రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణంలోని వివిధ వార్డులలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారాలు నిర్వహించారు. మునిసిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మూడవ వార్డు ఇందిరానగర్, 19వ వార్డు శ్రీనివాస్ నగర్ ఏరియాలలో సైతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు హాజరయ్యారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని,హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, కౌన్సిలర్లు బింగి శివాని శివకిరణ్, కొక్కుల స్రవంతి సతీష్, మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, గంగారపు సత్యపాల్, జంగపల్లి మల్లయ్య, యూత్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.