కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ చేరికలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టోనీ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై పార్టీ చేసే అభివృద్ధి పనులకై వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకై ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఇంతకుముందు ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ ఇప్పటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ఇందిరమ్మ కాలనీకి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఇల్లు లేనినిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానీదిఅలాగే ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఈ ఎస్ ఐ హాస్పిటల్ కేంద్ర విశ్వవిద్యాలయం కస్తూర్బా గాంధీ పాఠశాల మోడల్ స్కూల్ తో పాటు అనేక అభివృద్ధి నిధులు తెచ్చి ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి పథంలో ముందు ఉంచారని అభివృద్ధి లోఅనేక నిధులు కేటాయించారనిఅలాంటి అభివృద్ధి పనులు చేసిన ఏకైక వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేశారని అలాంటి అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇందిరమ్మ కాలనీలో అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరారని దీనికి అంతటికి కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టోనీ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు నాయకులు కార్యకర్తలు మహిళ నాయకులు పార్టీ కార్యకర్తలు ఇట్టి చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు

మానుకోట గడ్డ కాంగ్రెస్ అడ్డా

ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరిస్తున్న కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి…

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు గొల్లగూడెం చొప్పాలా తుమ్మలగూడెం గ్రామపంచాయతీలలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

ఈ కార్యక్రమంలో
మండల నాయకులు ఎర్ర సురేష్ , సిపిఎం మండలం కార్యదర్శి కొమరం కాంతారావు , తోలెం అప్పారావు అంబోజు నరేష్ నాయకులు కార్యకర్తలు యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు..

అనుమతి లేని మేధా(వి)జూనియర్ కళాశాల బ్రాంచ్ లను సీజ్ చేయాలి

ఏ.ఐ.ఎస్.బి డిమాండ్

డి .ఐ. ఈ. ఓ కార్యాలయ సూపరిండెంట్ కి వినతి

హన్మకొండ, నేటిధాత్రి:

హన్మకొండ జిల్లా పరిధిలో అనధికారికంగా నడుస్తున్న మేధా (వి) ప్రవేట్ జూనియర్ కళాశాల అదనపు బ్రాంచ్ లను మూసివేయాలని యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హనుమకొండ జిల్లా డిఐఈఓ కార్యాలయ సూపరిండెంట్ చంద్రమౌళి కి ఏ.ఐఎస్.బి జిల్లా నాయకులు ఏం మోహన్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ జిల్లా పరిధిలో యూనివర్సిటీ క్రాస్ వద్ద ఉన్న కందగట్ల కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మేధావి జూనియర్ కళాశాలకు ఈ బ్రాంచ్ కు మాత్రమే పర్మిషన్ ఉండగా అదనంగా మరో రెండు బ్రాంచ్లను అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తూ ఇటు ప్రభుత్వానికి అటు విద్యార్థులకు మోసం చేస్తూ పరిమితికి మించినా అడ్మిషన్లు చేస్తున్నారు కావున జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే మేధావి కళాశాలకు సంబంధించిన అనుమతి లేని బ్రాంచ్లను మూసివేయాలని వారు వినతిపత్రంలో కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని వారు హెచ్చరించారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా నాయకులు సురేందర్ ఉదయ్ రాజు తదితరులు ఉన్నారు.

అకాల వర్షనికి నేల కోరిగిన పంట పొలాలు

తడాసి ముద్ద అయిన వరి ధాన్యం రాసులు

రైతులకు తప్పని తిప్పలు

ప్రభుత్వం అదుకోవాలని కొరుతున్న రైతులు

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో గాలి వాన తో కూడిన అకాల వడ గాలుల వర్షం భారీగా కురిసింది. మంగళవారం మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు ఏకధాటిగా కురవడంతో గాలి తీవ్రతకు రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు విరిగి పడడంతో పాటు సాగు చేస్తున్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వరి పంట చేతికి అందే సమయంలో వర్షం కారణంగా పంట పొలాల్లో వరి పంట నేలకు ఒరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం రాశులు కుప్పలు పూర్తిగా తడిసి పోవడంతో రైతులు ఏమి తోచని పరిస్థితుల్లో తీవ్రంగా రోదిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి పంట ఫలితం చేతికందే సమయంలో ప్రకృతి సృష్టించిన విపత్తుతో పూర్తిగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

