నిజాంపేట: నేటి ధాత్రి, మే 7
నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు గ్రామంలో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలకు గ్రామ బిజెపి నాయకులు పిట్ల స్వామి ఆధ్వర్యంలో మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఉపాధి హామీ డబ్బులు కూడా కేంద్రం నిధులెనని కూలీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎనుగంటి కనకరాజు, మ్యాదరి చింటూ,దొరగోళ్ళ సతీష్, పిట్ల చరణ్,మ్యాదరి తరుణ్,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, కూడవెల్లి వేణు,తదితరులు పాల్గొన్నారు.