జడ్చర్ల కేంద్రంలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణ డిగ్రీ కళాశాల సహాయ ఆచార్యులు కొనకొండ్ల సుభాషిణి కి ప్రతిష్టాత్మక కళింగ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. జంతు శాస్త్రము లో డాక్టర్.అజయ్ కుమార్ హరిత్ పర్యవేక్షణ లో ఇక్తిక్ డైవర్సిటి, ఫిసికో కెమికల్ అండ్ మెటల్ కన్సర్ట్రేషన్స్, డైనమిక్స్ అనే అంశం పైన పరిశోధన చేసినందుకు కళింగ యూనివర్సిటీ, ఛత్తీస్గఢ్ పిఎచ్ డి, ని ప్రకటించినట్టు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్. అప్పియ చిన్నమ్మ అధ్యాపక మరియు అద్యాపక్కేతర సిబ్బంది అభినందించారు…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వివేకవంతుడు విజ్ఞానవంతుడు బహుముక ప్రజ్ఞశాలి అయినటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థించడం జరిగిందని ఎలాగైనా వినోద్ కుమార్ ని గెలిపించి కరీంనగర్లో పార్టీ గెలుపు కు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ సీనియర్ నాయకులు జగత్ కుమార్ భానుమూర్తి రంగు ప్రసాద్ మండల యూత్ నాయకులు నెలల అనిల్ నవీన్ రెడ్డి బి ఆర్ ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు కనకరాజు శ్రీకాంత్ రెడ్డి చందు దేవేందర్ లింగం అరవింద్ రమణ సంతోష్ శ్రీనివాస్ తిరుపతి స్వప్న తిరుమల్ పూర్ణచందర్ మనోహర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు
జైపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున నేతకని కులస్థులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈనెల జరిగిన పెదపెల్లి పార్లమెంట్ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గ రాజారాం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో తెలంగాణ రాష్ట్ర నేతకాని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో నేతకని కార్పొరేషన్ 3,నెలల లోపు ఏర్పాటు చేసి కార్పొరేషన్ కొరకు హైదరాబాదులో అధునాతన భవనం ఏర్పాటుకు అలాగే అధ్యక్షత పదవి ఇచ్చి నేతకని కులస్తులకు న్యాయం చేస్తా అని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని. తెలంగాణ లోని నేతకాని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చెయ్యడం జరిగిందినీ, అదేవిధంగా మే 13న జరిగే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి యువనేత ప్రజాసేవ చేసే నాయకుడు గడ్డం వంశీ కృష్ణ గారిని భారీ మెజార్టీతో నేతకాని కులస్తులు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలిపారు. గత 70 సంవత్సరాల్లో నేతకాని కులస్తులకు ఎలాంటి రాజకీయ పదవుల ద్వారా గాని అదేవిధంగా ఆర్థికంగా గాని ఆదుకున్న ప్రభుత్వాలు లేవని తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క కులాస్తులకు గాని వర్గాలకు గానీ న్యాయం జరుగుతుందని రేపు రానున్న రోజుల్లో కూడా నేతకాని కులాస్తులకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి గా చెందబోతున్నారని,నేతకని కులస్తులు మీడియాతో మాట్లాడటం జరిగింది.ఈ యొక్క నేతకని కార్పొరేషన్ ఏర్పాటు కు కృషి చేసిన గౌరవ ప్రజా సేవకులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చెయ్యడం జరిగిందని, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారికి జైపూర్ మండల నేతకానీ కులాస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని నేతకాని కుల సంఘ నాయకులు , జైపూర్ మండల కోఆర్డినేటర్ జనగామ మంగ, జాడి లక్ష్మి, దుర్గం మల్లేష్ ,కామెర మనోహర్ ,ఆగిడి లింగన్న, జనగామ పోషణ ,కామెర లక్ష్మణ్ ,నీలం శ్రీనివాస్ ,కుమ్మరి శేఖర్, దూట చంద్రయ్య ,గోదారి తిరుపతి, దూట రాజబాబు, జుమ్మిడి కిష్టయ్య, జాడి వెంకటేష్, మరియు నేతకాని కులస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.
– గడపగడపకు బి.ఆర్.ఎస్ పార్టీ ప్రచారం సిరిసిల్ల, మే – 7(నేటి ధాత్రి): పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో స్థానిక మూడో వార్డులో మంగళవారం భారతదేశ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బోయిన్పల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని తెలంగాణ ఉద్యమంలో మరియు తెలంగాణ హక్కుల సాధనకై చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు.. వీరి వెంట వార్డ్ అధ్యక్షులు మెర్గు శేఖర్, గోషిక శ్రీనివాస్, దూస ఈశ్వరి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూస రాజేశం, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు…
మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీ చందర్ రెడ్డి కి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో గడప గడప కు వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీ ల గురించి వివరిస్తూ . ఆగస్టు 15. వరకు రైతు లకు 2. లక్షలు రుణ మాఫీ గురించి ప్రజలకు ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బి రాములు, మాజీ సర్పంచ్ గోపాల్, మాజీ సర్పంచ్ జీవన్ రెడ్డి, అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బాండ్ర సురేష్, ఏ రాములు, మాజీ వార్డ్ నెంబర్ అంజి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఉపాధి హామీ కూడల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కరీంనగర్ ఎంపీగా రాజేందర్ రావు ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు చల్ల ప్యాకెట్లు అందజేస్తూ వినూత ప్రచారం నిర్వహించారు అలాగే చేతి గుర్తుపై ఓటు వేసి కేంద్రంలో ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన రాష్ట్ర అభివృద్ధికి కృషిచేయాలని ప్రజలందరూ గమనించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగల రాజు మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు గుగ్గిల రాములు హనీ ఫ్ కిషన్ ఆనందం పరశురాముడు అభిషేక్ వరుణ్ తిరుపతి దేవయ్య తదితరులు పాల్గొన్నారు
అమ్మాయిలకు ఉచిత సమ్మర్ క్యాంప్ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 7(నేటి ధాత్రి):
కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు బాలికలకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా సిరిసిల్ల కుంఫు అకాడమీ మాస్టర్ ఓరగంటి రామకృష్ణ తెలిపారు. తన భార్య వేదశ్రీ స్మారకార్థం నిర్వహించే ఈ ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మార్షల్ ఆర్ట్స్, కర్ర సాము, నాన్ చాక్, యోగ, కరాటే వంటి పలు విభాగాల్లో బాలికలకు ఉచిత శిక్షణ అందించనున్నారు. మరిన్ని వివరాలకి ఓరగంటి రామకృష్ణ సెల్ నెంబర్. 9676077160 ను సంప్రదించగలరు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో ఆయన ఉన్న కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని విద్యావంతుడు అయినా మన నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుపై ఓటు వేసిగెలిపించాలని కోరారు అలాగే కరీంనగర్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేలిపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచులు అనిత రవీందర్ జాగృతి మండల అధ్యక్షుడు కందుకూరి రామా గౌడ్ ఏం సి మాజీ డైరెక్టర్ రోజా వెంగళ రమేష్ నందగిరి భాస్కర్ శివ విజయ్ నరేష్ బాలకృష్ణ ఉమాశంకర్ యాదగిరి రాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీడీ ప్యాకింగ్ కంపెనీలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా బలపరిచిన వెలిచాల రాజేందర్రావుకి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని బీడీ కార్ఖానాలో కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గ్రామంలోప్రచారం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్ ఆసాని సత్యనారాయణ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు నేరెళ్ల నరసింహ గౌడ్ మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి సు ద్దాల కర్ణాకర్ రాపల్లి ఆనందం సామల రమేష్ మోర లక్ష్మీరాజం బండి పరశురాములు లింగం రాణి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల గడువుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారా స్ధాయిలో జరుగుతోంది. అటు జాతీయ పార్టీలు, వారి అగ్ర నాయకులు , ఇటు బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్, హరీష్‌రావులు కాలుకు బలపం కట్టుకోకుండా ప్రచారం సాగిస్తున్నారు. శాసన సభ ఎన్నికలు అయిపోయిన మూడు నెలల్లోనే మళ్లీ ఎన్నికల వాతావరణం రావడం వల్ల ప్రజలు ఎటు వైపు మొగ్గుతారన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఎవరి లెక్కలు వారికి వున్నాయి. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. కాని ప్రజలు ఎవరు అంచనాలకు అందడం లేదు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎన్నుకొని ప్రజలు మోసపోయారని బిఆర్‌ఎస్ విసృతంగా ప్రచారం సాగిస్తోంది. పదేళ్లుగా తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుతిన్నదని కాంగ్రెస్ ఆరోపణలు సాగిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే మాటలు ప్రజలకు పదే పదే చెప్పి, ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టింది. దాంతో ప్రజలు చాల తొందరగా కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులయ్యారు. విపరీతమైన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలు ఆ పార్టీని నమ్మడానికి ముందూ వెనుకాడుతుంటారు. అందులోనూ కాళేశ్వరం కథను కాంగ్రెస్ వాళ్లు, మీడియా కళ్లకు కట్టినట్లు చూపిస్తూ వచ్చారు. అదే సమయంలో బిఆర్‌ఎస్ పార్టీ పాటించిన మౌనం కూడా కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ఎందుకంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. అదే కాంగ్రెస్ గెలుపుకు ఉపయోగపడిరది. కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఇదే విషయాన్ని కాంగ్రెస్ చెప్పడానికి పెద్దగా ధైర్యం చేయడం లేదు. మూడు నెలల్లోనే తెలంగాణకు కరువొచ్చింది. అది తెచ్చిన కరువు అంటూ బిఆర్‌ఎస్ వాదించింది. కాదు వర్షాభావ పరిస్ధితులే కారణమని కాంగ్రెస్ అంటోంది. ఇప్పుడు అసలైన రాజకీయం ఈ ఎన్నికల్లో వుంటుంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చెప్పిన మాటలే వింటే మాత్రం భవిష్యత్తులో బిఆర్‌ఎస్‌కు తెలంగాణలో నూకలు చెల్లినట్లే…కాంగ్రెస్ చెప్పింది అబద్దమని…తాము నమ్మి మోసపోయామని గ్రహించి బిఆర్‌ఎస్‌కు మెజారిటీ సీట్లు కట్టబెడితే మాత్రం కాంగ్రెస్‌కు ఇక ఐదేళ్లు కష్టకాలమే..రేవంత్ ప్రభుత్వానికి దిన దిన గండమే..ఇక బిఆర్‌ఎస్ నాయకులు ఆగరు. బిఆర్‌ఎస్ పెద్దలు అసలే ఆగరు. నిత్యం ఏదో ఒక వివాదం రాజేస్తారు. ప్రజలకు మరింత దగ్గరౌతారు. ఎందుకంటే తెలంగాణలో నీళ్లు, కరంటు ఎంతో కీలకం. తెలంగాణలో సాగు సాగాలంటే నీరు కావాలి. కరంటు తప్పకుండా కావాలి. ఈ రెండు లేకుండా సాగు అసాధ్యం. అందుకే తెలంగాణలో ఈ ఎన్నికలకు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారనున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో సాగినంత జోరుగా, జోష్‌గా ఎక్కడా ఎన్నికల ప్రచారాలు సాగడం లేదు.
దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల కోలాహాలం వున్నప్పటికీ తెలంగాణలో సాగుతున్నంత ప్రచారం ఎక్కడా సాగడం లేదనే చెప్పాలి. మూడు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. ఏ పార్టీ వెనకడుగు వేయడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. కొన్ని కీలకమైన స్దానాల్లో బిజేపి కూడా తన బలం చూపించే అవకాశం వుంది. కాని తెలంగాణలో బిజేపి పైకి జరుగుతున్న ప్రచారమంత లేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ను కాదనుకుంటే ఆ ఓట్లు, సీట్లు బిజేపికి వెళ్లొచ్చు. కాని బిఆర్‌ఎస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. పైగా రైతులు, సామాన్యుల ఓటు తోడయ్యే అవకాశం వుంది. దాంతో మెజార్టీ సీట్లు బిఆర్‌ఎస్‌కు వెళ్లేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. మాకు పద్నాలుగుసీట్లు వాస్తాయని కాంగ్రెస్. మాకు పది సీట్లకు పైగా వస్తాయని బిజేపి చెబుతున్న మాటల్లో నిజంలేదు. కాని ఇక్కడ బిఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను ఆ రెండు జాతీయ పార్టీలు గమనించడం లేదు. అతివిశ్వాసంతో బిఆర్‌ఎస్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదు. అది ఆ రెండు పార్టీలకు గండాన్ని తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహం లేదు. కాకపోతే పూర్తి స్దాయిగా ప్రజల నాడి కూడా ఏ పార్టీకి అంతు చిక్కడం లేదు. ఎప్పుడు ఎలాంటి ప్రచారం ముందుకొస్తుందో అన్న సందేహం అన్ని పార్టీలలోనూ వుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఇక కాంగ్రెస్‌కు ఎదరులేదు. పార్లమెంటు ఎన్నికల్లో తిరుగుండదు అని అందరూ అనుకున్నారు. రెండు నెలులు గడిచిన తర్వాత రాష్ట్రంలో బిజేపి పుంజుకుంటుందన్న సంకేతాలు వెలువడ్డాయి. బిఆర్‌ఎస్ పూర్తిగా చతికిల పడినట్లే అన్న భావనే సర్వత్రా వ్యక్తమైంది. కాని ఇప్పుడున్న పరిస్ధితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బిజేపిలను దాటుకొని బిఆర్‌ఎస్ పరుగులో ముందుకు వెళ్తుందన్న మాటలు విని పిస్తున్నాయి. సైలెంటు ఓటింగ్ జరిగే అవకాశం వుందన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం వున్నాయి. కేంద్రంలో పదేళ్లపాటు అదికారంలో వున్న బిజేపి తెలంగాణకు పెద్దగా చేసిందేమీ లేదన్నది తెలియంది కాదు. కాకపోతే ఇటీవల కొంత బిజేపి బలం పెరిగిందన్న వాదనలు వున్నాయి. సరిగ్గా శాసన సభ ఎన్నికలకు ముందు రెండేళ్లుగా తెలంగాణలో బిజేపి ఊపు మీద కనిపించింది.
శాసన ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు బిజేపి చతికిలపడిరది.
ఒక దశలో తెలంగాణలో కాంగ్రెస్ కన్నా ముందంజలో వున్నదనుకున్న బిజేపి, కర్నాటక ఎన్నికలతో ఒక్కసారి వెనక్కి వెళ్లింది. మూడో స్ధానంలో వున్న కాంగ్రెస్ మొదటి స్దానానికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఏస్దానానికి వెళ్తుందనేదానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. గత ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మీద నిజంగానే ప్రజల్లో వ్యతిరేక వుందా? అన్ని ఎన్నికలు జరిగితే గాని అర్ధం కాకపోవచ్చు. ఎవరు చెప్పే లెక్కలు వారికున్నా, జనం లెక్కలు జనానికేవ వుంటాయి. వాటిని అన్ని సార్లు పసిగట్టలేపోవచ్చు. అధికారంలో వున్న కాంగ్రెస్‌ను పైకి నిందించకపోవచ్చు. ఎన్నికల్లో ఓటుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఆ పార్టీ ప్రభుత్వం మెరుగ్గా వుందని అనుకోవచ్చు. అదే రెండో స్దానానికో, మూడో స్ధానానికో పరిమితమైతే పాలన బాగలేదన్నది అర్ధం చేసుకోవచ్చు. గత రెండు నెలల క్రితం వరకు బిఆర్‌ఎస్ పని అయిపోయిందన్న వాళ్లే ఇప్పుడు కేసిఆర్ సభలు చూసి ఆశ్యర్యపోతున్నారు. కేసిఆర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని అంటున్నారు. కేసిఆర్ ఎక్కడికెళ్లినా జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. వచ్చిన వాళ్లు ఓట్లేస్తారా ? లేదా? అన్నది తర్వాత సంగతి. కాని ఇప్పటీకీ కేసిఆర్‌పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లలేదనే అనిపిస్తోంది. లేకుంటే అంత మంది జనం రారు. ఎంత తీసుకొచ్చినా రోడ్‌షోలకు అంత మంది ఎగబడడం జరగదు. రాత్రి వేళల్లో కూడా కేసిఆర్ కోసం ఎదరుచూడరు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కేసిఆర్ రోడ్‌షోలు సక్సెస్ కావడం అన్నది రాజకీయాల్లో మార్పులకు సంకేతమనే చెప్పాలి. కేసిఆర్ రోడ్‌షోలతో కారు పరుగులు పెట్టడానికి సిద్దంగా వుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పల్లె జనం అంతా కాంగ్రెస్‌కు సై అన్నారు. ఆ పార్టీని గెలిపించారు. కాని వచ్చీ రావడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. కారణాలు ఏవైనా కావొచ్చు. ఉద్యోగాల విషయంలో యువత కాంగ్రెస్ వైపు చూసింది. చాలా వరకు సబ్బండ వర్గాలన్నీ కాంగ్రెస్‌ను ఎంచుకున్నాయి. కాని అవే సబ్బండ వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు ఏమీలేకపోయినా, అపవాదు మోసే పరిస్దితి కనిపిస్తోంది. అసలు వెంటనే పార్లమెంటు ఎన్నికలు రావడం కూడా కాంగ్రెస్‌కు ఆశనిపాతమైందని అంటున్నారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ అడుగులు ముందుకు పడడలేదు. మూడు నెలలు గడవకముందే ఎన్నికల కోడ్ రావడం కూడా కాంగ్రెస్‌కు ఇబ్బంది కరమైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. కాళేశ్వరం వల్ల తెలంగాణకు సాగు నీరందలేదనేది కాంగ్రెస్ వాదన. మరి కాళేశ్వరం లేకుండా నీళ్లెందుకు రైతులకు ఇవ్వలేదనేది బిఆర్‌ఎస్ వాదన.
ఈ రెండిరటిలో రైతులు, ప్రజలు కాంగ్రెస్‌ను నిందించే పరిస్ధితి ఎదురౌతోంది.
కాంగ్రెస్‌ను నమ్మి, బిఆర్‌ఎస్‌కు ఓటు వేయని రైతాంగం కూడా ఇప్పుడు మళ్లీ కేసిఆర్ రావాలి. కావాలి అని కోరుకుంటున్న సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్ కాళేశ్వరం నిర్మాణం చేయడానికి ముందే తెలంగానలోని చెరువులన్నీ బాగు చేశాడు. వాటిని నీటితో నింపాడు. అందుకు కారణం దేవాదుల. ఆ దేవాదుల నిర్మాణం జరిగింది కాంగ్రెస్ హాయాంలోనే..కాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దేవాదులను పూర్తి స్ధాయిలో వినియోగించుకుంటే రైతులకు కష్టం వచ్చేది కాదు. రైతులు కేసిఆర్‌ను గుర్తుంచుకునేవారు కాదు. పంటలు కొన్ని ప్రాంతాల్లో ఎండిపోవడం వల్ల కూడా రైతులు కేసిఆర్‌ను కోరుకుంటున్నారు. కేసిఆర్ రోడ్ షోలకు పెద్దఎత్తును ప్రజలు హజరౌతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలకు కూడా ప్రజలు బాగానే వస్తున్నారు. కాని శాసన సభ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డికి వచ్చిన జనం వేరు..ఇప్పుడు వస్తున్న జనం వేరు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు ప్రజలు రేవంత్‌రెడ్డి రోడ్‌షోలకు స్వచ్చంధంగా వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ సభలకు పార్టీ తరలిస్తే వస్తున్నారు. అప్పుడు కేసిఆర్ సభలకు పార్టీ తరలిస్తే వచ్చారు. ఇప్పుడు కేసిఆర్ రోడ్‌షోలకు ప్రజలు స్వచ్చందంగా హజరౌతున్నారు. అంటే పరిస్ధితులు మారిపోతున్నాయని చెప్పకతప్పదు. ఇంకా సరిగ్గా ఎన్నికలకు కేవలం ఏడు రోజుల సమయమే వుంది.
ప్రధాని మోడీ కూడా తెలంగాణ ఎన్నికల మీద ప్రత్యేక శ్రద్దపెట్టినట్లు చెప్పుకుంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ కూడా తెలతంగాణలో పెద్దఎత్తున రోడ్‌షోలు ప్లాన్ చేసుకున్నారు. మోడీ తెలంగాణకు వస్తే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుందనుకున్నారు. కాని ఎక్కడా మోడీ ప్రభావం కనిపించిండం లేదు. ఇదిలా వుంటే ఒక్కసారిగా కేసిఆర్ రోడ్‌షోలను ప్లాన్ చేయడంతో జనమంతా కమలాన్ని చూడడం మర్చిపోయినట్లున్నారు. కేసిఆర్ రోడ్డెక్కిన తర్వాత మోడీ ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత కనిపిండచం లేదు. పైగా అటు కాంగ్రెస్, ఇటు బిఆర్‌ఎస్ లు హోరాహోరీగా తలపడే పరిస్ధితులు వున్నాయి. కాంగ్రెస్ మెజార్టీ సీట్లు రాకపోతే, ఐదు నెలలకే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లౌవుంది. కేసిఆర్ మాటకు విలువ పెరుగుతుంది. కారుకు బలం పెరుగుతుంది. కాంగ్రెస్‌లో లుకలుకలకు కారణమౌతుంది. అదే బిఆర్‌ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తే కాంగ్రెస్‌ను మరింత నష్టం చేకూరుతుంది. అందవల్ల కాంగ్రెస్‌కు మెజార్టీసీట్లు రావాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదొక్కుకోవాలన్నా, బిఆర్‌ఎస్ ఉనికి ప్రశ్నార్ధం కావాలన్నా కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రావాలి. ఇందులో ఏ మాత్రం బిజేపికి మెజార్టీ సీట్లు వచ్చినా తొలి ప్రమాదం కాంగ్రెస్ పార్టీకే ఎదురౌతుంది. తర్వాత బిఆర్‌ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుంది. అందుకే బిజేపికి కన్నా కారు, కాంగ్రెస్‌లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇదే తరుణంలో బిజేపి కూడా ఏమీ వెనుకబడి పోలేదు. కాని ప్రజల తీర్పు ఎలా వుంటుందన్న అంచనాలు అందడం లేదు.
బాలాజీ విద్యా సంస్థలలో ఒకటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు వేసవి సెలవుల్లో ప్రత్యేకమైన శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణా శిబిరంలో భాగంగా యోగా, కరాటే, డాన్స్, అబాకస్, గేమ్స్ అలాగే చెస్,క్యారం, క్రికెట్, మొదలగు వాటిలో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి తెలిపారు.ఈ శిబిరంలో ప్రత్యేకంగా పిల్లల మానసిక సాంస్కృతిక వికాసానికై ప్రత్యేకంగా భగవద్గీత బోధన చేయడం జరుగుతుందన్నారు. వేసవిలో విద్యార్థులను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచుతూ వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి యోగా, కరాటే లాంటివి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజ మాట్లాడుతూ పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, శాశ్వత మానసిక అభివృద్ధికి భగవద్గీత బోధనా ఎంతో ఉపయోగపడుతుందని ఇలాంటి శిక్షణా శిబిరాలను తల్లిదండ్రులు వినియోగించుకుని వారి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి మరియు మానసిక అభివృద్ధి కి దోహద పడాలని అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
# డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటి పడుతున్న భారత్.. # ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ,రామప్పను యునెస్కో గుర్తింపుకు మోడీ ప్రభుత్వం కృషి..
# రిజర్వేషన్లపై, బిజెపిపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. # కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. # నర్సంపేట భాజపా ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి తీవ్రవిమర్శలు.
# బీఅర్ఎస్ పార్టీ కవితకు ఓటు హక్కును మలినం అవుతుంది. # కాంగ్రెస్ అభ్యర్థి నోరు విప్పితే అబద్ధాలే.. # భాజపా అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్..
నర్సంపేట,నేటిధాత్రి :
దేశంలో గత పాలనలో కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీగా మారిందని నేడు ఆ పార్టీని దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఉత్తరాఖండ్ భాజపా సీఎం పుష్కర్ సింగ్ దామి ఆరోపించారు.భాజపా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపు కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేటలో బిజెపి జన సభ నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి హాజరై మాట్లాడారు.ముందుగా అందరికీ నమస్కారం అని తెలుగులో మాట్లాడుతూ ప్రసంగం మొదలుపెట్టారు.ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది, రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చిన పార్టీ బిజెపి అని పేర్కొన్నారు.మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసు అని ఆదివాసీ,గిరిజన ప్రజలకు అండగా ఉంటాడని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు.దేశాన్ని డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటి పడే దేశంగా ప్రధాని మోడీ నిలిపారని అన్నారు.కుల,మతాల రిజర్వేషన్లపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపిపై విష ప్రచారం చేస్తున్నారని అవేదన వ్యక్తంచేశారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కుంభకోణాల పార్టీ అని నేడు దేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు.కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని మోసపూరిత హమిలిచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని ఉత్తర్ఖాండ్ సీఎం ఆరోపించారు.తెలంగాణలో 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పథకాల అమలులో చేయలేదని మహిళలకు నెలకు 2500 వస్తున్నాయని అని అక్కడికి వచ్చిన వారికి అడిగారు.మహబుబాబాద్ జిల్లా పార్లమెంటు బిజెపి అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పై ప్రజల ఆశీస్సులుండాలని,ఇక్కడ గెలుస్తేనే దేశంలో అధికారంలోకి మరోసారి వస్తారని ఓటర్లను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో బీఅర్ఎస్ నేత కేసీఆర్ కూతురు స్కాముల కేసులో జైల్లో ఉన్నదని,కాంగ్రెస్ అదే స్థితిలో ఉన్నదని అవి రెండు పార్టీలు ఒక్కటే అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి తీవ్ర విమర్శలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రేటెంత్ రెడ్డి అని భాజపా రాష్ట్ర స్పోక్ లీడర్ రాణి రుద్రమాదేవి తీవ్ర విమర్శలు చేసింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన అబద్ధపు మాటల గుంపుమేస్త్రి అని ఎద్దేవా చేశారు.డిసెంబర్ 9 న రైతుల రుణమాఫీ, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని నేడు పార్లమెంట్ ఎన్నికలను అడ్డుపెట్టుకొని మరోసారి కొత్త డ్రామా ఆడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.పదేండ్ల పాలనలో బీఅర్ఎస్ ప్రభుత్వం గ్రామానికో లిక్కర్ పాలసీని తెచ్చారని పేర్కొన్నారు.దేశంలో పేద ప్రజలందనికి ఉచితంగా రేషన్ బియ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్నారని చెప్పారు.రాష్ట్రంలో అమలయ్యే ప్రతీ పథకం కేంద్ర ప్రభుత్వం పథకాలే అని అమే తెలిపారు.కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఇక్కడి భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ గెలవాలని రాణి రద్రమారెడ్డి ప్రజలకు వివరించారు.ఎంపి అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ గత 2014 ఎన్నికల్లో నర్సంపేట నుండి అత్యధిక మెజారిటీ వచ్చిందని అన్నారు.బీఅర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు అన్యాయం చేసిందని ఈ నేపథ్యంలో భాజపా నన్ను గుర్తించి అవకాశం కల్పించిందన్నారు.ఈ జనసభలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మారుతినేని ధర్మారావు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గంట రవికుమార్, నూకల వెంకట నారాయణ రెడ్డి, ముసుకు శ్రీనివాస్ రెడ్డి, వల్లబు వెంకటేశ్వర్లు, సిరికొండ బలరాం, ఎలమంచిలి వెంకటేశ్వర్ రావు, కె.వి రంగా కిరణ్, ఎడ్ల అశోక్ రెడ్డి, రత్నం సతీష్ షా , సతీష్ బాబు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పుల్లారావు యాదవ్, రాచకొండ కొమురయ్య, యాప సీతయ్య, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, డాక్టర్ కంభంపాటి పుల్లారావు, వడ్డేపల్లి నరసింహ రాములు కట్ల రామచందర్ రెడ్డి సింగారపు సతీష్ టి దేవేందర్ రావు రాజేష్ చందుపట్ల సత్యపాల్ రెడ్డి,పి నరోత్తం రెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణవేణి, రేసు శ్రీనివాస్, అజ్మీర శ్రీను, కూనమల్ల పృద్విరాజ్, రామబాబు, శీలం రాంబాబు గౌడ్, వీరన్న, మినుముల రాజు,సందీప్, మనీష్ గౌడ్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాంపల్లి శ్రీను జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ లోకి చేరికలు
