
జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున నేతకని కులస్థులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈనెల జరిగిన పెదపెల్లి పార్లమెంట్ పరిధిలోని ధర్మపురి నియోజకవర్గ రాజారాం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో తెలంగాణ రాష్ట్ర నేతకాని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో నేతకని కార్పొరేషన్ 3,నెలల లోపు ఏర్పాటు చేసి కార్పొరేషన్ కొరకు హైదరాబాదులో అధునాతన భవనం ఏర్పాటుకు అలాగే అధ్యక్షత పదవి ఇచ్చి నేతకని కులస్తులకు న్యాయం చేస్తా అని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని. తెలంగాణ లోని నేతకాని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చెయ్యడం జరిగిందినీ,
అదేవిధంగా మే 13న జరిగే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి యువనేత ప్రజాసేవ చేసే నాయకుడు గడ్డం వంశీ కృష్ణ గారిని భారీ మెజార్టీతో నేతకాని కులస్తులు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలిపారు.
గత 70 సంవత్సరాల్లో నేతకాని కులస్తులకు ఎలాంటి రాజకీయ పదవుల ద్వారా గాని అదేవిధంగా ఆర్థికంగా గాని ఆదుకున్న ప్రభుత్వాలు లేవని తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క కులాస్తులకు గాని వర్గాలకు గానీ న్యాయం జరుగుతుందని రేపు రానున్న రోజుల్లో కూడా నేతకాని కులాస్తులకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి గా చెందబోతున్నారని,నేతకని కులస్తులు మీడియాతో మాట్లాడటం జరిగింది.ఈ యొక్క నేతకని కార్పొరేషన్ ఏర్పాటు కు కృషి చేసిన గౌరవ ప్రజా సేవకులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చెయ్యడం జరిగిందని, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారికి జైపూర్ మండల నేతకానీ కులాస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని నేతకాని కుల సంఘ నాయకులు
, జైపూర్ మండల కోఆర్డినేటర్ జనగామ మంగ, జాడి లక్ష్మి, దుర్గం మల్లేష్ ,కామెర మనోహర్ ,ఆగిడి లింగన్న, జనగామ పోషణ ,కామెర లక్ష్మణ్ ,నీలం శ్రీనివాస్ ,కుమ్మరి శేఖర్, దూట చంద్రయ్య ,గోదారి తిరుపతి, దూట రాజబాబు, జుమ్మిడి కిష్టయ్య, జాడి వెంకటేష్, మరియు నేతకాని కులస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.