చిన్మయానందస్వామి 108వ జయంతి వేడుకలు

సిరిసిల్ల, మే – 8(నేటి ధాత్రి):
బుధవారం సిరిసిల్లలోని బి.వై నగర్ హనుమాన్ దేవాలయంలో చిన్మయమిషన్ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్మయానందస్వామి 108వ జయంతిని పురస్కరించుకొని పూజ కార్యక్రమం జరిపారు. భగవత్గీత పఠనం, అష్టోత్తర శతనియామవాలి తదితర అంశాలు నిర్వహించారు.
ఇందులో చిన్మయమిషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సజ్జనం శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్మయమిషన్ సంస్థను పూజ్యశ్రీ చిన్మయానంద స్వామి స్థాపించి వందల మంది స్వాములు, ఆచార్యులను తయారు చేశారాని అన్నారు. వీరంతా వివిధ ప్రదేశాలలో జ్ఞానయజ్ఞాలను ఏర్పాటు చేసి భగవత్గీత మొదలగు ఆధ్యాత్మిక గ్రంధాలపై ప్రవచనాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ రోజు స్వామి 108వ జయంతిని ఘనంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో కోడం నారాయణ, జనపాల శంకరయ్య, గజ్జెల్లి రాంచంద్రం, మెరుగు మల్లేశం, కమలాకర్, మహేందర్ పూజారి, సృజన, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు -ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు/గంగాధర, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కొండన్నపల్లి, కురిక్యాల, ఉప్పర మల్యాల, రంగారావుపల్లి, తాడిజెర్రి, ఆచంపల్లి, చిన్న ఆచంపల్లి, గట్టుభూత్కుర్, హిమ్మత్ నగర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ పదిఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, తెలంగాణ రాష్ట్రంలో పదిఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కట్టి ఇవ్వలేదని, కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వలేదని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని, ప్రజాపాలన పేరుతో గ్రామాలల్లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, జూన్ మాసం నుండి గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలను గ్రామసభల ద్వారా ఎంపిక చేసి వారికి కొత్త ఇండ్లను కట్టిస్తామని, ఆగస్టు15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని, మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఐదువందల రూ.లకే సిలిండర్, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందజేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కులం మతాల పేరుతో ప్రజలను యువతను రెచ్చగొట్టడం తప్ప, పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, స్థానికులు సౌమ్యులైన వెలిచాల రాజేందర్ రావును గెలిపించుకుంటే ఈప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రజల మధ్యనే ఉంటూ, చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి పుల్కం అనురాధ నర్సయ్య, కురిక్యాల సింగల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, ఎంపీటీసీ ముద్దం జమున నగేష్, మాజీ సర్పంచులు రేండ్ల జమున శ్రీనివాస్, రోమాల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట సంధ్య, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మంత్రి లత, కర్ర విద్యాసాగర్ రెడ్డి, జాగిరపు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన న్యాయవాది నందకిషోర్ గుప్తకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో 33 వ వార్డు వల్లబ్ నగర్ కు చెందిన సీనియర్ న్యాయవాది నోటరీ నంద కిషోర్ గుప్తా గుండెపోటుతో ఆకస్మికంగా ఆకస్మికంగా మృతి చెందారు . ఈ విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. మృతదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు . ఎమ్మెల్యే వెంట 33 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగాయల రవి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీ ర్ల చందర్ లక్కాకుల సతీష్ తదితరులు ఉన్నారు

మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు 400 మందికి టిఫిన్లు ఏర్పాటు

మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి

వీణవంక,( కరీంనగర్ జిల్లా).

నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు ఓటు వేసి గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి ఉపాధి హామీకూలీల వద్ద కు వెళ్లి 400 మందికి టిఫిన్ ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీ లకు 4 పథకాలను అమలు పరిచిన విధానని కూలీల కు వివరించి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేంద్రం లో అమలు చేయబోయే గ్యారంటీ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నల్ల కొండల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, దూలం సమ్మయ్య, పల్లెర్ల కిరణ్, నిమ్మల సమ్మయ్య,జగన్ రెడ్డి, మోహన్ రెడ్డి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి ధాత్రి

పదేళ్లు ఎంపీలుగా ఉన్న ఇద్దరూ నియోజకవర్గానికి తగ్గడు మట్టి కూడా తేలేకపోయారు,ఎన్నికల్లో వారి ఇద్దరికీ గోరపరాభావం తప్పదు.

పదేళ్లు నియోజకవర్గనీ అభివృద్ధి చేయకుండా మాయమాటలకు మోసపోయిన ప్రజలు, అభివృద్ధి చేయగల సత్త ఉన్న నాయకుడు బలరాం నాయక్ కె పట్టం కడతారు.

మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణం పురవీధుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ ప్రచారంలో టీజేఏసీ నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు పాల్గొని జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

ప్రచారంలో భాగంగా బోగాల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం ఈ విధంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చి తీరుతుందని,గత తెలంగాణ పాలకులు ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశారని, బూటకపు హామీల్లో భాగంగా భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు అనేక మాయ మాటలతో,అబద్ధపు హామీలతో ఇక్కడ ప్రజలను పచ్చిగా మోసం చేశారని.

పదేళ్ల కాలంలో ఇక్కడి ప్రాంతానికి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు సీతారాం నాయక్, మాలోత్ కవిత ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేయలేకపోగా, కెసిఆర్ ఇచ్చిన అబద్ధపు హామీలకు ఆయన భజన చేస్తూ కాలాన్ని వెళ్లబుచ్చి భద్రాచలం నియోజకవర్గనీ అభివృద్ధికి నోచుకోకుండా చేశారు, అలాంటి చేతగాని నాయకులు మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు అవసరం లేదని ఆయన అన్నారు.

అభివృద్ధికి కేంద్ర బిందువు అయినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ భద్రాచల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు గుర్తున్నాయని, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న టైంలోనే భద్రాచలం నియోజకవర్గం లో అభివృద్ధి అనేది పరుగులు పెట్టిందని, మరలా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా బలరాం నాయక్ గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఈనెల 13వ తారీకు జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఎన్నికల గుర్తు హస్తం. ఈవీఎం బాక్స్ నందు నాలుగో నెంబర్ లో ఉన్న హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరామయ్య ని అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించాలని ఆయన కోరూతు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ ఎన్నికల ప్రచారంలో.

TJAC నాయకులు తిప్పన సిద్దులు , తాండ్ర నరసింహారావు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము, ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, షాబీర్ పాషా, అన్నేం రామిరెడ్డి,మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి,కట్టా కళ్యాణి,పద్మప్రియ,రూపా దేవి, టీజేఏసీ, ఏన్.ఎస్.యు.ఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కమలాపూర్ మాజీ ఉపసర్పంచ్ మౌటం రమేష్ కాంగ్రెస్ లో చేరిక

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)

కమలాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ మౌటం రమేష్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు.టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు లేదని ఇక భవిష్యత్తు లేని పార్టీలో కొనసాగడం కన్నా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మౌటం రమేష్ తెలిపారు. ముదిరాజ్ సంఘం నాయకులు మౌటం రవి, మౌటం పోచెంధర్, కమలాపూర్ ఏకలవ్య సంఘం అధ్యక్షులు దేవరాజు రమేష్, దేవరాజు కుమారస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు,నాయకులు తవుటం రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, చరణ్ పటేల్,దేశిని ఐలయ్య గౌడ్,నాంపల్లి ప్రభాకర్,బొల్లం రాజిరెడ్డి, పుల్లూరి శ్రీనివాసరావు, విష్ణుదాసు వంశీధర్ రావు, పోడేటి బిక్షపతి, జనగాని శివకృష్ణ,ఆన్ కార్ అశోక్, పెరుమాండ్ల పరుశరాములు, ఆడపు శ్రీకాంత్, వైనాల సుభాష్, గొట్టే రవి తదితరులు పాల్గొన్నారు.