#నెక్కొండ, నేటి ధాత్రి: రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ గాలి విస్తుందని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. నెక్కొండ మండలంలోని నాగారం సీనియర్ నాయకుడు నాంపల్లి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాగారం గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ కీ చెందిన 25 కుటుంబాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీటీసీ బిక్షం ,తదితరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి వారీని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానించారు.అలాగే చంద్రుగొండ గ్రామంలో పలు పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. ఈ సందర్భంగా చంద్రుగొండ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలు పందికొక్కుల ప్రజల ఆస్తులు, దోచుకుని తిన్న గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రజలు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఇక ఆ పార్టీ కనుమరుగు కానున్నదని ఆయన జోషించి చెప్పారు భారత రాష్ట్ర సమితిలో చేసిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీసి ప్రజలకు వివరిస్తామని ఎందుకోసం కార్యకర్తలు అందరూ సైనికుల పని చేయాలని ఆయన అన్నారు .కార్యక్రమంలో టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ,మండల పార్టీ ,పట్టణ పార్టీ అధ్యక్షుడు అశోక్, పెండ్యాల హరిప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శివకుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి , రామలింగేశ్వర ఆలయ చైర్మన్ కొమ్మ రెడ్డి సుధాకర్ రెడ్డి , కొల్లి సుబ్బారెడ్డి ,కుసుమ చెన్నకేశవులు , చంద్రుగొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు అనిల్, తమ్మిశెట్టి సాంబయ్య, బక్కి నరేష్, వడ్డే సురేష్, దాసరి సంపత్, తదితరులు పాల్గొన్నారు.
నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని గూనిపర్తి గ్రామ సమీపంలో TS 02UD1582 గల వ్యానులో అక్రమంగా పిడిఎస్ బియ్యమును తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కమలాపూర్ పోలీసులు అట్టి వాహనమును తనిఖీ చేయగా దానిలో 140 క్వింటాల పిడిఎస్ బియ్యం లభించినట్లు కమలాపూర్ సిఐ హరికృష్ణ తెలిపారు. సుమారు ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయల విలువగల పీడీఎస్ బియ్యం అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ ను స్వాధీనపరుచుకునీ కేస్ నమోదు చేసినట్లు తెలిపారు.నడికుడ మండలము చర్లపల్లి గ్రామానికి చెందిన తూర్పాటి ఐలయ్య తో పాటు హుజరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన నగునూరి రాకేష్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ లవకుశ రెడ్డి, పోలీస్ సిబ్బంది సర్వర్ పాషా, కృష్ణమోహన్ పాల్గొనట్లు సిఐ తెలిపారు.
– పాలమూరు బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి
– ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జననేత
– సామాన్యుల కష్టాలు తీర్చే ప్రజా నాయకుడు ‘మన్నె’
– ‘కరోనా’ కోరల నుంచి ప్రజలను కాపాడుకున్న శ్రీనన్న
– ‘మన్నె’ సేవలు.. మహబూబ్‌నగర్‌కు శ్రీరామ రక్ష
– మరోసారి ఆయనకే పట్టం కడుతామంటున్న ఓటర్లు
– కాంగ్రెస్, బీజేపీల మధ్య లోకల్, నాన్‌లోకల్ వార్
– రేవంత్ రాజకీయంపై పాలమూరు నేతల అసహనం
– ఖంగుతింటున్న అధికారపక్షం.. డైలమాలో కమలం
నేటి ధాత్రి, స్టేట్ బ్యూరో:
మహబూబ్‌నగర్ లో ఓ వైపు భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుంటే, మరోవైపు లోక్‌సభ స్థానంలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2009, 2014, 2019 లో వరుసగా ఈ స్థానంలో బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచాయి. 2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక ఈసారి నిరుపేదల నేస్తం.. ‘ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపన్న హస్తం’.. సిట్టింగ్ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డినే బీఆర్ఎస్ మరోసారి రంగంలోకి దింపింది. పాలమూరు సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తుతూ ఐదేండ్ల కాలంలో నియోజకర్గంలో ఎన్నో సమస్యలను పరిష్కరించిన శ్రీనివాస్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కల్వకుర్తికి చెందిన వంశీచంద్‌రెడ్డిని నిలబెట్టి గెలిపించుకోవాలని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ విజయం సాధించి సీఎంకు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
బీసీలే ఈ ఎన్నికల్లో కీలకం..
ఈ నియోజకవర్గంలో 16లక్షల 83వేల మంది ఓటర్లు ఉన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ అందులో మహిళా ఓటర్లే 8లక్షల 50వేల మంది. 35ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య కూడా 40శాతానికి పైగా ఉంటుంది. యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. వలస ఓటర్ల సంఖ్య కూడా లక్షకుపైగా ఉంటుంది. మక్తల్, నారాయణపేట, కొండగల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. వలస ఓటర్లు.. ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతారు. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ముదిరాజులు సహా ఇతర బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం అధికం. అందుకే వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు వారిపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్, జడ్చర్ల- నంద్యాల, జడ్చర్ల- మిర్యాలగూడ రైల్వే లైన్, జాతీయ రహదారులు, పరిశ్రమలు, సైనిక్ స్కూల్, కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, పాలమూరు జిల్లాకు జాతీయ విద్యా సంస్థలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఎస్సీల వర్గీకరణ అంశం కూడా ప్రభావం చూపనుంది.
బీఆర్ఎస్హయాంలో ఆకుపచ్చగా పాలమూరు..
