్నాయో తెలుసు. ఏ వ్యక్తి ఏ గ్రామానికి చెందిన వ్యక్తో కూడా తెలుసు. ఒక్కసారి ఒక వ్యక్తిని చూస్తే మర్చిపోవడం అంటూ వుండదు. ఒక్కసారి పేరు వింటే ఎంత కాలానికైనా గుర్తుపట్టి పిలవడం తెలుసు. అంత జ్ఞాపకశక్తి కల్గిన నేత హరీష్‌రావు. అభివృద్ది అంటే ఏమిటో, ప్రజలు కోరుకునేదేమిటో తెలిసిన నాయకుడు హరీష్‌రావు. అందుకే సిద్ధిపేట అంటే హరీష్‌రావు అన్నంత సార్ధకత సంపాదించుకున్నారు. ముప్పై ఏళ్ల క్రితం సిద్దిపేటకు ఇప్పటి సిద్ధిపేటకు ఎంతో తేడా వుంది. 1985 లో తొలిసారి సిద్దిపేట నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన కేసిఆర్ సిద్దిపేట అభివృద్ధికి పునాదులు వేశారు. 2005లో ఎమ్మెల్యే అయినా హరీష్‌రావు ఆ పునాదుల మీద గొప్ప నగరాన్ని నిర్మాణం చేశారు. సిద్దిపేటను నభూతో నభిష్యత్ అని చెప్పుకునేలా విస్తరింపజేశారు. నగరంగా ఉన్న సిద్దిపేటను మహానగరంగా తీర్చిదిద్దారు. ఇక నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని అందమైన ప్రకృతి వనం చేశారు. సకల సౌకర్యాలు కల్పించారు. మా ఊరికి ఇది లేదు అన్నంతగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తిచేశారు. పల్లెసీమలు వికసింపజేసేలా ప్రగతిని కనబర్చారు. అందరూ అబ్బుర పడేలా చేశారు. ఇది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ముపై ఏళ్ల క్రితం నగర పంచాయితీ స్ధానం నుంచి కేసిఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా వున్న సమయంలో మున్సిపాలిటీ స్ధాయికి పెంచారు. తెలంగాణ సాధించుకున్నాక హరీష్‌రావు మున్సిపల్ కార్పోరేషన్ చేశాడు. నగరంగా వున్న సిద్ధిపేటను మహానగరంగా మార్చి, గొప్ప నగరంగా తీర్చిదిద్దాడు. ఒకనాడు సిద్ధిపేటలో నీటి కటకట విపరీతంగా వుండేది. సిద్ధిపేట పట్టణంలోనే కాదు, నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో నీటి కటకట వుండేది. కేసిఆర్ ఎమ్మెల్యేగా వున్నప్పుడు కొంత నీటి గోస తీర్చాడు. ఇంటింటికీ మంచినీళ్లు అందించారు. దాని కొనసాగింపుగా హరీష్‌రావు సిద్ధిపేటలో జలసిరులు నాట్యమాడేలా చేశాడు. ఈ రెండూ ఏ కాలంలో నిర్వర్తించి, ప్రజల మన్ననలు పొందిన నాయకుడు హరీష్‌రావు.
ఓదెల మండలం పోత్కపల్లి రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు అనుకోకుండా వచ్చిన గాలి వర్షానికి తడిసి ముద్దయ్యారు.స్టేషన్లో ప్లాట్ ఫాం పై ఉన్న ఒక్క పాత షేడ్ ఉరుస్తుండడం తో ఎలాంటి షేడ్ లు లేకపోవడం తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని,కనీసం ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి పోత్కపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం నుతన షెడ్లు,మరియు తాగు నీరు, టాయిలెట్ లు నిర్మించాలని కోరారు.