కారు గుర్తుపై ఓటు వేసి వినోద్ కుమార్ ని గెలిపించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండి జగన్ జగత్ మాజీ వార్డు సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నరేంద్ర మోడీ బహిరంగ సభకు బయలుదేరిన బిజెపి శ్రేణులు.

చిట్యాల, నేటిధాత్రి :

బిజెపి వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ కి మద్దతుగా బుధవారం రోజున జరిగే సభ కు చిట్యాల మండలం నుండి వందలాది బిజెపి కార్యకర్తలు సభకు తరలి వెళ్లడం జరిగింది. దానిలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ జెండా ఊపి వాహన శ్రేణనీ ప్రారంభించడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక వర్గాల ప్రజలు బిజెపి వైపు ఉన్నారని మరొకసారి మూడోసారి నరేంద్ర మోడీ ని గెలిపించాలని ప్రజలు వస్తున్నారని ఎందుకంటే ఆయన చేసినటువంటి దేశాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి విరామం లేకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే విధంగా అదే లక్ష్యంతోని పని చేసినటువంటి నరేంద్ర మోడీగారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మద్దతు తెలిపి ఆరూరి రమేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు,
ఈ కార్యక్రమంలో జిల్లా మండలం శక్తి కేంద్రా ఇన్చార్జిలు సీనియర్ కార్యకర్తలు గుండ సురేష్, పంచిక మహేష్ ,శ్రీకాంత్ సూర శ్రీకాంత్ బుర్రీ తిరుపతి, వెంకన్న, సంఘ రఘుపతి ప్రభాకర్ తదితరు కార్యకర్తలు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని టిఆర్ఎస్ ఇంటింటా ప్రచారం

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో 18 వ వార్డులో రిటైర్డ్ ఐపీఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని వనపర్తి జిల్లా కేంద్రంలో నల్లచెరువు తాళ్లచెరువు రోడ్ల విస్తరణ కలెక్టర్ కార్యాలయం ఎస్పీ కార్యాలయం మిషన్ భగీరథ నీళ్లు గణపురం చెరువులు నింపడం ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం మెడికల్ కాలేజ్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ రోడ్డులో ప్రభుత్వ ప్రసూతి చిల్డ్రన్ హాస్పిటల్ ఏకో పార్కు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీకృత మార్కెట్ యార్డ్ పాల కేంద్రం దగ్గర వేస్టేజ్ మార్కెట్ సిసి రోడ్లు డ్రైనేజీ ల నిర్మాణం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు . భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసేది ఉన్నదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో నిధులు తెచ్చి పెండింగ్ లో ఉన్న రైల్వే స్టేషన్ వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ పనులకు కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ద్వారపోగు వెంకటే ష్ ద్వారపోగు మదిలేటి ద్వార పోగు నరసింహ అడ్డాకుల రాములు గొర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు

పిడుగుపాటుకు కాడేద్దు మృతి

-రూ. 55 వేల నష్టం

-బోరున విలపిస్తున్న రైతు

-రైతుకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామానికి చెందిన గంట రమణారెడ్డికి చెందిన కాడేద్దు సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు గురై మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గంట రమణారెడ్డి అనే రైతు సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం కాడేద్దును తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఇంతలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సంబంధించింది. దీంతో పిడుగుపాటుకు గురైన కాడేద్దు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ రైతుకు రూ.55 వేల నష్టం వాటిల్లడంతో బోరున విలపించాడు. అక్కడే ఉన్న తాజా మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి, ఆ రైతును ఓదార్చారు. ప్రభుత్వ స్పందించి కాడేద్దు మృతితో రూ.55 వేలను నష్టపోయిన ఆ రైతుకు ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరు సర్కిల్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ తన విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నో పదవులు అనుభవించి తను ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ఎన్నో ఉద్యమాలు చేశారని ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు మన పొన్నం ప్రభాకర్ అన్నఅని అలాంటి ఉద్యమ నాయకుడు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని భవిష్యత్తులో ఎన్నో కీలక పదవులు అనుభవించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మహిళ నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరిక లు

