వనపర్తి నేటిదాత్రి:
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని అత్యదిక మెజార్టీతో గెలిపించినందుకు ఓట్లు వేసిన ప్రజలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రాజీవ్ చౌక్ లో జరిగిన విజయోత్సవ సభలో కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం నిర్మించిన అక్కడ బిజెపి పార్టీని ఓ డ గోట్టారని అన్నారు. తెలంగాణ కర్ణాటక . సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 230 ఎంపీ సీట్లు ప్రజలు ఓట్ల వేసి పట్టం కట్టారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టడమే ఇoదుకు నిదర్శనమని అన్నారు . రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఢిల్లీలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుండి ఎన్నికైన ఎంపీ డాక్టర్ మల్లు రవి సహకారము తో అత్యధిక నిధులు తెచ్చుకొని వనపర్తి పట్టణం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు . తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీమతి సోనియాగాంధీ విమర్శించిన టిఆర్ఎస్ జాతీయ పార్టీ కి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు