సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
అక్రమ అరెస్టులతో ఉద్యమాలనుఆ పలేరని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొలం రాజేందర్ అన్నారు. పలిమెలమండలం లోని బోదయిగూడెంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సూదుల శంకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారూ మాట్లాడుతూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మెడిగడ్డ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం 6 గంటలకు సిపిఐ ఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందు సాయిల్ గారిని భూపాలపల్లి లోని కారల్ మర్క్స్ కాలనిలో హౌస్ అరెస్టు చేయడం జరిగిందని వారు తెలియజేశారు,రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి 100 రోజుల గడువు అడిగింది అందరికి తెలిసేందే, ఆ గడువు పూర్తి కావాలని మేము వేచిచూస్తున్నపటికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినా, ప్రజలకు పిలుపు ఇవ్వకపోయినా అక్రమంగా అరెస్ట్ చేయడం విడ్డురంగా ఉందని వారు ఎద్దేవాచేశారు,ఇది ప్రభుత్వ అత్యుత్సానికి నిదర్శం అన్నారు,ఇలాంటి చర్యలకు పూనుకోవడం అప్రజాస్వామికమని వారన్నారు, అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ది పోచయ్య, పెద్ది బాపు,కాపుల.సంతోష్,కోవ్వూరి,లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.