నిజాంపేట ,నేటి ధాత్రి,మే 8

నిజాంపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచులు కొమ్మట సత్యనారాయణ,చిన్న పైడి శ్రీనివాస్ రెడ్డి, తోపాటు సుమారు 40 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి మైనంపల్లి రోహిత్ రావుతో సాధ్యమని కాంగ్రెస్ లో చేరమన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు.

అంకుసాపూర్ గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి వెలిచలా రాజేందర్రావును చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ బూత్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సీనియర్ న్యాయవాది నోటరీ నందకిషోర్ గుప్తా ఆకస్మిక మృతి

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది నోటరీ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలిసింది ,వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు న్యాయవాది అయిత కృష్ణ మోహన్ మృతుని కుటుంబాన్ని సందర్శించి నివాళులు అర్పించారు . నోటరీ న్యాయవాది నందకిషోర్ గుప్తా ఆకస్మిక మరణం పై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

పాత బస్తీలో మాధవీలత హవా!

– లేడీ సింగం ప్రచార హోరులో అసదుద్దీన్​ ఉక్కిరి బిక్కిరి
– ఎంఐఎం కోటను గెలిచే దిశగా కాషాయ పార్టీ అడుగులు


– సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారంలో ఫుల్ ​బిజీ
– బలమైన ప్రత్యర్థిని ఢీకొడుతూ బాణంలా దూసుకెళ్తూ..


– అసదుద్దీన్ ఓవైసీ ​ఆటలు సాగనివ్వబోనని వార్నింగ్​
– బెదిరింపులు, రిగ్గింగ్ చేస్తే ఖబర్దార్​ అంటూ హెచ్చరిక
– హిందూ, ముస్లిం ఓటర్లు ధైర్యంగా ఓటేయాలని పిలుపు

నేటిధాత్రి, స్టేట్​ బ్యూరో:
ఎంపీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుతున్న తరుణంలో హైదరాబాద్​సెగ్మెంట్​లో బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తుండుగా.. మరోవైపు హైదరాబాద్​ఎంపీ అభ్యర్థి మాధవీలత వినూత్న రీతిలో దూసుకుపోతున్నారు. ప్రచార సరళిని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూ తనదైన శైలిలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్​ఓడించే దిశగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగు దశాబ్ధాలుగా ఎంఐఎం ఆగడాలను, అభివృద్ధికి వెనుకబడడానికి గల కారణాలను పాతబస్తీ ప్రజలకు పూసగుచ్చినట్లు వివరిస్తూ ముందుకు సాగిపోతున్నారు. దీంంతో ఎంఐఎం అడ్డాలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మాధవీలత స్థానిక బీజేపీ నేతలు, మహిళా నాయకులతో పాతబస్తీ ముస్లిం, హిందూ మహిళలను ఏకం చేస్తూ..లేడీ సింగంలా దూసుకెళ్తుండగా.. అగ్నికి ఆయువు తోడైనట్లు ఆమెకు మద్దతుగా కాషాయదండు రోజు రోజుకు జోరు పెంచుతోంది. బీజేపీ అగ్రనేత, రాష్ట్ర మాజీ గవర్నర్​తమిళిసై సౌందర రాజన్ కూడా ఇటీవల ​ప్రచారం చేశారు. హైదరాబాద్ లోక్​సభ​పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు బహదూర్​పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్​, గోషామహాల్, కార్వాన్​, మలక్​పేట , యాకత్​పురాలో ఇప్పటికే కలియ తిరిగిన మాధవీలత చివరి రెండు రోజులు మరోసారి చుట్టేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, పాతబస్తీలో అసదుద్దీన్​ఓవైసీ అసత్య ప్రచారాలతో ముస్లీం ప్రజలను మభ్యపెడుతున్న విధానాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టనున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలిసారిగా అవకాశం లభించిన మాధవీలత ఎంపీగా గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తమకు పోటీగా బలమైన ప్రత్యర్థి ఉన్నా.. కదనరంగంలో వీరనారిగా వారిని ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని చర్చ జోరుగా సాగుతోంది. సాదా సీదాగా షురూ చూసి.. ప్రత్యర్థులపై పదునైన బాణాలు సందిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్న మాధవీలతను గమనిస్తున్న వాళ్లు ఆమెను లేడీ సింగంలా పేర్కొంటున్నారు. అలాగే మాధవీలతను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్​షా కూడా ప్రశంసించారు. ఎలాగైనా పాతబస్తీపై కాషాయ జెండా ఎగరేయాలని పార్టీ అగ్ర నేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. ఓ వైపు ఎండల ధాటిని తట్టుకుని కార్యక్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 29న నామినేషన్ల విత్​డ్రా ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రచారం జోరందుకోనుంది.

ముస్లిం మహిళలనూ ఆకట్టుకుంటూ..
హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడే మాధవీలత.. తనదైన శైలిలో ముస్లిం మహిళలను కూడా ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితులైన మాధవీలత బీజేపీలో చేరి కొంత కాలమే అయినా.. ఎంతో సీనియర్​నాయకులైన కూడా మెప్పిస్తూ దూసుకెళ్తున్నారు. పాతబస్తీలో నిత్యం ఆధ్యాత్మిక కార్యకమ్రాలు నిర్వహిస్తుండడంతోపాటు స్థానిక హిందూ, ముస్లింలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. అయితే తాజా ఎన్నికల్లో ఆర్థిక, అంగ బలం కలిగిన మాధవీలతను బరిలోకి దింపిన హైకమాండ్​హైదరాబాద్‌ సీటును కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఓల్డ్ సిటీలో ఈసారి రిగ్గింగ్ చేయనివ్వం
ఎంఐఎంపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మండిపడ్డారు. మతాన్ని రెచ్చగొడుతున్నది తాము కాదని, అసదుద్దీన్ ఓవైసీ అని ఆమె ఎదురుదాడి చేశారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అద్భుతమైన విజయం సాధిస్తుందని మాధవీలత దీమా వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ చేయనివ్వమని స్పష్టం చేశారు. ‘ముస్లిం, హిందూ సోదరులందరూ ధైర్యంగా ఓటేయండి’ అని పిలుపునిచ్చారు. పాతబస్తీలో వెదవ వేషాలు వేసే వారికి తగిన శాస్తి చేస్తామని మాధవీలత వార్నింగ్ ఇచ్చారు. ఎంఐఎంకు ముందుంది ముసుళ్ల పండుగ అని అన్నారు. ‘‘ లేని బాణాలను మసీదుపై వేసింది ఎవరు? ఇంతకు బాణాలు వేసింది ఎవరు? ఓవైసీ చూశారా..? ప్రేమ, అభిమానం, సాహసం, విజయం.. అన్నీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీపై విమర్శలు చేస్తున్న వారందరూ పని పాట లేనివారే. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు హిందూ దేవుళ్లను తిట్టిన వారే విమర్శలు చేస్తున్నారు. పురోహితులతో కండువాలు వేయించుకుంటున్నారు” అని మండిపడ్డారు మాధవీలత.

చేవెళ్ల పార్లమెంట్​లో హోరా హోరీ

– ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ దళం
– ‘కాసాని’కి మద్దతుగా కదం తొక్కుతున్న పార్టీ శ్రేణులు
– బిజినెస్ చేసే రెడ్డిలు కాదు.. సేవ చేసే బీసీ కే జైకొడుతున్న జనం
– గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేస్తున్న చేవెళ్ల చెల్లమ్మ సబితమ్మ
– సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ ‘కాసాని’ కుమారుడు వీరేశ్ ధీమా
– తన తండ్రి జ్ఞానేశ్వర్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని వెల్లడి

నేటి ధాత్రి, స్టేట్​ బ్యూరో:
చేవెళ్ల ఎంపీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అనేలా సాగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్​అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి, కాంగ్రెస్​అభ్యర్థి రంజిత్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ముగ్గురి మధ్య ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న దానిపై అంచనా వేయలేకపోతున్నారు. ఆది నుంచి చేవెళ్ల పార్లమెంట్​సెగ్మెంట్ సంచలన రాజకీయాలకు కేరాప్​అడ్రస్. ఈ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పరిగి, తాండూర్‌, వికారాబాద్‌ పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు. చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్​తో పోలిస్తే.. వెనుకబడిన ప్రాంతాలు. ముఖ్యంగా తాండూర్‌, పరిగిపై పక్క రాష్ట్ర కర్ణాటక ఇన్​ఫ్లుయెన్స్​ఉంటుంది. చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాలు వీటికంటే కొంత వరకు అభివృద్ధి చెందిన సెగ్మెంట్లు. రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి అయితే.. ఆర్థికంగా బలంగా ఉన్న అర్బన్​ప్రాంతాలు. అంతేకాకుండా హైదరాబాద్‌ కు బార్డర్​ఏరియాలు కావడంతో రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి లో విభిన్న మతాలకు చెందిన వారు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. హిందూ ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ. ఈ విభిన్నమైన నియోజకవర్గంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను ఎన్నికల కదనరంగంలో నిలిపాయి. 7 నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు బీఆర్ఎస్​అభ్యర్థులు గెలవగా, మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​అభ్యర్థులు గెలుపొందారు. మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి కారు పార్టీ గెలుపొందింది. ఇలా ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్​మధ్యే పోటీ ఉంటుందని స్థానిక సమీకరణాలు చూస్తే అర్థమవుతోంది.

‘బీఆర్ఎస్​పార్టీ ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధనలో తమ పార్టీ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్ల పాలన సాగించి దేశానికే తెలంగాణకు రోల్​మోడల్​గా తీర్చిదిద్దింది. గెలుపు మాదే’ అని బీఆర్ఎస్​చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్​ముదిరాజ్ చెప్తుండగా, ఆరు గ్యారంటీల హామీతో బీఆర్ఎస్​ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తోందని, తమదే విజయమని కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. మోడీ చరిష్మాతో తనదే విజయమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటున్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత కాసాని జ్ఞానేశ్వర్​
చేవెళ్ల బీఆర్ఎస్​ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్​సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్​రాజకీయ నాయకుడు. కాసాని ఏ పార్టీలో ఉన్నా.. బీసీ బడుగు బలహీన వర్గాల వాయిస్​ను వినిపించే గొంతుక. ముఖ్యంగా బడుగులకు న్యాయం జరగాలంటే అది బీఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమని నమ్మి పార్టీలో చేరిన వ్యక్తి. చేవెళ్ల నియోజకవర్గంలో స్థానికుడిగా ఆయన ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. ఓ పక్క రాజకీయ అండదండలు, జ్ఞానేశ్వర్​చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గెలుపునకు మెట్లుగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం ఇక్కడి ప్రజలతో మమేకపై ఉన్నారు.

సొంత భూములను దానం చేసిన వ్యక్తి ‘కాసాని’
అంతేకాకుండా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందికి తన సొంత భూములను కూడా దానం చేసిన ఉదార స్వభావం గల వ్యక్తిగా కాసాని జ్ఞానేశ్వర్​కు పేరుంది. నిరుపేదలంటే ఆయనకు ప్రాణం .. వారికి ఏదో రకంగా సేవ చేయాలన్నదే ఆయన అభిమతం. గతంలో కూడా రంగారెడ్డి జడ్పీ చైర్మన్​గా సంయుక్త ఆంధ్రప్రదేశ్​రాష్ట్రంలో ఎమ్మెల్సీగా సేవలందించారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. టీడీపీలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ లో తనదైన దూకుడు ప్రదర్శించి గెలుస్తాడని నమ్మకంతోనే బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ఆయనకు టికెట్‌ కేటాయించారు. ప్రజల మనిషి అయిన కాసాని జ్ఞానేశ్వర్‌ ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపిస్తారని ఆయన కుమారుడు వీరేశ్​ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్​మహేశ్వరం ఎమ్మెల్యే చేవెళ్ల చెల్లమ్మగా పిలిచే సబితా ఇంద్రారెడ్డి కూడా జ్ఞానేశ్వర్​కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆమెతో పాటు బీఆర్ఎస్​శ్రేణులు కూడా క్షేత్ర స్థాయిలో చెమటోడుస్తున్నారు. దీంతో జ్ఞానేశ్వర్​గెలుపు ఖాయమని సబితమ్మ దీమా వ్యక్తం చేస్తున్నారు.

తండ్రికి కుడి భుజంగా కుమారుడు వీరేశ్​
కాసాని జ్ఞానేశ్వర్​కు కుమారుడు వీరేశ్ అన్నీ తానై వ్యవహరిస్తారు. తండ్రి చూపే దారిలో పేదలకు స్వచ్ఛందంగా సేవ చేస్తూ.. ఎంతోమంది నిరుపేదలకు అప్పన్న హస్తాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా యూత్‌ లో మంచి పట్టున్న నాయకుడు కూడా. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, నియోజకవర్గాల్లో యూత్‌ ఫాలోయింగ్‌ లో కాసాని వీరేశ్​దిట్ట అని చెప్పొచ్చు. చేవెళ్ల లో ఎక్కువ శాతం బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని వారు తప్పకుండా తమను, బీఆర్ఎస్​పార్టీని గెలిపిస్తారని వీరేశ్​దీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్లలో బీఆర్ఎస్​కు దీటుగా బరిలో నిలిచిన ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నాయకులను ఓడించి తీరుతామని ఆయన శపథం చేస్తున్నారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నాయకులతో పోరాటం మామూలు విషయం కాదని, అయినా సరే వెనుకడుగు వేయకుండా సాగుతున్నామన్నారు. బీఆర్ఎస్​పార్టీ గెలుపొంది తీరుతుందని వీరేశ్​దీమా వ్యక్తం చేస్తున్నారు.

కొండా విశ్వేశ్వర్​రెడ్డికి సాఫ్ట్​కార్నర్​
కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్వతహాగా మంచి వ్యక్తిత్వం గల నాయకుడు. ముక్కుసూటి మనిషి. న్యాయం వైపు నిలబడే వ్యక్తి తన సొంత జిల్లా ప్రజలకు ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన గొప్ప సంపన్నుడు. ఆయనకు రాజకీయాల అవసరం కూడా లేదు. ఉన్నత విద్యావంతుడు. విదేశాల్లోనే ఎన్నో ప్రశంసలు అందుకున్న వ్యక్తి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి. ఆయనను బీజేపీ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో ఆయన ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లోకి వెళ్లిన రంజిత్​రెడ్డి
ఒకరకంగా చెప్పాలంటే పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్‌ రెడ్డి పై సొంత పార్టీ నేతలే అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఇదే కాకుండా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్​ పార్టీలో ఎంపీగా కొనసాగుతూ బీఆర్ఎస్​అధికారం కోల్పోగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరి టికెట్‌ పొందడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇవే కాకుండా ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు భూ బకాసురుడు అనే ముద్ర కూడా వేస్తున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక పౌల్ట్రీ వ్యాపారి అయినా రంజిత్‌ రెడ్డి వ్యాపార పరంగా అప్పట్లో బీఆర్ఎస్​లో ఉన్న ఈటల రాజేందర్‌ తో ఉన్న సన్నితం మేరకు టిఆర్‌ఎస్‌ లో చేరాడని చేవెళ్ల ఎంపీ టిక్కెట్‌ కోసం అప్పట్లోనే కోట్ల రూపాయలు పార్టీకి ఇచ్చాడని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కొక్క విధంగా ఉంది. మరి చేవెళ్ల ప్రజలు ఎవరికి పట్టం కడ్తారో చూడాలి.

error: Content is protected !!
Exit mobile version