Grand Birthday Celebrations for Nagurla Venkateshwarlu
ఘనంగా నాగూర్ల జన్మదిన వేడుకలు
మనసున్న మహానాయకుడు నాగుర్ల
ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ కుంకుమేశ్వర దేవస్థానం చైర్మన్ గందే వెంకటేశ్వర్లు
పరకాల,నేటిధాత్రి
పరకాల మండల ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఫర్టిలైజర్ ఫస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు జన్మదినం సందర్బంగా పట్టణంలోని ప్రముఖ
శైవక్షేత్రం కుంకుమేశ్వర స్వామి దేవస్థానము నందు ప్రత్యేక పూజ మరియు అర్చన కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం పరకాల ఫర్టిలైజర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాడికారి శివాజీ రావు నవత బ్రదర్స్ షాప్ ఆవరణలో నాగూర్ల యువసేన మరియు ఆరే సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి బ్రెడ్డు,పండ్లు,జ్యూస్ అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ పరకాల ముద్దుబిడ్డ ప్రజా నాయకుడు రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అన్నా అంటే ఆపదలో ఉన్నవారికి అండగా ఉండే నాయకుడు మన నాగుర్ల అని అలాంటి మంచి మనసున్న మహారాజు ఆయురారోగ్యాలతో ఆ దేవుని ఆశీస్సులతో మరెన్నో ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల ఫర్టిలైజర్ యజమానులు వ్యాపారులు నాగూర్ల అభిమానులు పలువురు పాల్గొన్నారు.
