బంజారా ప్రజలు హస్తం గూటికే మొగ్గు..

కాకర్జలా తండాలో బి ఆర్ ఎస్, బీజేపీ పార్టీలనుండి భారీగా చేరికలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశిచంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా బంజార ప్రజల ఆపద్బాంధవుడు జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి జనంపల్లి ఆదేశాను మేరకు మహబూబ్ నగర్ జిల్లా మాజీ డీసీసీ అధికార ప్రతినిధి, జనంపల్లి దుష్యంత్ రెడ్డి,నవాబుపేట మండలంలోని తండాలలో ఎంపి ఎన్నికల ప్రచారము నిర్వహించారు. నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీరటి రామచంద్రయ్య అధ్వర్యంలో మండలంలోని మెట్టుగడ్డ తండాలో ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీల కార్డును ప్రజలకు వివరిస్తూ యువ న్యాయం,నారీ న్యాయం,రైతు న్యాయం,శ్రామిక న్యాయం,సామాజిక న్యాయం అను అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.తండాలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రజా సమ్మేళన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తండావాసులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం చేస్తానని అన్నారు.పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశిచంద్ రెడ్డి ని భారి మెజారిీతో గెలిపించి సోనియా గాంధీ కి బహుమతిగా ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గానికి 1000 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తారని హామీ ఇచ్చారని ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి స్పోక్ పర్సన్ జహీర్ అక్తర్,జిల్లా డిసిసి జనరల్ సెక్రటరీ బంగ్లా రవి,జిల్లా ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ నీల్య నాయక్,కొల్లూరు ఎంపిటిసి తులసి రామ్ నాయక్ ,కామారం ఎంపిటిసి భాగ్య నరసింహులు,మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్,ఓబీసీ సెల్ అధ్యక్షులు బంక మల్లేష్ యాదవ్,నవాబుపేట యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ&మండల ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్. ప్రేమ్ కుమార్ నాయక్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ నరేందర్,జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ ఠాగ్రు నాయక్,కోలగుట్ట తండా తులసి రామ్ నాయక్,యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రకాష్ నాయక్,సత్యనారాయణ,టౌన్ ప్రెసిడెంట్ తిరుపయ్యా,పి. మాన్య నాయక్, వెంకటేశ్వర తండా ఉప సర్పంచ్ భగవాన్ నాయక్,ఫుల్యా నాయక్, ఎం.లక్ష్మణ్, ఎం.సంతోష్,గజ్జ శంకర్, వినోద్ బాబా,బాదావత్ అరుణ్, అంగూర్,ఎండి ఉమర్,
తండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్, ఉపేందర్ శ్రీను నాయక్, కె. రవి మరియు తదితర గ్రామ మరియు మండల యువకులు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగినది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version