పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామపంచాయతీని పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు పర్యటించడం జరిగింది. మొబైల్ ఆప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామ పంచాయితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రజలందరూ బాధ్యతల భావించాలని,ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటిని వృధా చేయకూడదని తెలియజేశారు. అనంతరం గ్రామంలోని పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి, రోడ్లపై ప్లాస్టిక్ చెత్త లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్ధాలు కనబడకుండా చూసుకోవాలని, ప్రతీ రోజు రహాదారులు మరియు మురికి కాలువలను శుభ్రం చేయుట, గ్రామ పంచాయితీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిత్యం నిర్వహించాలని, గ్రామంలోని రోడ్లపై, ఖాళీ ప్రదేశాలలో ఎటువంటి వ్యర్ధాలు లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ చెత్త కనబడకుండా చూసుకోవాలని, సేకరించిన డ్రై వేస్ట్ ను, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి సేగ్రిగేషన్ షెడ్ కు తరలించాలని పంచాయితీ కార్యదర్శికి మరియు పారిశుధ్య కార్మికులకు సూచించడం జరిగింది. నర్సరిలో ప్రతీ బ్యాగు తడిచే విధంగా ప్రతీ రోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పోయించాలని, ఖాళీ బ్యాగులు కనబడకుండా ప్రతీ బ్యాగులో స్టంప్స్ నాటుకోవాలని సూచించడం జరిగింది. పల్లె ప్రకృతి వనంను ప్రతిరోజు సందర్శించి మొక్కలను సంరక్షించాలని పంచాయితి కార్యదర్శికి సూచించారు. సెగ్రిగేషన్ షెడ్ ను సందర్శించి కంపోస్ట్ పిట్ లో కంపోస్ట్ ఎరువును తయారి విదానమును పరిశీలించి తగు సూచనలు చేశారు. కంపోస్ట్ ఎరువు తయారు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని, తయారు చేసిన కంపోస్ట్ ఎరువును నర్సరీ మరియు పల్లె ప్రకృతి వనం లోని మొక్కలకు వినియోగించాలని మరియు కంపోస్ట్ ఎరువును విక్రయించి అట్టి రూపాయలను గ్రామ పంచాయితీ సాధారణ నిధిలో జమచేయాలని పంచాయితీ కార్యదర్శికి తెలియజేశారు. స్మశాన వాటిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్మశాన వాటిక పరిసరాలలో ఉన్న మొక్కలను సంరక్షించాలని పంచాయితీ కార్యదర్శికి సూచించి తరువాత గ్రామ పంచాయితీ రికార్డులు తనిఖి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు,జైపూర్ మండలం పంచాయతీ అధికారి జి.అనిల్ కుమార్, టేకుమట్ల గ్రామపంచాయతీ కార్యదర్శి ఆర్.శ్రావణి,మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *