Bhagiratha Colony Residents Seek Drain Construction
ఎమ్మెల్యే గారు భగీరథ కాలనీపై దయ ఉంచండి
కాలువ నిర్మాణం కొరకు గోతి తవ్వి వదిలివేశారు
వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటున్న భగీరథ కాలనీ ప్రజల
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రం కర్నూల్ రోడ్ లో పెట్రోల్ పంపు దగ్గర మరి కుంట చెరువు అలుగు నీరు పోవడానికి మురికి కాలువ నిర్మాణం కొరకు గోతితవ్వి వదిలేశారని భగీరథ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షం వస్తే భగీరథ కాలనీ మరికుంట చెరువు అలుగు నీరు ఇళ్లలోకి వచ్చి అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు ఈ కాలువ నిర్మాణం చేపట్టి భగీరథ కాలనీ రాజనగరం శివార్లో పెద్ద కాల్వకు కలపాలని ప్రజలు తెలిపారు లేకపోతే వర్షపు నీరు ఇళ్లలోకి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో మాజీ జెడ్పిటిసి భగీరథ కాలనీలో మరి కుంట నీళ్ళు వెళ్లడానికి తాత్కాలికంగా దగ్గర ఉండి సిమెంట్ పైపు వేయించారని వారు పేర్కొన్నారు వెంటనే వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి దయ చూపి పాల కేంద్రం హెచ్ పి పెట్రోల్ పంపు దగ్గర తనిఖీ చేసి కాల్వ నిర్మాణం కొరకు సహకరించాలని ప్రజలు కోరారు తవ్విన కాలువ నిర్మాణం చేపటకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కాలువ నిర్మాణంపై గత వారంలో ప్రజావాణిలో భగీరథ కాలనీవాసులు న్యాయవాది పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది
