MLA Revuri Visits Ailing Councillor
కౌన్సిలర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే రేవూరి
పరకాల,నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బొచ్చు మాధవీలత జాన్సన్ అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సేవలో నిత్యం ప్రజల మధ్య ఉంటూసేవలందిస్తున్న ప్రజాప్రతినిధులు తమ ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బొచ్చు మాధవీలత జాన్సన్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శలో మున్సిపాలిటీ చైర్మన్ పావుశెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు.a