సమైక్య పాలనలో కరువు కాటకాలకు.. వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా మారింది. బీఆర్ఎస్ పాలనలో సాగునీరు అందటంతో.. పడావుబడ్డ పాలమూరు నేల.. పసిడి పంటలతో సస్యశ్యామలమైంది. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అసమర్థత వల్ల వెనుకపడేయబడ్డ పాలమూరు ప్రాంతం.. కేసీఆర్ పరిపాలనలో సుభిక్షంగా మారింది. మహబూబ్‌నగర్ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డ గులాబీ జెండా.. ఈ గడ్డపై మరోసారి ఎగురుతుందని బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. రైల్వే స్టేషన్ల సుందరీకరణ, కొత్త రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన హయంలో సాధించారు. లోక్‌సభలో సుమారు రెండు వందల చర్చల్లో పాల్గొని.. మూడు వందలకు పైగా ప్రశ్నలు సంధించారు. ‘ఎంఎస్ఎన్’ ఫౌండేషన్ ద్వారా కరోనా కష్టకాలంలో, ఇతర సమయాల్లో నిరుపేదలకు అండగా నిలిచారు. ‘మన్నె శ్రీనివాస్ రెడ్డి పాలన.. మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌కు శ్రీరామ రక్షగా క్షేత్ర స్థాయిలో వినబడుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలనే బీఆర్ఎస్ తన ప్రచారాస్త్రాలుగా మలచుకుంటోంది. కేసీఆర్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను చూపుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, ఆరు గ్యారంటీల అమలులో జాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి వలస నాయకులని తాను మాత్రమే స్థానిక అభ్యర్థినంటూ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో క్యాడర్, బలమైన ఓటు బ్యాంకు ఉండటం తమకు లాభాన్ని చేకూర్చుతుందని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో పర్యటించి పార్టీశ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచారు. గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు.
హామీలే.. ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్..
తన సొంత జిల్లా కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు లోక్‌సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఐదుకు పైగా సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి ఇప్పటికే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలమూరు న్యాయ యాత్ర పూర్తి చేశారు. పాలమూరు లోక్‌సభ నియోజకవర్గంపై జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి, వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్, పరిశ్రమల సాధన, ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చడం, ఎస్సీల వర్గీకరణ లాంటి ప్రచారాస్త్రాలను కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. పాలమూరు అభివృద్ధి కావాలంటే మహబూబ్‌నగర్ లో కాంగ్రెస్గెలిపించాలని రేవంత్‌రెడ్డి పదే పదే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సారి గెలిచి తీరాలని జేజమ్మ సంకల్పం
బీజేపీ మాత్రం ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో 70వేలపైగా ఓట్ల తేడాతో మహబూబ్‌నగర్ స్థానాన్ని కోల్పోయింది. ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. డీకే అరుణను బలమైన అభ్యర్థిగా భావించిన బీజేపీ అధిష్ఠానం ఆమెను మరోసారి బరిలోకి దింపింది. మోదీ గ్యారంటీలు, కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధి పనులు, గతంలో పాలమూరు జిల్లాలో తాను చేసిన అభివృద్ధిని డీకే అరుణ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు దీటుగా బదులిస్తూ ముందుకు సాగుతున్నారు. పాలమూరు జిల్లాపై డీకే అరుణకు మంచి పట్టు ఉండటం జనంలో మోడీ చరిష్మా, గెలిస్తే కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉండటం డీకే అరుణకు సానుకూల అంశాలు కానున్నాయి.
కాషాయ పార్టీకి దూరమవుతున్న బీసీ నేతలు
అయితే, సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత ఎదురవుతోంది. ఆ పార్టీ లీడర్ శాంతికుమార్‌కు కాకుండా అరుణకు టికెట్ ఇవ్వడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన లీడర్లు కొందరు పార్టీ వీడారు. మరికొందరు పార్టీలో ఉన్నా పదవులకు రిజైన్ చేశారు. అలాగే పార్టీ సీనియర్ లీడర్ఏపీ జితేందర్‌రెడ్డి, ఆయన వర్గీయులు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. బీసీ లీడర్ శాంతికుమార్ సైలెన్స్ మోడ్‌లో ఉండడం కొంత మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల ఓటర్లు ఉండగా.. ఇందులో 53 శాతం మంది బీసీలే. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ స్టేట్ ట్రెజరర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత శాంతి కుమారి టికెట్ ఆశించారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు హైకమాండ్ టికెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. పార్టీకి రాజీనామా చేయకపోయినా.. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌కు దూరంగా ఉంటున్నారు.
శాంతి కుమార్‌కు టికెట్ రాలేదనే అసంతృప్తితో కొందరు బీసీ లీడర్లు పార్టీలోని తమ పదవుల కు రాజీనామా చేసి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపో యారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్పర్సన్సరిత బరిలో నిలిచారు. మహిళ, బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన చాలా మంది బీసీ లీడర్లు ఆమెకు మద్దతు పలికారు. పలు సర్వేలు కూడా ఆమె విజయం ఖాయమని తేల్చాయి. కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అరుణమ్మ అల్లుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విజయం సాధించారు. అల్లుడి కోసం అరుణ గద్వాలలో పోటీ నుంచి తప్పుకొని బలహీన మైన అభ్యర్థిని బరిలో నిలపడంతో పాటు ఆమె బహిరంగంగానే బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారనే ఆరోపణలు వచ్చాయి. ముక్కోణపు పోటీ జరగకుండా అరుణ కుట్ర పన్నడం వల్లే సరిత ఓడిపోయారనే అభిప్రాయం బీసీ నేతల్లో ఉంది. ఈ రెండు ఘటనలతో అరుణపై బీసీ వ్యతిరేక ముద్ర పడిందని, అందువల్లే ఒక్కొక్క రుగా బీసీ లీడర్లు పార్టీకి దూరమవుతున్నారని తెలుస్తోంది.
బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థల గుర్తులు స్పష్టంగా కనిపించేల ఏర్పాటు
ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి
భూపాలపల్లి నేటిధాత్రి
బాలేట్ యూనిట్లలో ఓటర్లుకు గుర్తులు స్పష్టంగా కనిపించేలా పకడ్బందీగా అమరుస్తున్నట్లు వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ తెలిపారు.
సోమవారం సింగరేణి మినీ ఫంక్షన్ హల్లో కొనసాగుతున్న ఈ వి ఎమ్, వివి ప్యాట్ ల కమిషనింగ్ రెండో రోజు కమిషనింగ్ ప్రక్రియను, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బాలేట్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో 317 పోలింగ్ కేంద్రాలున్నాయని అన్నారు. వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మూడు బాలేట్ యూనిట్లు వినియోగించాయాల్సి ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియకు 1236 బాలెట్ యూనిట్లు, 412 కంట్రోల్ యూనిట్లు, 412 వివి ప్యాట్ లు కమిషనింగ్ ప్రక్రియ పగఢ్భందిగా చేపట్టినట్లు తెలిపారు. కమిషనింగ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టామని, కమిషనింగ్ ప్రక్రియకు 30 సెక్టార్లుగా విభజించి టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 10 టేబుల్స్ పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వివి ప్యాట్లను, కంట్రోల్ యూనిట్లను పోలింగ్ కేంద్రాల వారిగా నంబర్లను వేసి భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కమిషనింగ్ కేంద్రంలో అత్యవసర చికిత్స కేంద్రం, చల్లదనం కొరకు కూలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి భూపాలపల్లిలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోస్టల్ బాలేట్ వినియోగంలో హెల్ప్ లైన్ ఏర్పాటు ద్వారా ఓటరు పరిశీలన చేస్తున్నారని, తదుపరి పోలింగ్ కేంద్రం వారిగా ఓటురు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ మిగిసిన తదుపరి స్ట్రాంగ్ రూములో పటిష్ట భద్రత, వీడియో గ్రఫి మధ్య భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు జరిగిన పోలింగ్ ప్రక్రియను ఎన్నికల పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా మాట్లాడుతూ 8వ తేదీ వరకు పోస్టల్ బాలేట్ వినియోగానికి అవకాశం ఉందని తెలిపారు. 7, 8 తేదీలు అనగా రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నందున పోస్టల్ బ్యాలెట్ పొందిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగానికి సమయం ఉందని అన్నారు. నిర్ణీత పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఓటర్లుకు చివరి నుండి ముందుకు క్రమసంఖ్య వారిగా స్లిప్పులు జారీ చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పర్యవేక్షణకు డిపిఓ నారాయణరావును నోడల్ అధికారిగా నియమించామన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో ఓటరు దృవీకరణ చేయాల్సి ఉన్నందున గెజిటెడ్ అధికారులను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నారాయణరావు, ఆర్డిఓ, సహాయ రిటర్నింగ్ అధికారి మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.
20వేల ఆర్థిక సహాయం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్లపల్లి,ఏప్రిల్ 06 :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన కామారపు శ్రీనివాస్ తల్లి జయమ్మ ఇటీవల మృతి చెందింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవాలనే సంకల్పంతో 2000-2001వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు రూ.20 వేల రూపాయలను జమ చేసి సోమవారం వారం రోజున స్నేహితుడైన కామారపు శ్రీనివాస్ కు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక సహాయం చేసిన వారిలో 2000-2001 బ్యాచ్ కు చెందిన తోటి స్నేహితులు గాజుల ప్రతాప్ గౌడ్, మచ్చ శ్రీధర్, గాజుల కుమారస్వామి, అనుముల ధనలక్ష్మి, పిన్నింటి రజిత, జ్యోతిరాణి, దేశిని శ్రీలత, వసంతలు ఉన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల ఎనిగల్ గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ని చేసుకుందామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో గ్రామిణ ఉపాది కూలిల దగ్గర ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా అసెంబ్లీ కన్వినర్ మార్త సత్తయ్య కర్ణాటక నుండి వచ్చిన వేములవాడ ఇంచార్జి గారు బీజేవైఎం ప్రెసిడెంట్ మొగిలి విజయేందర్ భూత్ అధ్యక్షుడు k లింగారావు సీనియర్ నాయకులు, బోరుగామ కమలాకర్, పడమటి మల్లేశం, పకిడి మల్లేశం, కాతుబంధ సురేష్ కుసుంబ కిష్టస్వామి, బోరుగామ నితీష్ , భంటుకిరణ్,
గణపురం మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్లో నిర్వహించబడుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోచ్ మామిడిశెట్టి రవీందర్ సీనియర్ క్రీడాకారులు అశోక్,వెంకన్న ,సారంగపాణి, శ్రీనివాస్, కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. చిర్రా రఘు మాట్లాడుతూ క్యాంప్ నిర్వాహకులకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సూచించారు. సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఆటగాడు విడదని అశోక్ ఐదు బ్యాట్లు వేముల పెళ్లి సాంబయ్య ఒక డజన్ బాల్స్ ఆటగాళ్లకు క్రీడా సామాగ్రి అందజేశారు
తంగళ్ళపల్లి మండలం బదనపల్లి గ్రామానికి చెందిన ఆసాని వెంకట్ రెడ్డి చెందిన పశు గ్రాసం దగ్ధమైందని తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం తనకున్న న.4 ఎకరాలలోనీ పొలంలో గడ్డి కట్టలు కట్టిన పశు గ్రాసం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరంలో కూడా ఇలాగే జరిగిందని దానితో పశుగ్రాసం పూర్తిగా దగ్గరుందని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని వెంటనే అధికారులు స్పందించి కొంత జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని తెలియజేశారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.