సమాచార హక్కు వికాస సమితి దుగ్గొండి మండల సెక్రటరీగా మల్లంపల్లి గ్రామానికి చెందిన వెండి వినయ్ కుమార్ ఎన్నికయ్యాడు.ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వై. కృష్ణారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రగతి కోసం చట్టబద్ధ పాలనకోసం పారదర్శకత జవాబుదారీతనం పెంపుకోసం పనిచేస్తానని తెలిపారు. అవినీతి అక్రమాలను అరికట్టడం, అర్హులైన వారికి విద్య, వైద్యం, సంక్షేమం అందదానికి అలాగే అభివృద్ది పనులలో నాణ్యత కోసం ప్రజాధనం దుర్వినియోగం అడ్డుకోవడం కోసం ప్రజలు చెల్లించిన పన్నులతో పనులకు అయ్యే ప్రతి ఖర్చులు ప్రతి పౌరుడు తెలుసుకునే హక్కు,ఇతర హక్కులు,చట్టాలపై అవగాహన కల్పిస్తూ వ్యక్తి వికాసా మూలలను తెలుసుకోవడం కోసం కార్యక్రమాలను నిర్వహిస్తామని కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు.
వేసవి తీవ్రత వల్ల విధులకు రాలేకపోతే వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశం
__@హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తిరుమలాదేవి
నేటిధాత్రి, హైకోర్టు హైదరాబాద్:- రాష్ట్రంలో వేసవి తీవ్రత అధికమవడంతో విధులకు హాజరు కాలేకపోతున్న లాయర్లకు హైకోర్టు ఉపశమనం కల్పించింది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల వల్ల న్యాయవాదులు గైర్హాజరైనట్టయితే వారి కేసులకు సంబంధించి వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ తిరుమలాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని కోర్టుల జ్యుడిషియల్ అధికారులు (మేజిస్ట్రేట్లు) పాటించాలని స్పష్టం చేశారు. హైకోర్టు బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వెలువడిన ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు పంపినట్టు తిరుమలాదేవి తెలిపారు.
కాకర్జలా తండాలో బి ఆర్ ఎస్, బీజేపీ పార్టీలనుండి భారీగా చేరికలు..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశిచంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా బంజార ప్రజల ఆపద్బాంధవుడు జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి జనంపల్లి ఆదేశాను మేరకు మహబూబ్ నగర్ జిల్లా మాజీ డీసీసీ అధికార ప్రతినిధి, జనంపల్లి దుష్యంత్ రెడ్డి,నవాబుపేట మండలంలోని తండాలలో ఎంపి ఎన్నికల ప్రచారము నిర్వహించారు. నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీరటి రామచంద్రయ్య అధ్వర్యంలో మండలంలోని మెట్టుగడ్డ తండాలో ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీల కార్డును ప్రజలకు వివరిస్తూ యువ న్యాయం,నారీ న్యాయం,రైతు న్యాయం,శ్రామిక న్యాయం,సామాజిక న్యాయం అను అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.తండాలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రజా సమ్మేళన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తండావాసులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం చేస్తానని అన్నారు.పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశిచంద్ రెడ్డి ని భారి మెజారిీతో గెలిపించి సోనియా గాంధీ కి బహుమతిగా ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గానికి 1000 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తారని హామీ ఇచ్చారని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి స్పోక్ పర్సన్ జహీర్ అక్తర్,జిల్లా డిసిసి జనరల్ సెక్రటరీ బంగ్లా రవి,జిల్లా ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ నీల్య నాయక్,కొల్లూరు ఎంపిటిసి తులసి రామ్ నాయక్ ,కామారం ఎంపిటిసి భాగ్య నరసింహులు,మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్,ఓబీసీ సెల్ అధ్యక్షులు బంక మల్లేష్ యాదవ్,నవాబుపేట యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ&మండల ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్. ప్రేమ్ కుమార్ నాయక్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ నరేందర్,జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ ఠాగ్రు నాయక్,కోలగుట్ట తండా తులసి రామ్ నాయక్,యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రకాష్ నాయక్,సత్యనారాయణ,టౌన్ ప్రెసిడెంట్ తిరుపయ్యా,పి. మాన్య నాయక్, వెంకటేశ్వర తండా ఉప సర్పంచ్ భగవాన్ నాయక్,ఫుల్యా నాయక్, ఎం.లక్ష్మణ్, ఎం.సంతోష్,గజ్జ శంకర్, వినోద్ బాబా,బాదావత్ అరుణ్, అంగూర్,ఎండి ఉమర్, తండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్, ఉపేందర్ శ్రీను నాయక్, కె. రవి మరియు తదితర గ్రామ మరియు మండల యువకులు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగినది.
నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు గ్రామంలో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలకు గ్రామ బిజెపి నాయకులు పిట్ల స్వామి ఆధ్వర్యంలో మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఉపాధి హామీ డబ్బులు కూడా కేంద్రం నిధులెనని కూలీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎనుగంటి కనకరాజు, మ్యాదరి చింటూ,దొరగోళ్ళ సతీష్, పిట్ల చరణ్,మ్యాదరి తరుణ్,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, కూడవెల్లి వేణు,తదితరులు పాల్గొన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణంలోని వివిధ వార్డులలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారాలు నిర్వహించారు. మునిసిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మూడవ వార్డు ఇందిరానగర్, 19వ వార్డు శ్రీనివాస్ నగర్ ఏరియాలలో సైతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు హాజరయ్యారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని,హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, కౌన్సిలర్లు బింగి శివాని శివకిరణ్, కొక్కుల స్రవంతి సతీష్, మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, గంగారపు సత్యపాల్, జంగపల్లి మల్లయ్య, యూత్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.
హనుమకొండలో రాత్రి బైక్ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే హనుమకొండ వినాయక నగర్ లో నివాసం ఉంటున్న తెలుకలపేల్లి ఓంకార్ అనే వ్యక్తి ఏప్రిల్ 30వ తారీఖున మంగళవారం రాత్రి తన అవసరాల నిమిత్తం బయటికి వెళ్లి వచ్చి తమ ఇంటి ముందు టీఎస్ 03 ఈ డబ్ల్యూ 4893 నంబర్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ గల బైక్ ను పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లి దాదాపు సమయం 10:15 గంటలకు బయటికి వచ్చేసరికి బైక్ కనిపించలేదు అని బాధితుడు చెప్తున్నాడు. అదేవిధంగా తమ ఇంటికి ఎదురుగా మాతాబార్ ఉన్నందున ఎవరైనా తీసి ఉంటారనే అనుమానంతో బాధితుడు దగ్గరలో ఉన్న కేయు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయగ ఎస్సై రవీందర్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .
సోమవారం రోజు బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం ముగించుకొని వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని మార్కెట్ యార్డ్ నందు రాత్రి కురిసిన వర్షానికి భారీ మొత్తంలో తడిసిన ధాన్యాన్ని మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అనడానికి ప్రత్యేక నిదర్శనం ఈ తడిసిన ధాన్యం అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్లాలల దగ్గరికి వెళ్లి ప్రతి గింజ కొన్నాంమని .తడిసిన ప్రతి గింజకూ సమాంతర ధర కట్టించి రైతులను అదుకున్నాం అని తెలియజేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు అరి గోస పడుతున్నారని,రైతు బంధు,రైతు భీమా,పండిన పంటకు బోనస్,24 గంటల కరెంట్ ఇంకా ఏవి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.. తప్పకుండా తడిసిన ప్రతి గింజ కొనెవరకు రైతులకు మద్దతుగా ధర్నాలు చేసి రైతులకు అండగా ఉంటామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్ దే నని నేడు రైతులను పట్టించుకోకుండా మార్కెట్ యార్డ్ కు తాళాలు వేసి బయట నిల్చోబెట్టి అవమనపరుస్తున్నారని మండిపడ్డారు. ఇక నైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వారిని అదుకునేవారకు పోరాడుతూనే ఉంటాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
బలరాం నాయక్ ని కేంద్రమంత్రిగా చేసే బాధ్యత సోనియమ్మది.
భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలంలో భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజలతో మమేకమై మాట్లాడుతూ
కేంద్రంలో ఇండియా కూటమి అధికారాన్ని చేపడితే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఐదు న్యాయాలు,అందులో దేశ ప్రజలందరికీ ఉపయోగకరంగా పొందుపరిచినటువంటి అంశాలను ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం కారణము ప్రజలేనని, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా నిర్ణయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తుందని.
కాంగ్రెస్ పార్టీ ప్రజాధరణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెండుగా ఉండి పార్లమెంట్ అభ్యర్థులుగా మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధిగా బర్రిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ ని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ఆయన మాట్లాడారు.
ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు తాండ్ర నరసింహారావు,కొండిశెట్టి కృష్ణమూర్తి,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము, రత్నం రమాకాంత్, పి. శ్రీనివాస్,బంబోతుల రాజీవ్,చింతాడి రామకృష్ణ,నర్రా రాము,అన్నెం రామిరెడ్డి,దుదుకూరి సాయిబాబా, గాడి విజయ్,సిపిఎం నాయకులు బాలనరసారెడ్డి,వెంకట్ రెడ్డి,మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి,కెతినేని లలిత,కట్ట కళ్యాణి, రూపా దేవి, లక్ష్మీకాంతం,సిపిఎం,కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ నెల పది లోగా మండలములోని 21 అమ్మ ఆదర్శ పాఠశాలలో చేయాల్సిన పనులు పూర్తి చేయాలని ఎంపిడిఓ బాబు విఓ అధ్యక్షులు, అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ను ఆదేశించారు.పాఠశాలల్లో వసతులు ముఖ్యంగా త్రాగు నీరు,టాయిలెట్,విద్యుత్,పాఠశాల మరమ్మత్తు పనులు,వెంటనే పూర్తి చేయాలని కోరారు.
మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మంగపేట మండలంలో పలుగ్రామలలో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ , కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చారు అని అన్నారు,క్వింటా వడ్లకు 500 బోనస్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు, ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక గ్యారెంటీ కూడా అమలు చేయలేదని అన్నారు, పెన్షన్లు 4వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వడంలేదని అన్నారు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు,కావున ఇప్పుడు, మళ్లీ ఓట్ల కోసం రైతు రుణమాఫీ ఆగస్టు 15 తారీకు చేస్తానని అంటున్నాడు. కావున ప్రజల గమనించాలని ఇప్పుడు జరిగే మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వీరి వెంట మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, పి ఎ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, జిల్లా నాయకులు, కాకులమర్రి ప్రదీప్ రావు తాటి కృష్ణ, సీనియర్ నాయకులు, ఆళ్ల జనార్దన్, కోరం నర్సింహులు, చిన్నదర్ చక్రధర్, యర్రంకాని మురుషోత్తం, తదితరులు పాలుగోన్నారు
– వెలిచాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలి – వెలిచాల రాజేందర్ రావు సోదరి రోహిణి రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 7(నేటి ధాత్రి) సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు మార్కండేయ వీధిలో వెలిచాల రాజేందర్ రావు సోదరీమని రోహిణి తో కలిసి పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేపట్టారు. మరోవైపు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో నేటి ఉదయం వాకర్స్ తో పాటు కూరగాయల క్రయ విక్రయదారులతో ప్రచారం చేపట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, వెలిచాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, యేల్లె లక్ష్మీనారాయణ,కాముని వనిత, కల్లూరి చందన, మ్యాన ప్రసాద్, గోలి వెంకటరమణ, నీలి రవీందర్, సామల పావని దేవదాసు, మడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకూడదని హెచ్చరిస్తున్న అటవీ అధికారులు
నీలగిరి ప్లాంటేషన్ వద్ద గుర్తించిన చిరుత పులి పాదముద్రలు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జైపూర్ మండలం లోని కుందారం అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని మంగళవారం రోజున అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కుందారం సమీపంలోని అటవీ అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎఫ్.డి.సి )నీలగిరి ప్లాంటేషన్ లో రెండు రోజుల కిందట సంచరించిన చిరుత పులి పాదముద్రలను గుర్తించామని చెప్పారు.కుందారం,నర్సింగాపూర్,మద్దులపల్లి,ఆరెపల్లి అటవీ ప్రాంత సమీప గ్రామాల నివాసితులు అడవిలోకి రావద్దని హెచ్చరించారు.చిరుత పులి సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు తమ పంట పొలాల రక్షణ చర్యల నిమిత్తం కరెంట్ తీగలు వాడవద్దని,చిరుత పులి కి హాని కలిగించే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని పేర్కొన్నారు. అటవీ ప్రాంతం లో చిరుత పులి సంచారం సహజమని,అది తన ఆవాసం, జీవనం కోసం వందల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటుందని వివరించారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఆందోళన చెందవద్దని సూచించారు.ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు,సిబ్బంది, అటవీ అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎఫ్.డి.సి) అధికారులు, సిబ్బంది సమన్వయంతో చిరుత పులి సంచరిస్తున్న సమీప ప్రాంత ప్రజలకు అడవిలోకి వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.