హన్మకొండ, నేటిధాత్రి:
హనుమకొండలో రాత్రి బైక్ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే హనుమకొండ వినాయక నగర్ లో నివాసం ఉంటున్న తెలుకలపేల్లి ఓంకార్ అనే వ్యక్తి ఏప్రిల్ 30వ తారీఖున మంగళవారం రాత్రి తన అవసరాల నిమిత్తం బయటికి వెళ్లి వచ్చి తమ ఇంటి ముందు టీఎస్ 03 ఈ డబ్ల్యూ 4893 నంబర్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ గల బైక్ ను పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లి దాదాపు సమయం 10:15 గంటలకు బయటికి వచ్చేసరికి బైక్ కనిపించలేదు అని బాధితుడు చెప్తున్నాడు. అదేవిధంగా తమ ఇంటికి ఎదురుగా మాతాబార్ ఉన్నందున ఎవరైనా తీసి ఉంటారనే అనుమానంతో బాధితుడు దగ్గరలో ఉన్న కేయు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయగ ఎస్సై రవీందర్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .