– వెలిచాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలి
– వెలిచాల రాజేందర్ రావు సోదరి రోహిణి
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 7(నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు మార్కండేయ వీధిలో వెలిచాల రాజేందర్ రావు సోదరీమని రోహిణి తో కలిసి పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేపట్టారు. మరోవైపు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో నేటి ఉదయం వాకర్స్ తో పాటు కూరగాయల క్రయ విక్రయదారులతో ప్రచారం చేపట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, వెలిచాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, యేల్లె లక్ష్మీనారాయణ,కాముని వనిత, కల్లూరి చందన, మ్యాన ప్రసాద్, గోలి వెంకటరమణ, నీలి రవీందర్, సామల పావని దేవదాసు, మడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
